శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా వస్తున్న సిందూరం సినిమా థియేటర్స్ లో విడుదల ఎప్పుడంటే! 

IMG 20221222 WA0094 e1671900060117

 

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సిందూరం. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

IMG 20221222 WA0096

ఈ సందర్భంగా దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి మాట్లాడుతూ

సిందూరం అలరిస్తుందని ఆశిస్తున్నాను. నక్సల్స్ పాయింట్ తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నవేశాలను సిందూరం సినిమాలో చూపించడం జరిగింది. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవర్ఆల్ గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హై ఇంటెన్షన్ సిందూరం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలిపారు.

IMG 20221222 WA0095

నిర్మాత ప్రవీణ్ రెడ్డి జంగా మాట్లాడుతూ…

సిందూరం సినిమాలో నటించిన అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. మంచి సినిమా తీసామనే సంతృప్తి ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తోన్న సిందూరం అందరికి నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

నటీనటులు: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ(పవి టీచర్)

IMG 20221222 WA0104

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్

డైరెక్టర్: శ్యామ్ తుమ్మలపల్లి

నిర్మాత: ప్రవీణ్ రెడ్డి జంగా

సహా నిర్మాతలు: చైతన్య కందుల, సుబ్బారెడ్డి.ఏం

రైటర్: కిషోర్ శ్రీ కృష్ణ

సినిమాటోగ్రఫీ: కేశవ్

సంగీతం: హరి గౌర

ఎడిటర్: జస్విన్ ప్రభు

ఆర్ట్: ఆరే మధుబాబు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ బాలాజీ.డి

పీఆర్ఒ: శ్రీధర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *