Seetharam Sitralu”Trailer Launched by Director Maruthi: “సీతారాం సిత్రాలు” ట్రైలర్ లాంచ్ లో దర్శకుడు మారుతి ఏమన్నారంటే !

Seetharam Sitralu Trailer Launched by Director Maruthi

రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం సీతారాం సిత్రాలు. లక్ష్మణ్ , భ్రమరాంబిక, కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా డి.నాగ శశిధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

మన పాత రోజులను గుర్తు చేస్తూ… పెళ్లి విసిఆర్ క్యాసెట్స్ పై అల్లిన కథ సీతారాం చిత్రాలు. ఈ చిత్ర కాన్సెప్ట్ ట్రైలర్ ను దర్శకుడు మారుతి విడుదల చేశారు.

ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ…కొత్త కథ, కథనాలు ఉన్న సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకాదరణ పొందుతాయి. సీతారాం చిత్రాలు టైటిల్, ట్రైలర్, బాగున్నాయి. సినిమా విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నానన్నారు .

షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది.

నటీనటులు:

లక్ష్మణ్, భ్రమరాంబిక, కిశోరి దాత్రక్, ఢిల్లీ రాజేశ్వరి, కృష్ణమూర్తి, సందీప్ వారణాశి, గురుస్వామి.

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్,నిర్మాతలు: పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి, కృష్ణ చంద్ర విజయభట్టు,
కెమెరామెన్: అరుణ్ కుమార్ పర్వతనేని,మ్యూజిక్: రుద్ర కిరణ్,BGM: శిరీష్ సత్యవోలు,ఎడిటర్: ప్రణీత్ కుమార్,సౌండ్ డిజైన్: సాయి మనిందర్ రెడ్డి,లిరిక్స్: శేఖర్ రాజు విజయభట్టు,రచన, దర్శకత్వం: డి.నాగ శశిధర్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *