Seetha Kalyana Vaibhogame Release Date locked: ‘సీతా కళ్యాణ వైభోగమే’ సిన్మా విడుదల ఎప్పుడంటే! 

IMG 20240410 WA0042 e1712728889711

సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. టైటిల్ ప్రకటనతో ఎంతో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశారు మేకర్లు. సీతా కళ్యాణ వైభోగమే అనే టైటిల్‌లో ఎంత ఫీల్ గుడ్ ఎమోషన్ దాగి ఉందో.. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అంత వయలెన్స్ కూడా కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతోందనే అంచనా అందరికీ వచ్చింది.

అందమైన ప్రేమ కథా చిత్రంగా, యాక్షన్ అంశాలతో రాబోతోన్న ఈ మూవీ విడుదల తేదీని నిర్మాత రాచాల యుగంధర్ ప్రకటించారు. ఏప్రిల్ 26న ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇకపై ప్రమోషన్స్ మరింతగా పెంచనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ మేరకు వదిలిన రిలీజ్ డేట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో హీరోయిన్లు ఎంతో ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తున్నారు. హీరో హీరోయిన్ల జంట కూడా చూడముచ్చటగా ఉంది. చూస్తుంటే ఆ స్టిల్ పెళ్లి వేడుకలో భాగంగా వచ్చేలా ఉంది.

గగన్ విహారి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, వెంకీ మంకీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, కెమెరామెన్ పరుశురామ్, ఎడిటర్ డి.వెంకట ప్రభు, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్లు భాను మాస్టర్, పోలకి విజయ్ పనిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *