Seeta Kalyana Vaibhogame Movie Pre-Release Highlights: ‘సీతా కళ్యాణ వైభోగమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైలైట్స్ ! 

Seeta Kalyana Vaibhogame Movie Pre Release Highlights1 e1713885355172

సుమన్ తేజ్, గరీమ చౌహాన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు పెంచేసింది. ఈ క్రమంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నాడు నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు యాటా సత్యనారాయణ, విజయ్ కనకమేడల, ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, నటుడు రమణారెడ్డి, నీరూస్ ప్రతినిధి హసీం వంటి వారు అతిథులుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ..

Seeta Kalyana Vaibhogame Movie Pre Release Highlights8

ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నేను ఎమ్మెల్యేగా గెలిచానంటే మా మిత్రుడు యుగంధర్ కూడా ఓ కారణం. ఈ మూవీ టైటిల్ చూస్తే ఎంతో ఫీల్ గుడ్‌లా కనిపిస్తోంది. మంచి చిత్రంగా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. హీరో హీరోయిన్లకు మంచి పేరు రావాలి. మా మిత్రుడు నిర్మాత యుగంధర్‌కు ఈ చిత్రం మంచి పెద్ద విజయం సాధించి మంచి లాభాలు తీసుకురావాలి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

యాటా సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘పోస్టర్ చూస్తే ఇది చిన్న సినిమా, కొత్త సినిమా అన్నట్టుగా కనిపించడం లేదు. మన తెలుగు సంప్రదాయం ఉట్టి పడేలా కనిపిస్తోంది. సీతారాముల ప్రేమ కంటే గొప్ప కథ ఏమీ లేదని సతీష్ ఎంతో గొప్పగా చెప్పాడు. టీజర్, ట్రైలర్ చూస్తుంటే దిల్ రాజు గారు గుర్తొచ్చారు. ఆయన చిన్న చిన్న ఎమోషన్‌లతో సినిమాలు తీసి స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు. యుగంధర్ చాలా మంచి నిర్మాత. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరినీ గుర్తు పెట్టుకుని పిలిచి మాట్లాడారు.

మాలాంటి కొత్త వాళ్లకు గేట్లు ఓపెన్ చేసేందుకు డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ ను ప్రారంభించారు. ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు. మా చరణ్ అర్జుణ్ నల్గొండ నుంచి వచ్చాడు. ప్రతీ పాట ఆణిముత్యం. పదేళ్ల క్రితమే చరణ్ అర్జున్ స్టార్ రైటర్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాతో చరణ్ అర్జున్‌కు పెద్ద కమర్షియల్ బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను. సీతమ్మ కథను అద్భుతంగా చెప్పారు. స్త్రీ లేకపోతే జననం లేదు.. సృష్టి లేదని చెప్పి.. స్త్రీకి గౌరవం లేదని దర్శక నిర్మాతలు చక్కగా చూపించారు.

గగన్ విహారి, సుమన్ తేజ్‌, గరిమ చౌహాన్‌లకు ఆల్ ది బెస్ట్. సుమన్ మంచి హీరోగా నిలబడతాడని ఆశిస్తున్నాను. జయంలో గోపీచంద్‌లా గగన్ కనిపించాడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 26న అందరూ చూసి విజయవంతం చేయాలి’ అని అన్నారు.

Seeta Kalyana Vaibhogame Movie Pre Release Highlights5

సుమన్ తేజ్ మాట్లాడుతూ.. ‘మా లాంటి కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తున్న మా నిర్మాత యుగంధర్ గారికి థాంక్స్. మా దర్శకుడు సతీష్ సోదర సమానులు. ఇంత మంచి పాత్రను ఇచ్చిన సతీష్ గారికి థాంక్స్. మా ఇద్దరికీ ఎప్పటి నుంచో పరిచయం. కొన్ని వందల స్క్రిప్ట్‌లను విన్నాం. ఈ సినిమాతో మా సినీ జర్నీ స్టార్ట్ అయింది. తెలుగు రాకపోయినా గరిమ చౌహాన్ చక్కగా నటించింది. భారీ డైలాగ్స్‌ను కూడా చెప్పింది. పూర్ణాచారి మంచి పాటలు ఇచ్చారు.

చరణ్ అర్జున్ గారు మంచి సంగీతాన్ని అందించారు. నీరూస్ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ రోజు ఇక్కడి వరకు సినిమా వచ్చింది. శివాజీ రాజా, నాగినీడు వంటి సీనియర్లతో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీతో నాకు గగన్ లాంటి మంచి మిత్రుడు దొరికాడు. ఏప్రిల్ 26న మా చిత్రం రాబోతోంది. ప్రేక్షకులు మా సినిమాను చూసి ఆదరించండి’ అని అన్నారు.

Seeta Kalyana Vaibhogame Movie Pre Release Highlights7

గగన్ విహారి మాట్లాడుతూ.. ‘సీతమ్మ తల్లి పడ్డ కష్టాలు మనకు పూర్తిగా తెలియవు. ఈ చిత్రంలో నాలాంటి రావణ పాత్రతో సీత ఎలాంటి కష్టాలు పడిందో చూపించారు. సీత కారెక్టర్‌లో గరిమ చక్కగా నటించారు. కొన్ని సీన్లు చూస్తే నాకే బాధగా, భయంగా అనిపించింది. ఈ చిత్రం నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన సతీష్ గారికి థాంక్స్. సుమన్ తేజ్‌కు ఫస్ట్ సినిమా అయినా అద్భుతంగా నటించారు. యుగంధర్ లాంటి నిర్మాతను నేను ఎక్కడా చూడలేదు. చాలా రిచ్‌గా నిర్మించారు. బడ్జెట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మా సినిమాను ప్రతీ ఒక్కరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

Seeta Kalyana Vaibhogame Movie Pre Release Highlights6

గరిమ చౌహాన్ మాట్లాడుతూ.. ‘సీతలాంటి పాత్ర నా కెరీర్‌ ప్రారంభంలోనే రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా నా డ్రీమ్ నిజం కాబోతోంది. ఈ మూవీతో నా ప్రయాణం మొదలైంది. నాకు ఇక్కడ ప్రేమ, ప్రోత్సాహం లభిస్తోంది. మా లాంటి కొత్త వాళ్లకు ఇలాంటి ఎంకరేజ్మెంట్ చాలా ముఖ్యం. నా మీద ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. నాకు ఇంత మంచి కారెక్టర్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఏప్రిల్ 26న రాబోతోన్న మా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. ‘టైటిల్ చాలా బాగుంది. సుమన్, గరిమ, గగన్‌లకు కంగ్రాట్స్. చిన్న చిత్రాన్ని ఇంత వరకు తీసుకు రావడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో నాకు తెలుసు. ఈ మూవీ సంగీతం బాగుంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు దేవరాజ్ మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన యాటా సత్యనారాయణ, విజయ్ కనకమేడల గారికి థాంక్స్. మా దర్శకుడు సతీష్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించాడు. కెమెరా మెన్ చాలా కూల్‌గా షూట్ చేశారు. చరణ్ అన్న పెన్ను గన్నులాంటిది. ఈ చిత్రానికి తన సంగీతంతో ప్రాణం పోశారు. మా నిర్మాత యుగంధర్ నాకు ఆప్తులు. సీతా కళ్యాణ వైభోగమే అద్భుతంగా వచ్చింది. మంచి పాటలుంటాయి. సినిమాను అందరూ ఆదరించండి’ అని అన్నారు.

Seeta Kalyana Vaibhogame Movie Pre Release Highlights3

సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ.. ‘సీతా కళ్యాణ వైభోగమే టైటిల్ చాలా బాగుంది. చిన్న చిత్రాన్ని తీయడం, ఇంత వరకు ప్రమోషన్స్‌తో తీసుకురావడం చాలా కష్టం. ఈ మూవీకి కష్టపడ్డ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాను అందరూ ఆదరించండి’ అని అన్నారు.

చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. ‘విమానం పాటలతో అందరికీ చేరువయ్యాను. రాజకీయ నాయకుల మీద చేసిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అన్ని రకాల పాటలను కంపోజ్ చేశాను. గతంలో నేను ‘ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు’ అనే పాటను రాసి, కంపోజ్ చేశాను. రచ్చలో ‘డిల్లకు డిల్లకు డిల్లా’ అనే పాటను రాశాను. శంబో శివ శంబో టైటిల్ సాంగ్‌ను రాశాను. నాకు ఈ మూవీతో బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను. మా లాంటి కొత్త వాళ్లను ఎంకరేజ్ చేసేందుకు నిర్మాత రాచాలా అన్నా.. డ్రీమ్ గేట్ బ్యానర్‌ను స్థాపించారు’ అని అన్నారు.

Seeta Kalyana Vaibhogame Movie Pre Release Highlights2

రాచాల యుగంధర్ మాట్లాడుతూ.. ‘అడిగిన వెంటనే గెస్టులుగా వచ్చిన ఎమ్మెల్యే జి.మదుసూధన్ రెడ్డి, యాటా సత్యనారాయణ గారికి థాంక్స్. ఏ మాత్రం రెమ్యూనరేషన్ ఆశించకుండా పని చేసిన చరణ్ అర్జున్‌కు థాంక్స్. డైరెక్టర్ సతీష్ సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్తుంటాడు. సుమన్, గరిమ, గగన్ విహారి అందరూ అద్భుతంగా నటించారు. చరణ్ అర్జున్ ప్రాణం పెట్టి సంగీతం చేశారు. పూర్ణాచరి మంచి పాటలు రాశారు. ఎన్ని కష్టాలు వచ్చినా రవన్న వల్లే ఈ సినిమా ముందుకు సాగింది. ఈయన వల్లే సినిమా అద్భుతంగా వచ్చింది. మా చిత్రం ఏప్రిల్ 26న రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సతీష్ పరమవేద మాట్లాడుతూ.. ‘ఎలా బతకాలో రామాయణం చెబుతుంది. రాముడు మామూలు మానవుడు. కానీ దేవుడు అయ్యాడు. సీత ప్రేమ కోసం యుద్దం చేయడం, రావణ సంహారం తరువాత దేవుడయ్యాడు.. ఈ ప్రేమ కథను తీయాలనే ఉద్దేశంతోనే సీతా కళ్యాణ వైభోగమే తీశాను. ఆడపిల్ల పుడితే అదృష్టమని అంతా అనుకుంటాం. కానీ ఆడపిల్లకు సరైన కేరాఫ్ అడ్రస్ ఉండదు. మహిళలు ఎదుర్కొనే సమస్యలను ఎమోషనల్ జర్నీగా చూపించాను. సందేశాత్మక చిత్రమని ప్రేక్షకులను బోర్ కొట్టించం.

Seeta Kalyana Vaibhogame Movie Pre Release Highlights9

ప్రస్తుత తరానికి నచ్చేలా ఈ సినిమాను తీశాను. ఆడపిల్ల ఉండే ప్రతీ కుటుంబానికి ఈ సినిమా నచ్చుతుంది. సమ్మర్‌లో మా సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఊరికి ఉత్తరాన సినిమాను రాచాల యుగంధర్ విడుదల చేశారు. ఈ మూవీ కథ పూర్తిగా వినకుండా నమ్మకంతో ఈ ఆఫర్ ఇచ్చారు. గరిమ ఈ పాత్రకు వంద శాతం సరిపోయింది. సుమన్ తేజ్ నా బ్రదర్ లాంటి వాడు. అద్భుతంగా నటించాడు.

విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. ‘సీతా కళ్యాణ వైభోగమే టైటిల్ బాగుంది. ఈ మూవీ ఓపెనింగ్‌కి కూడా వచ్చాను. గగన్ విహారి నాకు ఎప్పటి నుంచో పరిచయం. సుమన్ తేజ్‌, గరిమ చౌహాన్‌లకు పెద్ద విజయం దక్కాలి. చరణ్ అర్జున్ నాకు ఎప్పటి నుంచో స్నేహితుడు. త్వరలోనే మేం ఇద్దరం కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. పరుశురాం నా నాంది, ఉగ్రం సినిమాలకు కెమెరా డిపార్ట్మెంట్లో పని చేశారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

‘సందేహం’ నిర్మాత సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘సీతా కళ్యాణ వైభోగమే టైటిల్‌లోనే పాజిటివ్ వైబ్రేషన్, వైభోగం కనిపిస్తోంది. టైటిల్ ఎంతో అద్భుతంగా ఉంది. నీరూస్ సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. రాచాల యుగంధర్ ఈ సినిమాను జెట్ స్పీడ్‌తో తీశారు. డైరెక్టర్ సతీష్ సెన్స్, సెన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. మా ఇద్దరు నిర్మాతల మధ్య నలిగిపోయాడు. హీరో సుమన్ తేజ్ అద్భుతమైన నటుడు. డిఫరెంట్ వేరియేషన్స్‌ చూపించే నటుడు. గరిమ చక్కగా ఉంది. గగన్ విహారి విలనిజం అద్భుతంగా ఉంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *