హీరో సిద్ధార్థ్ ”మిస్ యు”  తెలుగులో విడుదల ఎప్పుడంటే !

IMG 20241120 WA0182 scaled e1732109533365

హీరో సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యు. ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 29న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఈ మేరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 7 మైల్స్ పర్ సెకండ్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించారు.

IMG 20241120 WA0222

లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్దార్థ్ మునుపటిలా తనలోని రొమాంటిక్ వైబ్స్ చూపించబోతున్నాడు. అదే విధంగా ఈ చిత్ర కథ ఫీల్ గుడ్ కంటెంట్ తో ఉండబోతోంది. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ.. ప్రేమలో ఉన్న బలహీనతల చుట్టూ ఈ చిత్ర కథ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. బ్రేకప్ తర్వాత కూడా ప్రేమ ఎంత బలంగా మారుతుందో అని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

IMG 20241120 WA0219

ఈ చిత్రంలో జెపి, పోన్వన్నన్, బాల శరవణన్, కరుణాకరన్ లాంటి నటులు నటించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. కేజీ వెంకటేష్ సినిమా టోగ్రాఫర్ గా వ్యవహరించారు. సంగీతంతో పాటు సినిమాలోని విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి అని చిత్ర యూనిట్ తెలిపింది.

ప్రేమలో సెకండ్ ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఎంటర్టైనింగ్ గా అదే సమయంలో ఎమోషనల్ గా చెప్పినట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నారు.

నవంబర్ 29న రిలీజ్ అవుతున్న మిస్ యు చిత్రాన్ని ఏషియన్ సురేష్ తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *