తెలుగు సినిమా ఇండిస్ట్రీ ని రెండు నెలల క్రితం 30 రోజులు స్వచ్ఛందంగా కోమలో (బంద్) పెట్టి అన్నీ సమస్యలకు పారిస్కారం మార్గం చూసిస్తాము అని ఆశ చూపిన బడా నిర్మాతలు ఇప్పుడు వారి వారి వ్యాపార లవాదేవులలో పడి పరిశ్రమ ముఖ్య సమస్యలను గాలికి వదిలేశారు.
చిన్న, చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ చేసుకోలేని పరిస్థితి మన ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే ఉంది. మన పక్క రాష్ట్రాలలో ఈ పరిస్తితి లేదు. మన తెలుగు సినిమా కి ఒకటి, రెండు లేదా 10 దియేటర్స్ దొరికితే కధా ఆ చిన్న సినిమాలో కంటెంట్ ఉందా లేదా అని తెలిసేది.!
ఒక పక్క దియేటర్స్ కావాలి అంటే రెంట్ కట్టు అంటున్నారు. చిన్న నిర్మాత దైర్యం చేసి అప్పో సొప్పో చేసి సినిమా నిర్మిస్తే, అది ప్రజల లోకి తీసుకువెళ్లాడానికి మరలా డబ్బులు ఖర్చు. ఈ దుస్తితి మన తెలుగు సినీ పరిశ్రమ లోనే ఉంది. ఈ దియేటర్స్ రెంటల సిస్టమ్ ఎప్పుడు పోతుందో అప్పుడు మాత్రమే చిన్న సినిమా నిర్మాత బాగుపడతాడు.
చిన్న సినిమా కంటెంట్ బాగున్నప్పటికీ ప్రేక్షకుడు ఇల్లు వదిలి థియేటర్ కు రావడం చాలా కస్టమ్ అవుతుంది. 10 లేదా 20 రూపాయలు ఉండవలసిన సమోసా, పాప్ కార్న్ వొందో నూట యాబైయో పెట్టి కోనాలి అంటే ఎలా అని సామాన్య సినీ ప్రేక్షకుడి ఆవేదన. వారం రెండు వారాలు ఆగితే మొబైలు ఫోన్ లో చూసుకోవచ్చు లే అనే బారోసా స్మార్ట్ ఫోన్ మరియు మొబైలు డాటా కంపిణీలు ఇస్తున్నాయి కాబట్టి దియేటర్ వరకూ వచ్చినా టికెట్ కొని లోపలికి వెళ్తూ లేదు.
ఈ దుస్తితి మారాలి అంటే ఎవరు మారాలి ? మరలా గుడ్డు ముందా కోడి ముందా అని కోడి బుర్రలు ఆలోచిస్తాయి. గవర్నమెంట్స్ కూడా పట్టించుకోవడం లేదు. ఎందులకంటే, సినిమా వారు మా లా ప్రజా సేవ చేస్తున్నారా ? వాళ్ళు చేసేది వ్యాపారమమే కదా అంటున్నారు.
సొ చిన్న సినిమా నిర్మాతలు ముందుగా మీరు ఈ సమస్య కు పారిస్కారం దొరికే వరకూ ఏదోకటి చేయండి లేదా సినిమా లు తియ్యడం ఆపేయండి. సినీ ప్రేక్షకులు అయితే చాలా క్లియర్ గా ఉన్నారు. పెద్ద సినిమా లేదా భారీ బడ్జెట్ సినిమా అంటేనే దియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఓ వందో, వేయ్యొ ఖర్చు పెట్టడానికి రెఢీ అవుతున్నారు.
మీరు తీసే చిన్న సినిమాలు మా లాంటి మీడియా సంస్థలు చేసే పాజిటివ్ ప్రచారం విని, చదివి ఆ మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమా చూడాలనే కొరక ఉన్నా దియేటర్ కి రాకుండా సినిమా చూసే మరో మార్గం వెదుకుతున్నారు. దీనికి ప్రేక్షకులను తప్పు పట్టెకంటే ఎందుకు దియేటర్ కి దూరం అవుతున్నారో తెలుసుకొని సినిమా తియ్యండి.