Shaakuntalam telugu Review: ఇప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోలేని పూర్ విజువల్ డ్రామా ఈ శాకుంతలం !

saakuntalam రివ్యూ e1681443226128

మూవీ: శాకుంతలం (Shaakuntalam)

విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2023

నటీనటులు: సమంత, దేవ్ మోహన్, సచిన్ ఖేడేకర్, మోహన్ బాబు తదితరులు

దర్శకులు : గుణశేఖర్

నిర్మాతలు: నీలిమ గుణ, దిల్ రాజు

సంగీత దర్శకులు: మణిశర్మ

సినిమాటోగ్రఫీ: శేఖర్ వి జోసెఫ్

ఎడిటర్: ప్రవీణ్ పూడి

శాకుంతలం సినిమా రివ్యూ (Shaakuntalam Movie Review):

సమంత, దేవ్ మోహన్ జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పౌరాణిక చిత్రం శాకుంతలం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎంతవరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.

samantha శాకుంతలం

కధ ను పరిశీలిస్తే (story line):

కాళిదాసు రాసిన అభిజ్నన శాకుంతలం కధ ఆదారంగా ,  విశ్వామిత్రా, మేనలకు పుట్టిన బిడ్డ ‘శకుంతల’(సమంత). శాకుంతలం పక్షలు ఈ బిడ్డను కణ్వ మహర్షి (సచిన్ ఖేడ్‌ఖర్) ఆశ్రమంలో విడిచిపెడతాయి. శాకుంతలం పక్షలు పోషణలో కొన్ని రోజుల ఉన్న కారణంగా ఆ బిడ్డకు శకుంతలం అనే నామకరణం చేస్తారు కణ్వ మహర్షి.

కణ్వ మహర్షి ఆశ్రమం  ఉన్న ప్రాంతాన్నిచంద్ర వంశపు రాజు  దుష్యంత మహారాజు (దేవ్ మోహన్) ప్రతిష్ఠాన పురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తుంటాడు. అతను ఒకరోజు అడవిలో వేట నిమిత్తమై వచ్చి కణ్వ మహర్షి ఆశ్రమానికి వస్తాడు. అక్కడ ఉన్న శకుంతల (సమంత)ను చూసి ఆమె సౌందర్యానికి ఆకర్షితుడవుతాడు. శకుంతల కూడా దుష్యంతుడి ప్రేమలో పడుతుంది.

shaakuntalam 33

అనుకోని పరిస్తుతులలో శకుంతల – దుష్యంతలు ఆశ్రమ ప్రదేశం లోనే  గాంధర్వ వివాహం చేసుకుని ఒక్కటి అవుతారు. ప్రేమ కానుకగా ఒక  ఉంగరం శాకుంటాలకు  ఇచ్చి, కొన్ని దినములు తర్వాత సైన్యం తో వచ్చి పట్టపు రాణిగా రాజ్యానికి తీసుకు వెళ్తాను అని చెప్పి తన రాజ్యా రాజధానికి  తిరిగి వెళ్లిపోతాడు.

ఆ తర్వాత దుష్యంతుడి వల్ల గర్భవతి అయిన శకుంతల తన భర్త దుష్యంతుడి ధ్యానంలో ఉండగా.. ఆ ఆశ్రమానికి దుర్వాస మహముని (మోహన్ బాబు) వస్తాడు. తన రాకను శాకుంతల పట్టించుకోకపోవడంతో కోపోద్రిక్తుడై  శాకుంతలను శేపించి వెళ్ళిపోతాడు.

shaakuntalam mohanbabu

కొంత కాలం తర్వాత ఆశ్రమమ్ కి తిరిగివచ్చిన కణ్వ మహర్షి శాకుంతల పెళ్లి విషయం తెలుసుకొని గర్బవతి అయిన శాకుంతలను సకల లాంఛనాలతో దుష్యంతుడి రాజ్యానికి పంపిస్తాడు. ఆ నేపథ్యంలో దుష్యంతుడు ఇచ్చిన ఉంగరం గంగా నదిలో పడిపోతుంది. ఆ తర్వాత దుష్యంతుడు.. దుర్వాస మహాముని శాపం వలన శకుంతల ఎవరనేది తనకు తెలియదని చెబుతాడు.

