Shantala Song Launch by King  Nagarjuna: మన్మధుడు నాగార్జున చేతుల మీదగా శాంతాల సాంగ్!

IMG 20231103 WA0062 e1699012237641

 

ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై కె ఎస్ రామారావు గారి సమర్పణలో అమెజాన్ ప్రైమ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఫ్యామిలీ మాన్ ఫేమ్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో నీహల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వం లో డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మించిన పీరియడ్ చిత్రం శాంతల. ఈ చిత్రం యొక్క రెండో పాట చెలి మొహమే పాటను హీరో కింగ్ నాగార్జున   గారు విడుదల చేశారు. పాటను వీక్షించి నాగార్జున గారు తన శుభాకాంక్షలు తెలియజేశారు.

IMG 20231103 WA0060

 

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ మా శాంతల చిత్రం లోని రెండో  పాటని హీరో కింగ్ నాగార్జున గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. వారికి మా కృతజ్ఞతలు.

చెలి మొహమే పాటను ఎస్ పి బి చరణ్ పాడారు. కృష్ణ కాంత్ గారు సాహిత్యం అందించారు. మా చిత్రం లోని పాటలని ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి.

 హళిబేడు, బేలూరులలో జరిగిన ఒక యదార్ధ కథ ఆధారంగా శాంతల చిత్రం చిత్రీకరించాం. నవంబర్ 17 తారీకు న విడుదల అవుతుంది అని తెలియజేసారు.

IMG 20231103 WA0061

సీతారామం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రానికి సంచలన సంగీతం సమకూర్చిన విశాల్ చంద్రశేఖర్ శాంతల చిత్రానికి సంగీతం అందించారు.

చిత్రం పేరు : శాంతాల,

బ్యానర్ : ఇండో అమెరికన్ ఆర్ట్స్, సమర్పణ : ఇర్రంకి సుబ్బలక్ష్మి, ఆర్ ఓ : పాల్ పవన్, డజిటల్ పి ఆర్ ఓ : వంశి సినీ డిజిటల్, సగీత దర్శకుడు : విశాల్ చంద్రశేఖర్, దర్శకుడు : శేషు పెద్ది రెడ్డి, నిర్మాత : డాక్టర్ ఇర్రంకి సురేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *