SKANDA Movie Telugu Review: బోయపాటి ఫామిలీ యాక్షన్ డ్రామా మాస్ ప్రేక్షకులకు నచ్చిందా ?

skanda review 7 e1695883925856

మూవీ: స్కంద 

విడుదల తేదీ :సెప్టెంబర్ 28, 2023

నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, ప్రిన్స్ సిసిల్, గౌతమి, ఇంద్రజ, రాజా, శ్రీకాంత్, శరత్ లోహితాశ్వ, పృథ్వీరాజ్ మరియు ఇతరులు

దర్శకుడు : బోయపాటి శ్రీను

నిర్మాత: శ్రీనివాస చిట్టూరి

సంగీతం: ఎస్ థమన్

సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే

ఎడిటర్: బిక్కిన తమ్మిరాజు

మూవీ రివ్యూ: స్కంద (Skanda Movie)

టాలీవుడ్ లో లక్ష్మీ బాంబ్ లాంటి  ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా అలాగే హీరోయిన్స్ లో కూడా ఎనర్జీకి నిర్వచనంలా మారిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ యాక్షన్ డ్రామా “స్కంద”. మరి మంచి హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో మా 18F మూవీస్ టీం  సమీక్ష చదివి  తెలుసుకుందామా !.

skanda review 2 e1695883956373

కథ ని పరిశీలిస్తే (Story line):

స్కంద  సినిమా కథ లోకి  వెళ్తే,  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కూతురు తన కూతురికి గ్రాండ్ గా పెళ్లి చేస్తున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి  కొడుకు ఏపీ సీఎం కూతురుని  పెళ్లి మండపం నుండి కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళిపోతాడు.   దీనితో తనకి జరిగిన ఘోర అవమానంతో తన కూతురిని వెనక్కి తీసుకురావాలని అలాగే తీసుకెళ్లిన తెలంగాణ సీఎం కొడుకుని చంపేందుకు ఓ సరైన వ్యక్తి కోసం చూస్తాడుఏపీ సిఎం. అయితే ఈ టైం లో భాస్కర రాజు(రామ్ పోతినేని) ఎంటర్ అవుతాడు.

ఇక ఇక్కడ నుంచి కథ ఎలాంటి మలుపి తీసుకుంది?

ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ మెన్ అయినటువంటి రుద్రగంటి రామకృష్ణ రాజు(శ్రీకాంత్) ఎందుకు ఉరిశిక్షకు గురి అవుతాడు ?

ఇద్దరు ముఖ్యమంత్రులకి రామకృష్ణ రాజుకి ఏమైనా శతృత్వం ఉందా ?

భాస్కర రాజు (రామ్) కి రామకృష్ణ రాజు కి మద్య  సంబంధం ఏమిటి ?

అసలు ఈ భాస్కర రాజు ఎవరు? ఎందుకు ఇద్దరు సిఎం లను ఎదుర్కొంటాడు ?

డ్యూయల్ షేడ్ లో కనిపించే రామ్ ఒక్కడేనా ఇద్దరా అనేది తెలియాలి?

అంటే ఈ సినిమా వెండితెరపై చూడాల్సిందే. అంతవరకు మా 18F మూవీస్ రివ్యూ చదివి వెళ్ళండి. ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి.

కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):

బోయపాటి అన్ని సినిమాల్లో లానే ఈ చిత్రం కూడా చాలా రెగ్యులర్ యాక్షన్ మసాలా డ్రామా కధనాన్ని  ( స్క్రీన్ – ప్లే)  రాసుకొన్నాడు . సినిమా మొదటి ఫ్రేమ్ నుండి  సాలిడ్ గా మొదలైనా రెండవ అంకం (సెకండ్ హాఫ్)  మాత్రం కాస్త నెమ్మదిస్తుంది. దీనితో సినిమాలో మొదటి అంకం ( ఫస్టాఫ్) చల్లా హెవి గా ఉంటుంది.

సినిమా కధ కి కావలసిన కధనాన్ని లాజిక్స్ లేకుండా వండి వారచాడు బోయపాటి. సామాన్య ప్రేక్షకుడు ఎటువంటి లాజిక్ లు  ఆశించకుండా సినిమా చూస్తే బెటర్ అలానే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు బాగా ఓవర్ గా కూడా అనిపిస్తాయి. ఇంకా మరో డిజప్పాయింట్ చేసే అంశం సినిమాలో పాటలు గాని వాటి ప్లేస్ మెంట్ మూలన సినిమా మరింత ల్యాగ్ అనిపిస్తుంది.

వీటితో పాటుగా సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ లో ఎవరికి ఫుల్ గా పాత్ర ఉండదు. ముఖ్యంగా  శ్రీలీల పాత్రకి ఇంపార్టెన్స్ కూడా అంత ఎక్కువ కనిపించదు. ఇంకా కొన్ని సీక్వెన్స్ లు చూస్తే బోయపాటి గత కొన్ని సినిమాలు కూడా గుర్తు రాక మానవు.

skanda review 1

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

దర్శకుడు బోయపాటి శ్రీను అఖండ తర్వాత ఎలాంటి సబ్జెక్ట్ ని తీసుకుంటాడా అని చూసే సమయంలో స్కంద అనే పొలిటికల్ రెవెంజ్ సబ్జెక్టు పట్టుకున్నారు. అయితే హీరో పాత్రని బోయపాటి ఓ రేంజ్ లో ఆవిష్కరించారని చెప్పడంలో సందేహం లేదు. అలాగే డీసెంట్ ఎమోషన్స్ డైలాగ్స్ కూడా ఆయన ప్రెజెంట్ చేశారు. అయితే బోయపాటి సినిమా అంటేనే మాస్ ఆడియెన్స్ కోసం స్టోరీలు, లాజిక్ లు పక్కన పెట్టేయాలి అన్నట్లు అయ్యింది.

 హీరో రామ్  డ్యూయల్ షేడ్స్ లో కనిపించి   తన అద్బుతమైన నటనతో  ఈరగతిశాడు. రెండు షేడ్స్ లో కూడా రామ్ తనదైన మాస్ ని చూపించాడు. బోయపాటి డిజైన్ చేసిన మ్యాచో పర్సనాలిటీ లో రామ్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యి యాక్షన్ సీక్వెన్స్ లలో అదరగొట్టేసాడు.

అంతేకాకుండా టైటిల్ కార్డ్ నుండి ఇంటర్వెల్ బాంగ్ వరకూ  బోయపాటి తన మాస్ మసాలా యాక్షన్ ఎపిసోడ్స్ తో   సాలిడ్ స్టార్ట్ ఇచ్చారు. ఇక బోయపాటి రాసుకున్న హీరో క్యారెక్టరైజేషన్ కూడా సినిమాలో ఓ హైలైట్ అని చెప్పొచ్చు.

ఇక హీరోయిన్ శ్రీ లీల కూడా తన బ్యూటిఫుల్ లుక్స్ అండ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ఇంకా రామ్ తో కూడా తన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. డాన్స్ లో కూడా రామ్ ఎనర్జీ కి ఈక్వల్ గా అదరగొట్టింది.

IMG 20230925 WA0182

మిగిలిన ముఖ్య పాత్రల్లో నటించిన శ్రీకాంత్, ఇంద్రజ, ప్రిన్స్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు. ఇంకా యంగ్ నటి సాయి మంజ్రేకర్ కూడా ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటుది. ఇక వీటితో పాటుగా సినిమాలో బోయపాటి డిజైన్ చేసుకున్న యాక్షన్ సీక్వెన్స్ లు తన మార్క్ ట్విస్ట్ లు ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి.

skanda review e1695884029369

సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

స్కంద చిత్రం లో నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ప్రతి ఫ్రేమ్ ఎక్కువ ఆర్టిస్ట్స్ తో కలర్ ఫుల్ గా నుండుగా ఉంది.

 థమన్ అందించిన స్కోర్ బాగుంది. కానీ పాటలు మాత్రం అంత అప్ టు మార్క్ అనిపించవు. వినడానికి బాగున్నా ఏదో ఒకే మూసలో ఉన్నాయి.

సంతోష్ డిటాకే అందించిన  సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ లో కలర్ ఫుల్ లైటింగ్ హై లైట్ అని చెప్పవచ్చు. యాక్షన్ షాట్స్ కూడా బాగా డిజైన్ చేశారు.

అమ్మి రాజు  ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. మెయిన్ గా సాంగ్స్ విషయంలో  ఎడిట్ చేసి  వుండవలసింది.

IMG 20230925 WA0055

18F మూవీస్ టీం ఒపీనియన్:

“స్కంద” సినిమా రెగ్యులర్ బోయపాటి మార్క్ కంటే కొంచెం ఎక్కువ మాస్ యాక్షన్  డ్రామా అని చెప్పొచ్చు.  రామ్ అయితే బోయపాటి మాస్ లుక్ లో అదిరిపోయాడు. తన క్యారెక్టరైజేషన్ గాని అందులో రామ్ వేరియేషన్స్ మ్యానరిజంలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. అన్నీ యాక్షన్ సీక్వెన్స్ లు వెరే లెవెల్ లో రామ్ ని ప్రెసెంట్ చేస్తాయి. ప్రతి ఫైట్ లో హీరో  ఎలివేషన్ స్లో మోషన్ షాట్స్ అయితే మాస్ ఆడియెన్స్ కి నచ్చుతాయి. ఒవెరల్ గా సినిమా మాత్రం  కొంచెం సాగదీతగా, ఎక్కువ గా యాక్షన్ లో  ఓవర్ దొస్  అనిపిస్తుంది.

కానీ , బోయపాటి రెగ్యులర్ మాస్ సినిమాలు ఇష్టపడేవారు, అలాగే మాస్ ఆడియెన్స్ కి ఈ వారాంతంలో ఆకట్టుకుంటుంది. ఇక మిగతా వారికి ఒక్కసారికి ఓకే అనిపిస్తుంది. లాజిక్ లు వేతకకుండా బోయపాటి మ్యాజిక్ చూస్తే చాలు. సౌండ్ పొల్యూసన్ ఇస్టపడని వారు థియేటర్ కి వెళ్లకపోవడం మంచిది.

టాగ్ లైన్: పైసా వసూల్ ప్యాకేజ్ !

18FMovies రేటింగ్: 3 / 5 

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *