SK Ayalaan Movie Teaser Out: శివకార్తికేయన్, ఏలియన్ సినిమా ‘అయలాన్’ టీజర్ హాలీవుడ్ రేంజ్‌లో ఉంది !

ayalaan teaser out e1696607218770

శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘అయలాన్’. ఏలియన్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ పతాకాలపై కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్. రవికుమార్ దర్శకుడు. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పంపిణీ చేస్తోంది. తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అందుకున్న ‘వరుణ్ డాక్టర్’ సినిమా తర్వాత శివకార్తికేయన్, కెజెఆర్ స్టూడియోస్, గంగ ఎంటర్టైన్మెంట్స్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది.

‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే తొలిసారి. సంక్రాంతికి  తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.

 Alayan Teaser Review:

ఒక్క మాటలో చెప్పాలంటే… ‘అయలాన్’ టీజర్ ఒక విజువల్ గ్రాండియర్. రెండు నిమిషాల వ్యవధిలో కథను చెప్పడంతో పాటు ఎంత లావిష్, రిచ్‌గా సినిమా తీశారనేది చూపించారు.

ఒక్కసారిగా భూమి మీద వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోవడం, ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం డైనోసార్ల గుడ్లు తవ్వకాల్లో బయట పడటం వంటివి చూపించి కథపై క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఒక్కసారి శివకార్తికేయన్ ఎంట్రీతో ఆసక్తి మరింత పెరిగింది. ప్రపంచాన్ని ఓ ఎనర్జీతో శాసించాలని శరద్ కేల్కర్ ప్రయత్నించడం…

అతడిని ఎదుర్కోవడానికి సామాన్య యువకుడు ఏం చేశాడు?

ఇషా కొప్పికర్ గన్ పట్టుకుని ఏలియన్ ని ఎందుకు ఫాలో చేస్తున్నారు?

హీరో – ఏలియన్ మధ్య స్నేహం వల్ల ఏం జరిగింది?

భూమి మీద ఏలియన్ ఏం చేసింది?

 

అనేది స్క్రీన్ మీద చూడాలి. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం సూపర్బ్ ఉంది. టీజర్ చూస్తే నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదని అర్థం అవుతోంది.

Alien Movie Ayalana Sivakarthikeyan

కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ ”హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని సినిమా భారతీయ ప్రేక్షకులకు అందించాలని క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. ఎక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండటంతో, ఆ వర్క్ కంప్లీట్ కావడానికి ఎక్కువ టైమ్ పట్టింది. టీజర్ శాంపిల్ మాత్రమే. ట్రైలర్, పాటలు ఇంకా బావుంటాయి. ఏఆర్ రెహమాన్ గారి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. శివకార్తికేయన్, మా టీమ్ సినిమా కోసం చాలా కష్టపడ్డారు” అని చెప్పారు.

Alien Movie Ayalana Sivakarthikeyan2

శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమాలో ఇషా కొప్పికర్, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫేమ్ శరద్ కేల్కర్, సీనియర్ హీరోయిన్ భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ ఇతర తారాగణం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ‘అయలాన్’కు వర్క్ చేశారు. ఈ సినిమాకు ఎడిటర్ : రూబెన్, పోస్టర్ డిజైన్ : గోపి ప్రసన్న, ప్రొడక్షన్ డిజైన్ : టి. ముత్తురాజ్, వీఎఫ్ఎక్స్ : బిజోయ్ ఆర్పుతరాజ్ (ఫాంటమ్ ఎఫ్ఎక్స్), కాస్ట్యూమ్ డిజైన్ : పల్లవి సింగ్, నీరజా కోన, కొరియోగ్రఫీ : గణేష్ ఆచార్య, పరేష్ శిరోద్కర్, సతీష్ కుమార్, సంగీతం : ఏఆర్ రెహమాన్, నిర్మాతలు : కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా, దర్శకత్వం : ఆర్. రవికుమార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *