సిద్ధు జొన్నలగడ్డ  ‘జాక్’ నుంచి ఫస్ట్ సింగిల్’ రిలీజ్ ! 

IMG 20250307 WA0180 e1741353209219

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌తో అంచనాలు పెరిగాయి.

ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్‌తో పాటుగా ఏదో కొత్త పాయింట్‌ను చెప్పబోతోన్నారని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.

IMG 20250307 WA0189

‘పాబ్లో నెరుడా’ అంటూ హుషారుగా సాగే ఈ ఫస్ట్ సింగిల్‌ను వనమాలి రచించారు. అచ్చు రాజమణి బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇక జానీ మాస్టర్ కొరియోగ్రఫీ మరింత అట్రాక్షన్‌గా నిలిచింది. కలర్ ఫుల్‌గా కనిపించే ఈ పాటకు బెన్నీ దయాల్ వాయిస్ అద్భుతంగా సెట్ అయింది.

సిద్దు నుంచి ఎనర్జిటిక్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసి అతని అభిమానుల్ని ఆకట్టుకుందని చెప్పొచ్చు. హీరో పరిచయం గీతంతో అంచనాల్ని మరింతగా పెంచేసినట్టు అయింది.

సిద్ధు జొన్నలగడ్డకు జోడిగా ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య నటించారు. అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *