సుధీర్ బాబు ‘జటాధర’లో శిల్పా శిరోద్కర్ ఎలా వచ్చిందంటే ! 

IMG 20250902 WA0401 e1756820642479

 సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో ‘జటాధర’ చిత్రానికి సంబంధించిన బజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. సుధీర్ బాబు చాలా కొత్తగా కనిపించబోతోన్న ఈ మూవీని ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పతాకం నిర్మిస్తోంది. ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు, గ్లింప్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి శిల్పా శిరోద్కర్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

‘ఖుదా గవా’, ‘మృత్యుదంద్’ వంటి చిత్రాలలో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న శిల్పా శిరోద్కర్ ‘జటాధర’ చిత్రంలోని పర్ఫామెన్స్‌తో అవార్డులన్నీ గెలిచేస్తారని ప్రేరణ అరోరా అన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘జటాధర’లోని శోభ అనే పాత్రలో నటించిన శిల్పా శిరోద్కర్‌కు అన్ని అవార్డులు వస్తాయని ఎంతో నమ్మకంగా చెబుతున్నాను. శోభ ఒక శక్తివంతమైన, సంక్లిష్టమైన పాత్ర. ఈ పాత్రకు ఆమె తన నటనతో ఎంతో ఇంటెన్స్‌ను తీసుకు వచ్చి న్యాయం చేశారు. ఆమె ప్రేక్షకులకు పూర్తిగా ఆశ్చర్యపరుస్తుంది’ అని అన్నారు.

IMG 20250902 WA0404

‘జటాధర’ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా అందరినీ ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నారు. సస్పెన్స్, యాక్షన్, మిస్టరీల ప్రత్యేకమైన కథతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ‘జటాధర’లో శిల్పా శిరోద్కర్, సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు, ఇందిరా కృష్ణ, రవి ప్రకాష్, దివ్య ఖోస్లా, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రోహిత్ పాఠక్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.

ఇప్పటికే శోభ పాత్రలో నటి శిల్పా శిరోద్కర్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ‘జటాధర’ ప్రేక్షకులకు ఓ విజువల్ వండర్, సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా రూపొందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *