Sheena Chohan is excited about AMAR – PREM Movie: “అమర్-ప్రేమ్” కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న షీనా చోహన్ ! 

IMG 20231231 WA01221

 

షీనా చోహన్ తన నూనత చిత్రం “అమర్-ప్రేమ్” పూర్తి చేసి విజయవంతంగా 2023 ఏడాదికి గుడ్ బై చెప్పనున్నారు. ముక్కోణపు ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించిన “అమర్-ప్రేమ్” వచ్చే ఏడాది ప్రపంచ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉంది.

జాతీయ అవార్డు, ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సువేందు రాజ్ ఘోష్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడుతుంది. ఆ తరువాత థియేటర్లలో విడుదలకానుంది.

ఈ మేరకు షీనా మాట్లాడుతూ.. ” ఈ చిత్రంలోని పాత్ర నా హృదయానికి దగ్గరైంది. జాతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శనలు త్వరలో ప్రారంభమవుతాయి, ఆ తర్వాత థియేట్రికల్ విడుదల కానుంది. ఇది ఒక భావోద్వేగ ప్రయాణం’ అని చెప్పుకొచ్చారు

షీనా చోహన్ త్వరలో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు జయరాజ్ దర్శకత్వం వహించిన మమ్ముట్టి “ది ట్రైన్” అనే మలయాళ చిత్రం ద్వారా ఆమె తెరపైకి వచ్చారు. నెట్‌ఫ్లిక్స్‌లో “యాంట్ స్టోరీ”తో పెద్ద విజయాన్ని అందుకున్నారు.

మోస్తోఫా సర్వర్ ఫరూకీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దుబాయ్, షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. ఉత్తమ నటిగా నామినేషన్ పొందింది. షీనా త్వరలో టారన్ లెక్స్టన్ హాలీవుడ్ చిత్రం ‘నో మాడ్’తో అందరినీ పలకరించబోతోన్నారు.

IMG 20231231 WA01233

ఒక నటిగా షీనా మంచి కథలను ఎంచుకుంటూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లోనూ షీనా అభిమానుల్ని సంపాదించుకున్నారు. తన సినిమాలతో, తన పాత్రలతో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. ఢిల్లీ థియేటర్ ఆర్ట్స్‌లో ఆమె ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ అవార్డులు గెలుచుకున్న దర్శకుడు బుద్ధదేబ్ దాస్‌గుప్తా చేసిన ప్రాజెక్టులోని ఆమె నటనకు గానూ “ఇట్ గర్ల్” అనే బిరుదు వచ్చింది.

ఓటీటీలో మాధురీ దీక్షిత్, కాజోల్ వంటి ప్రముఖులతో కలిసి షీనా తనదైన ముద్ర వేశారు. బప్పాదిత్య బంధోపాధ్యాయ దర్శకత్వం వహించిన ఇండిపెండెంట్ ఫీచర్ ఫిల్మ్ “జస్టిస్” రాబోయే సంవత్సరంలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శితం కానుంది.

 

“ఎక్స్ మేట్స్”లో ఆమె నటనకు గానూ అవార్డులు గెలుచుకున్నారు. ఆదిత్య ఓం దర్శకత్వం వహించిన బయోపిక్ స్టార్ సుబోధ్ భావే సరసన ఆవలి కథానాయికగా హిందీ బయోపిక్ ఫీచర్ ఫిల్మ్ ‘సంత్ తుకారాం’ షూటింగ్ కూడా పూర్తి చేసింది. 2024లో షీనా నటించిన నాలుగు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *