మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “స్కై“. ఈ చిత్రాన్ని వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్ లో నాగి రెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు.
పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “స్కై” సినిమా నుంచి ‘తపనే తెలుపగ..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
‘తపనే తెలుపగ..’ పాటకు పృథ్వీ పెరిచెర్ల అందమైన లిరిక్స్ అందించగా వైష్ణవి ఆకట్టుకునేలా పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ శివ ప్రసాద్ బ్యూటిపుల్ మెలొడీ ట్యూన్ తో కంపోజ్ చేశారు. ‘తపనే తెలుపగ..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘తపనే తెలుపగ పలుకే, ఉసురే నిలిపెను పిలుపే, మనవే వినగా మనసే, మదినే గుడిలా మలిచే, అలసిన సమయం జతగా, అనుమతి అడగక రావా, కురిసెను విరహం కనులా, రగిలిన హృదయపు సడిలో..’ అంటూ సాగుతుందీ పాట. హీరో హీరోయిన్స్ మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టిపై కూల్ మెలొడీగా ఆహ్లాదకరమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు.
నటీనటులు:
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ భారతి, రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్ కే మణి బమ్మ, తదితరులు
టెక్నికల్ టీమ్;
బ్యానర్ – వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – పృథ్వీ పెరిచెర్ల, డీవోపీ – రసూల్ ఎల్లోర్,ఎడిటర్ – సురేష్ ఆర్స్, పబ్లిసిటీ డిజైనర్ – కృష్ణ డిజిటల్స్, డిజిటల్ మీడియా – వినీత్ గౌడ్, ప్రొడ్యూసర్స్ – నాగిరెడ్డి గుంటక, పృథ్వీ, పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు, డైలాగ్స్ , స్టోరీ – పృథ్వీ పెరిచెర్ల, మురళీ కృష్ణంరాజు, మ్యూజిక్ – శివ ప్రసాద్, లిరిక్స్ – పృథ్వీ పెరిచెర్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – స్వాతి పెన్మెత్స, లిఖిత గుంటక, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్).