After completing four years, “Shade Studios” has become a celebrity hub: నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని, సెలబ్రిటీ హబ్ గా మారిన “షేడ్ స్టూడియోస్”.

0461EF98 8CEE 431B B5FA 937D0CEFA409

*2018* వ సంవత్సరం నవంబర్ 3* వ తేదీన
లెజెండరీ మ్యూజిక్ డైరక్టర్ *శ్రీ ఎం.ఎం.కీరవాణి* గారి చేతుల మీదుగా *షేడ్ స్టూడియోస్* ప్రారంభించబడినది. సంగీత దర్శకులు మధు పొన్నాస్, సౌండ్ ఇంజినీర్ రామ్ గండికోట, సింగర్స్ అనుదీప్, దీపు, హైమత్, లిప్సిక, పృథ్వి చంద్ర, రేవంత్, రోల్ రీడా, ఎం.ఎం.శ్రీలేఖ మరియు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సహకారంతో *దేవీ ప్రసాద్ బలివాడ* షేడ్ స్టూడియోస్ ని ప్రారంభిచారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 33 లో గల ఈ స్టూడియో చాలా మంది సింగర్స్ కి, మ్యూజిక్ డైరక్టర్స్ కి చక్కటి సదుపాయంగా మారింది. ఇక్కడ మేజర్, హరిహర వీర మల్లు, అల వైకుంఠపురంలో (హింది), రౌడీ బాయ్స్ లాంటి ఎన్నో గొప్ప చిత్రాలకు సాంగ్స్ రికార్డింగ్ జరిగాయి.

FA344A87 38C0 4EA1 8838 D0A211005B01
*2019* వ సంవత్సరంలో షేడ్ స్టూడియోస్ అనే *యూట్యూబ్ చానల్ ప్రారంభించి*, 200 కు పైగా షార్ట్ అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేసి మంచి మన్నన పొందారు. *కోవిడ్* లాంటి కష్ట సమయాల్లో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ ని వెలికి తీయడానికి సింగింగ్, డాన్సింగ్, షార్ట్ ఫిల్మ్స్ , లిరిక్స్ మరియు
డైలాగ్ *కాంటెస్ట్స్* పెట్టి బహుమతులు కూడా అందజేసారు.
A2D5F4A3 FFF9 42FF A662 FEFA7DB2D23F

*2020* సంవత్సరంలో మొదటి సారిగా సినిమా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టి, *సునీల్* గారు ముఖ్యపాత్రలో *”కనబడుటలేదు“* అనే చిత్రాన్ని తీసారు. సక్సెస్ ఫుల్ *డైరెక్టర్ సుకుమార్* ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేసారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన టీజర్ ఈ సినిమా మీద ఆశక్తిని పెంచింది.

1F69F6F0 8684 4021 A8AF 833A486C811B

తదుపరి *నూట యాభై థియేటర్* లలో ఈ చిత్రం రిలీజ్ అయి, ఇప్పుడు *అమెజాన్ ప్రైం* ఓటీటీ లో అందుబాటులో ఉంది. ఈ చిత్ర నిర్మాణంతో స్టూడియో యొక్క స్టాండర్డ్స్ ని తెలియజెప్పారు. పాండమిక్ తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్స్ కు చాలా ఆదరణ పెరిగింది. ఆ యొక్క డిమాండ్ ని మ్యాచ్ చేసేలా స్టూడియోని *2021* వ సంవత్సరంలో *పునరుథ్ధరణ* చేసారు.

03E332C4 1056 4CE4 8FEB 7504BE876CF7

సినిమాకు సంబంధిచిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి గాను తెలుగు సినీ ఇండస్ట్రీని మ్యాచ్ చేసేలా తీర్చిదిద్ది, *సెప్టెంబర్ 9* వ తేదీన సీనియర్ అండ్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ *శ్రీ ఆర్.పి. పట్నాయక్* గారి చేతులు మీదుగా పున:ప్రారంభం చేయబడినది. రికార్డింగ్ ఫెసిలిటీస్ తో పాటు డబ్బింగ్, ఎడిటింగ్, మ్యూజిక్ కంపోసింగ్, మిక్సింగ్ మరియు కలర్ డి.ఐ. లాంటి ఎన్నో సదుపాయాలను ప్రారంభించారు.

5533CFEE 80DB 4F77 8BE5 B20D47FD9708

*2021* వ సంవత్సరంలో లక్ష subscribers దాటినందుకు గాను *యూట్యూబ్ సిల్వర్ బటన్* ని అందుకున్నారు. *2022 ఏప్రిల్ 2* వ తేదీన *షేడ్ ఎంటర్టెయిన్మెంట్* బానెర్ స్థాపించి, రెండు వెబ్ ఫిలింస్, ఒక వెబ్ సిరీస్ ఓటీటీ స్టాండర్డ్స్ కి తగ్గట్టు నిర్మించారు. *పుష్ప* చిత్రంలో కేశవ పాత్ర పోషించిన జగదీష్ ప్రతాప్ బండారి ముఖ్య తారాగణంగా *”ఓ కథ”*, నూతన నటీనటులతో *”టిక్ టాక్ స్టోరీస్”*, c/o కంచరపాలెం ఫేం రాజు గారు ముఖ్యపాత్రలో *”డి.ఎన్.కె”* చిత్రాలు అతి త్వరలో ఓటీటీ లో రిలీజ్ కాబోతున్నాయి.

28348AE3 F32F 4683 9370 AD61398FED41

షేడ్ స్టూడియోస్ ఇప్పుడు *5 వ వసంతం* లోకి నూతన ఉత్సాహంతో అడుగుపెడుతోంది. *2018* లో మొదట ఒక రికార్డింగ్ స్టూడియోగా ప్రారంభమై
అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు మొత్తం సినిమాకు సంబంధించిన పనులన్నీ ఒకే చోట అయ్యేలా తీర్చి దిద్ది, అటు ప్రొడక్షన్ లోను, ఇటు యూట్యూబ్ చానెల్ తోనూ రాణిస్తూ గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సేవలను అందించారు.

ప్రస్తుతం *25 సినిమాలకు* గాను పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ పని చేసే సాంకేతిక బృందం ఎంతో ఎక్స్పీరియన్స్ మరియు ఎక్స్పర్టైజ్ కలిగి ఉన్నారు. సౌండ్ డిజైన్ లో భాగంగా ఎన్నో చిత్రాలకు పని చేసిన *ఆనంద్ పాల్* మరియు *వెంకట్* గారు సాంగ్స్ రికార్డింగ్స్ చేస్తారు. అలాగే డబ్బింగ్ కొరకు *సూర్య, సాయి మణిదీప్*, *బెన్నీ బాబు* పని చేస్తున్నారు.

0461EF98 8CEE 431B B5FA 937D0CEFA409

ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో భాగంగా *శ్రీకృష్ణ అత్తలూరి*, *శరత్ జోశ్యభట్ల*, *విశ్వన్ రాజ్*, *భాస్కర్* మరియు *ప్రవీణ్ టాంటాం* తమ
క్వాలిటీ ఔట్ పుట్ ని అందిస్తున్నారు. కలర్ డి.ఐ. లో *ప్రవీణ్ కోల* మరియు *మనోజ్ కుమార్* తమ ప్రతిభను చూపుతున్నారు. సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ *ఎం.కె.ఎస్. మనోజ్* , సీనియర్ ఎస్.ఎఫ్.ఎక్స్. ఇంజినీర్ *వెంకట్ శ్రీకాంత్ గిడుతూరి* మరియు సీనియర్ మిక్సింగ్ ఇంజినీర్ *శ్రీ మిత్ర* స్టూడియోతో అనుసంధానమై ఉన్నారు. మేనేజర్ *భాను ప్రసాద్* మరియు అసిస్టెంట్ *గణేష్* తమ నైపుణ్యంతో ఆన్ టైం వర్క్ అయ్యేలా టైమింగ్స్ చక్కగా మేనేజ్ చేస్తున్నారు.

*ఇట్లు*
*దేవి ప్రసాద్ బలివాడ*
*CEO, షేడ్ స్టూడియోస్*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *