Singareni Jung siren filming begins soon: “జార్జ్ రెడ్డి” డైరెక్టర్ కథతో  తెరకెక్కనున్న “సింగరేణి జంగ్ సైరెన్” మూవీ !

singareni jung movie e1713690364924

జార్జ్ రెడ్డి సినిమా ఫేం డైరెక్టర్ జీవన్ రెడ్డి రాసిన కథతో తెరకెక్కనున్న కొత్త సినిమా “సింగరేణి జంగ్ సైరెన్”. ది అండర్ గ్రౌండ్ లైవ్స్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ధూమ్ర వారాహి బ్యానర్ పై నూతన దర్శకుడు వివేక్ ఇనుగుర్తి రూపొందించనున్నారు. 1999 లో సింగరేణిలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సర్వైవల్ డ్రామా మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే “సింగరేణి జంగ్ సైరెన్” సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా నటీనటులు, ఇతర వివరాలు ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన మేడే రోజున ప్రకటించనున్నారు. తెలంగాణ నేపథ్య సినిమాలు మంచి ఆదరణ పొందుతున్న ఈ టైమ్ లో పక్కా తెలంగాణ నేటివ్ మూవీగా “సింగరేణి జంగ్ సైరెన్” సినిమాను పిక్చరైజ్ చేయనున్నారు.

టెక్నికల్ టీమ్:

కాస్ట్యూమ్స్ – ప్రసన్న దంతులూరి, అసొసియేట్ రైటర్: లాటి ఫ్లింకారీ, ఎడిటింగ్ – హరీశ్ మధురెడ్డి, సినిమాటోగ్రఫీ – రాకీ వనమాలి, స్టిల్స్ : సేగు వికాస్, వీఎఫ్ఎక్స్ – మధు అర్జ్, మ్యూజిక్- సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – లలన్ మహేంద్ర, టి. మురళి రఘువరన్, పీఆర్ఓ- జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), కథ – జీవన్ రెడ్డి, దర్శకత్వం – వివేక్ ఇనుగుర్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *