మూవీ: సార్
విడుదల తేదీ : ఫిబ్రవరి 17, 2023
నటీనటులు: ధనుష్, సంయుక్తా మీనన్, సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, ‘హైపర్’ ఆది, ‘ఆడుకాలమ్’ నరేన్, మొట్ట రాజేందర్, హరీష్ పేరడీ, పమ్మి సాయి తదితరులతో పాటు ప్రత్యేక పాత్రలో సుమంత్
దర్శకుడు : వెంకీ అట్లూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీత దర్శకులు: జివి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
ఎడిటర్: నవీన్ నూలి

సార్ సినిమా రివ్యూ (SIR Movie Review):
కొలీవుడ్, బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ ని మర్చిపోయిన ధనుష్, తెలుగు లో కూడా తన తమిళ సినిమాల డబ్బింగ్ తో కాకుండా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేద్దామని ఎదురుచూస్తున్న టైమ్ లో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన కధ నచ్చి ఒప్పుకొన్న సినిమా సార్ (తెలుగు) వాతి (తమిళ్ ).
తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న హీరో ధనుష్ ని హీరో గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటివరకూ చూసిన టీజర్, ట్రైలర్‌లను గమనిస్తే.. విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ కాలేజీలపై యువకుడు చేస్తున్న పోరాటంలాగా అనిపిస్తుంది.
‘సార్’ సినిమాతో ధనుష్, వెంకీ అట్లూరి ఏం చెప్పాలనుకున్నారు? అనే విషయం తెలియాలంటే ముందు కథలోకి వెళ్లాల్సిందే.

కధ ను పరిశీలిస్తే (story line):
బాలగంగాధర్ తిలక్ (Dhanush) త్రిపాఠి విద్య సంస్థలలో మ్యాథ్స్ జూనియర్ లెక్చరర్. కార్పొరేట్ కోలేజెస్ మీద మోజుతో విద్యార్దుల తల్లి తండ్రులు, ప్రభుత్వ ఉపాద్యాయులు వెళ్ళిపోవడం తో ప్రభుత్వ కళాశాలలు మూతపడుతుంటాయి. అలా మీట పడిన కళాశాలలు మరలా కార్పొరేట్ యాజమాన్యం దత్తత పేరుతో వ్యాపారం చేయాలని నిరనహించుకొంటాయి.
అనకాపల్లి దగ్గర సిరిపురం అనే గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి బాలూ సిద్దపడతాడు. ఆ కళాశాల లోని స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్ గా ప్రమోషన్ వస్తోందనే ఆశతో బాలు ఆ కాలేజీకి వెళ్తాడు.
అయితే, ఆ ఊరి లో ఉన్న పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన తెలివైన మాటలతో, చేతలతో ఆ గ్రామం లోని కళాశాల స్టూడెంట్స్ అదే కోలేజ్ లో ఉన్న బయోలాజి లెక్చరర్ ను ప్రభావితం చేస్తాడు.
అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య లో
బాలు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ?,
మీనాక్షి (సంయుక్తా మీనన్)తో బాలు కి సంబంధం ఏమిటి ?,
ఓక లె క్చరర్ మొత్తం కార్పొరేట్ విద్య మీద యుద్దం చేశాడా ?
ఇంటర్మీడియట్ కాలేజెస్ ఎందుకు మూతబడుతున్నాయి ?
చదువులు సామాన్య ప్రజలకు ఎందుకు భారంగా మారుతున్నాయి ?
బాలు గ్రామం నుండి ఎందుకు బహిస్కరించ బడ్డాడు ?
బాలు మీనాక్షీ ల మద్య ప్రేమ పాఠాలు ఎలా ఉన్నాయి ?
బాలు విద్యార్దుల జీవితాలలో నింపిన వెలుగులు ఏమిటి ?
మీనాక్షీ బాలు కి ఎలా సహాయం చేసింది ?
త్రిపాఠి – బాలు మద్య గొడవ ఏంటి ?
వంటి ప్రశ్నలు మీకు ఇంటరెస్టింగ్ అనిపిస్తే వెంటనే థియేటర్ కి వెళ్ళి సినిమా చూసేయండి. సార్ సినిమా చూస్తున్నప్పుడు పిల్లల తల్లి – తండ్రులు ఏదో సీన్ లి కనెక్ట్ అయ్యి కాంతి తడి పెట్టుకొంటారు. కానీ ప్రస్తుత జనరేసన్ విద్యార్దులు ఎలా రిసీవ్ చేసుకొంటారో చూడాలి.
కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (screen – Play):

తళ్ళి తండ్రుల మనసును కదిలించే మెసేజ్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలతో సార్ సినిమా ఆకట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ, కధనం లో చూపించిన కమర్షియల్ అంశాలు పెద్దగా ఆకట్టుకోవు.
మొదటి అంకం ( ఫస్ట్ హాఫ్ ) నుండి స్క్రీన్ ప్లే చాలా స్లో గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ట్విస్టులు, త్రిల్స్ లేకుండా లీనియర్ గా కధనం సాగడం తో ప్రేక్షకులకు నెక్స్ట్ సీన్ ఏమి జరుగుతుందో తెలిసిపోతుంది. ముఖ్యంగా దర్శకుడు వెంకీ అట్లూరి రెండవ అంకం (సెకండ్ హాఫ్) కథనాన్ని ఆసక్తికరంగా మలచడం లో విపలమయ్యాడు.
కొన్ని కీలకమైన సన్నివేశాలను పర్వాలేదనిపించిన్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాలు చాలా కృత్రిమంగా ఉన్నాయి. సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది ? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు వెంకీ అట్లూరి మాత్రం ఆ దిశగా సినిమా కధనాన్ని నడపలేదు.
ఇక సినిమా చివరి గట్టం (క్లైమాక్స్) లో వచ్చే సీన్స్ ఏవరేజ్ గా అనిపిస్తాయి. దర్శకుడు ఎవరిని గెలిపించాలి అనుకొన్నాడో అర్దం కాదు. కార్పొరేట్ విద్య వేత్తలలో ( త్రిపాఠి ) మార్పుచూపించలేదు, వారు అనుకొన్న పని చేశారు.
ఇక ఉన్నత చదువు చదివిన స్టూడెంట్స్ ద్వారా మార్పు ని ఎక్స్పర్ట్ చేస్తే అది ప్రభుత్వ విద్య ప్రణాళిక లానే ఎప్పటికీ విద్యార్దులకు అందని ద్రాక్ష గానే ప్రధిమిక విద్య ఉంటూ అందుకొనే కొద్దిమందికే అందుతుంది .
దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

చదువు మనిషి జీవాన విధానాన్ని, ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుంది అనే పాయింట్ తో ఈ సార్ చిత్రం సాగింది.. చదువు ని ఫైవ్ స్టార్ హోటల్ లో డిష్ లా అమ్మడం కంటే గుళ్ళో ప్రసాదం లా పంచితేనే దాని గొప్పతనం గొప్పగా ఉంటుంది అని చెప్పిన కధ ఇది..
గ్రామం లో కులం పేరుతో అణిచివేయబడిన వర్గాల స్టూడెంట్స్ ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి పై సమాజం ఒత్తిడి ఎలా ఉంది ? వంటి అంశాలను సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకుడు వెంకీ.
దర్శకుడు వెంకీ అట్లూరికధ ఎంపిక సినిమాకే హైలైట్ గా నిలుస్తోంది. ఆయన రాసిన కొన్ని డైలాగ్స్ బాగున్నా కొన్ని చోట్ల లాజిక్ లేని సినీ మాజిక్ కొ కధను నడిపించాడు.
మ్యాథ్స్ లెక్చరర్ బాలుగా ధనుష్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ధనుష్ తన అద్భుత నటనతో మెప్పించాడు అని చెప్పవచ్చు. ఊరు నుంచి బహిస్కరించ బడి వెళ్లిపోయే సీన్ లో ధనుష్ నటన చాలా బాగుంది. అలాగే, సినిమా అంతం లో ( క్లైమాక్స్) కూడా ధనుష్ పలికించిన హావభావాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి.
ఇతర కీలక పాత్రల్లో నటించిన సుమంత్ మూర్తి కెరక్టర్ లో అంతగా సూట్ కాలేదు. ధనుష్ స్టూడెంట్ సుమంత్ అంటే కనెక్ట్ అవ్వడం కస్టమ్. త్రిపాఠి గా సముద్రఖని బాగానే చేసినా ఎందుకో ఆ పాత్రకి ఎండ్ లేకుండా ఎందుకు వదిలేశాడో దర్శకుడు వెంకీ నే చెప్పాలి.
జబర్దస్ట్ కమిడియన్ హైపర్ ఆది, మలయాళ నటుడు హరీష్ పేరడీ బాలూ తోటి సహ లెక్చరర్శ్ గా బాగానే నటించారు కానీ ఆ పాత్రలు త్వరగా ముగించకుండా ఎండ్ వరకూ ఉంచితే ఇంకా కొంచెం కామిడీ పండేది. ఆడుకాలం నరేన్, తనికెళ్ల భరణి, సాయి కుమార్ అలాగే మిగిలిన నటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

సమాజం లోని మంచి కధ ను తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు వెంకీ ఆయా కధ కు ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో విజయం చేరుకో లేక పోయాడు అనిపిస్తుంది. దర్శకుడు రూపొందించిన కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.
సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ సంగీతం బాగుంది. బాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ని బాగా ఎలివెట్ చేశాయి. యువరాజు సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
నవీన్ నూలి ఎడిటింగ్ విషయానికి వస్తే.. సెకండ్ హాఫ్ ను ఇంకా ఎఫెక్టివ్ గా ఎడిట్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది .
సితార, ఫార్చూన్ 4 మరియు శ్రీకర్ స్టూడియోస్ నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. కానీ కాస్టింగ్ లో ఎక్కువ తమిళ నటులు ఉండుట వలన తమిళ్ డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది.
18f మూవీస్ టీం ఒపీనియన్:

ప్రజలకు ప్రాధిమిక అవసరాలు అయిన విద్య వైద్యం ను ఫ్రీ గా అందించవలసిన పాలకులు కార్పొరేట్ ముసుగులో సిస్టమ్ లోని చిన్న చిన్న లూప్ లను అడ్డుపెట్టుకొని ఎలా వ్యాపారం చేస్తున్నారో గత 30 సంవత్సరాలుగా చూస్తున్నాము.
ఈ సార్ సినిమా కధ విద్య వ్యాపారం మీద అల్లుకొన్న కధ అయినా ఎందుకో 22 సంవత్సరాల బాక్ కు వెళ్ళి 1999 లో జరిగే పిరియాడిక్ ఫిల్మ్ గా తీశారో దర్శక – నిర్మాత కు మాత్రమే తెలియాలి. ప్రస్తుతం కూడా ప్రదిమిక, మద్యమిక మరియు ఉన్నత విద్య అనేది కార్పొరేట్ మాయలో మరంత ఎత్తులో ఉండి మద్య తరగతి పిల్లలకు అందని ద్రాక్ష గానే మిగిలింది
20 సంవత్సరాల క్రితం బాలగంగాధర్ ( సార్ సినిమా హీరో ) స్టార్ట్ చేసిన విద్య సంస్కరణ ఇప్పుడు ఫలాలను ఇస్తుందా అంటే ఏమి లేదు. మంచి మెసేజ్ కలిగిన కధ ను పట్టుకొని దర్శకుడు వెంకీ లాజిక్ లేని మాజిక్ చేశారా అనిపిస్తుంది.
ఇలాంటి బర్నింగ్ పాయింట్ ని తీసుకొని సోషల్ మెసేజ్ కి కొంచం కమర్షియల్ టచ్ ఇచ్చి పెద్ద కమర్షియల్ సినిమా చేద్దాము అనుకొన్న దర్శకుడు వెంకీ అద్బుతమైన నటన పాటువం కలిగిన ధనుష్ తో ఏమి చెప్పాలి అనుకొన్నాడో, ఏమి చూపించాలి అనుకొన్నాడో సార్ సినిమా చూస్తే మీకే తెలుస్తుంది.
టాగ్ లైన్: లాజిక్ లేని మాజిక్ ర్యాంకులతో పాస్ చేసిన సార్.
18f Movies రేటింగ్: 2.75/ 5
* కృష్ణ ప్రగడ.