ఆ తర్వాత జరిగే పరిణామాలు..

దుష్యంతుడు తెలియదు అని చెప్పిన తర్వాత శాకుంతల  జీవితాల్లో జరిగిన సంఘటనలు ఏమిటి ?,

దుష్యంతుడు తర్వాత  శకుంతలను తిరిగి ఎలా గుర్తించాడు ?

చివరకు వీరి ప్రేమ కథ ఎలా సాగింది ? ఎలా ముగిసింది ?

శాకుంతల గర్బం తో ఒంటరిగా అనుబవించిన బాదలు ఏమిటి ?

శ ఆకుంటాలను ఎవరు రక్షించారు ? 

లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండితెర పై ఈ శాకుంతలం  సినిమాను చూడాల్సిందే.

samantha sak

కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):

ఎమోషనల్  లవ్ స్టోరీతో సాగే ఈ సినిమా విజువల్ పరంగా కొంతవరకు ఆకట్టుకున్నా.. కథనం  (స్క్రీన్ ప్లే) పరంగా ఎలాంటి కొత్తదనం లేదు. అలాగే మొదటి అంకం (ఫస్టాఫ్) ను ఆసక్తికరమైన విజువల్స్ తో అక్కడక్కడ కాస్త ఇంట్రెస్ట్ గా నడిపినా.. స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను నెమ్మదిగా నడిపారు.

రెండవ అంకం (సెకెండ్ హాఫ్) లో కూడా కొన్ని సీన్స్ చాలా స్లోగా సాగుతాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సమంత పాత్ర గర్భవతి అయ్యాక వచ్చే సీన్స్ ను అనవసరంగా ల్యాగ్ చేస్తూ డ్రైవ్ చేయడం వల్ల, ఆ సాగదీత సీన్స్ లో ఇంట్రస్ట్ మిస్ అయింది.

అలాగే మధ్యమధ్యలో వచ్చే దేవ ధూతల  ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్  కూడా కొంత ఇబ్బంది పెడుతాయి. ఇంకా టైట్ స్క్రీన్ ప్లే ఉండి ఉంటే ఈ సినిమా కొంతవరకు అయినా సంతృప్తికరంగా ఉండి ఉండేది. కానీ, రొటీన్ ప్లేతో బోరింగ్ ట్రీట్మెంట్ తో ఈ పౌరాణిక చిత్రం సాగడంతో సినిమా అవుట్ పుట్ బాగా దెబ్బ తింది.

మెయిన్ గా ఈ శాకుంతలం సినిమాలో శాకుంతల – దుష్యంతుల  ప్రేమ కథలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కొన్ని యాడ్ చేసి ఉంటే  ఇంకా టైట్ స్క్రీన్ ప్లే మరియు ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ను ప్లే లో డిజైన్ చేసుకోని ఉంటే ఇప్పటి ప్రేక్షకులను ఆకట్టుకొనేది.

samantha

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

ఈ సినిమా చూస్తున్నంత సేపు మహాభారతంలోని ఆది పర్వంలోకి వెళ్లి.. శకుంతలా దుష్యంతుల ప్రేమ గాధను, బాధను కళ్ళ ముందు చూస్తున్న బావన కలుగుతుంది. ముఖ్యంగా 3డి విజువల్స్ సినిమా స్థాయిని తగ్గించాయా అనిపిస్తుంది.

. మొత్తమ్మీద శకుంతలా దుష్యంతుల ప్రేమ గాధను అద్భుతమైన విజువల్స్ తో పాటు భారీ సాంకేతిక విలువలతో తెరకెక్కించబడటమే ఈ సినిమా ప్రధాన బలం.  ప్రధాన పాత్రల ఎమోషన్ అండ్ పెయిన్ ఫ్యామిలీ ప్రేక్షకులకు కొంతవరకు కనెక్ట్ అవుతుంది.

దర్శకుడు గుణశేఖర్ తన దగ్గర ఉన్న బడ్జెట్ లో  భారీ విజువల్స్ తో భారీ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాలను అద్భుత విజువల్స్ తో బాగా తెరకెక్కించినప్పటికీ.. కథ యొక్క గమనం మార్చే కథనాన్ని మాత్రం అద్బుత స్థాయిలో ఆయన రాసుకోలేదు.

శాకుంతల గా నటించిన  సమంత తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె తన మార్క్ నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

హీరోగా నటించిన దేవ్ మోహన్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఆయనకు సంబంధించిన కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో దేవ్ మోహన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

మరో  కీలక పాత్రలో నటించిన మోహన్ బాబు తన మ్యానరిజమ్స్ తో తన శైలి నటనతో బాగా ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు సచిన్ ఖేడేకర్, ప్రకాష్ రాజ్, గౌతమి, కబీర్ బేడీ తదితరులు తమ పాత్రల నిడివిలో పూర్తి న్యాయం చేశారు.

samantha 4

సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన సంగీతం శాకుంతలం సినిమా లో  ఏవరేజ్ గా ఉంది. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు.

శేఖర్ వి జోసెఫ్ అందించిన సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని భారీ విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. కొన్ని సీన్స్ అయితే పెయింటింగ్ లా కనిపిస్తాయి.

ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓకే. కాకపోతే.. అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాతలు తమకు ఉన్న బడ్జెట్ లిమిట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు పరవాలేదు కానీ, ఇప్పటి ప్రేక్షకులు గత సినిమాల విజువల్ ఎఫ్ఫెక్ట్స్ కంపెర్ చేస్తే ఈ శాకుంతలం విజువల్స్ చాలా పూర్ గా కనిపిస్తాయి.

samantha 43

18F మూవీస్ టీం ఒపీనియన్:

కాళిదాసు రాసిన పౌరాణిక ప్రేమ జంట ‘శకుంతల- దుష్యంతుల’ ప్రేమ కథ ను ఇప్పటి సినీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ గా   3డి ఎఫెక్ట్ అద్ది చూపించాలి అనుకొన్న గుణ శేఖర్ ఆలోచన బాగున్నా, ఈ శాకుంతలం చిత్రం ఎక్కడో ఏదో లోపం తో సామాన్య  ప్రేక్షకుల  సహనాన్ని పరీక్షిస్తుంది.

దర్శకుడు  గుణశేఖర్ విజువల్స్ మరియు టేకింగ్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్, కథ యొక్క కధనం (స్క్రీన్ – ప్లే) పై పెట్టలేదా అనిపిస్తుంది. రొటీన్ ప్లే అండ్ బోరింగ్ ట్రీట్మెంట్, రెగ్యులర్ లవ్ డ్రామా వంటి అంశాలు ఈ సినిమాకి బాగా మైనస్ అయ్యాయి.

ఓవరాల్ గా ఈ సినిమా విజువల్స్ పరంగా కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకొ గలదు. కంటెంట్ కధనం పరంగా నిరుత్సాహ పరిచింది. బాహుబలి, కేజియాఫ్, ఆర్ఆర్ఆర్ చూసిన తెలుగు ప్రేక్షకులకు ఈ శాకుంతలం విజువల్స్ మరీ నాసిరకంగా అనిపిస్తాయి.  తప్పు గుణ శేఖర్ ది మాత్రమే. తక్కువ బడ్జెట్ లో ఇలాంటి సినిమా కధలు తీయకూడదు.

samantha 6 e1681442594341

టాగ్ లైన్: ఆకట్టుకొలేని శాకుంతల వ్యధ.

18f Movies రేటింగ్: 2 / 5

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *