Satyabhama Movie Review & Rating: సత్యభామ గా సెటిల్డ్ యాక్షన్ తో మెప్పించిన కాజల్ అగర్వాల్

SAtyabhama review by 18fms e1717788392649

చిత్రం: సత్యభామ,

విడుదల తేదీ : జూన్ 07, 2024,

నటీనటులు: కాజల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, నేహా పఠాన్, అంకిత్ కొయ్య, అనిరుద్ పవిత్రన్ తదితరులు..,

దర్శకుడు: సుమన్ చిక్కాల,

నిర్మాతలు: శశికిరణ్ తిక్క, బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి,

సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల,

సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి,

ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్,

SAtyabhama review by 18fms 1

మూవీ: సత్యభామ రివ్యూ  ( Satyabhama Movie Review) 

తెలుగు లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మొదటి సారిగా ప్రధాన పాత్రలో నటించిన కాప్ క్రైమ్ థ్రిల్లర్  డ్రామా “సత్యభామ” సినిమా ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన కొన్ని నోటెడ్ చిత్రాల్లో మొదటిగా చెప్పుకోవాలసిన చిత్రం.

కాజల్ అగర్వాల్ ఇప్పటివరకూ చేసిన గ్లామర్ డాళ్ పాత్రల లా కాకుండా, పెళ్లి తర్వాత బాబు పుట్టిన తర్వాత కూడా ఫిజికల్ గా ఛాలెంజింగ్ రోల్ ఉన్న కధ ను ఎన్నుకొని, సాలిడ్ ప్రమోషన్స్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అంత కష్టమైన వృత్తిని ఇష్టంగా చేసిన ఈ సత్యభామ  చిత్రం ఆమె అంచనాలు అందుకొని, తెలుగు సినిమా ప్రేక్షకులందరిని  మెప్పించిందా లేదా అనేది మా 18F మూవీస్ టీం సమీక్షలో చదివి తెలుసుకొందామా !

SAtyabhama review by 18fms 3

కధ పరిశీలిస్తే (Story Line): 

సత్యభామ (కాజల్ అగర్వాల్) వృత్తి పరంగా నిజాయితీ గల ఒక అగ్రెసివ్  పోలీస్ ఆఫిసర్. ఫ్యామిలీ, వ్యక్తిగత విశయలు కంటే డ్యూటి ఫస్ట్ అనే ఆఫీసర్ అయినటువంటి సత్యభామ  తన భర్త అమరేందర్ (నవీన్ చంద్ర) తో జీవనాన్ని సాగిస్తుంది. అలా ఆమె పని చేస్తున్న షీ టీం నగరం లో ఆడవారు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు.

అలా ఓ రోజు హసీనా (నేహా పఠాన్) అనే ఒక అమ్మాయి తన భర్త యదు(అనిరుద్ పవిత్రన్) తనని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అని పోలీసులని ఆశ్రయిస్తుంది. ఈ క్రమంలో యదు ఆమెని చంపేస్తాడు. ఆమె చనిపోయే ముందు తన తమ్ముడు చోటుగా పిలవబడే ఇక్బాల్(అంకిత్ కొయ్య) ని జాగ్రత్తగా చూస్కోమని సత్యభామ దగ్గర మాట తీసుకుంటుంది. ఈ క్రమంలో ఈ ఇక్బాల్ ఒక ఉగ్రవాది అని ముద్ర పడుతుంది.

ఎంబిబిఎస్ చదువుతున్న ఇక్బాల్ నిజంగానే ఉగ్రవాదా?,

హసీనా అంటే అమితమైన ప్రేమ ఉన్న ఇక్బాల్ అసలు ఏం చేస్తాడు? ,

సత్యభామ అతని విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది?,

సత్యభామ – అమర్ ల మద్య సంభంధం, ప్రేమ ఎలా ఉంది? , 

సత్యభామ కు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతవరకూ ఫ్రీడం ఇచ్చింది?,

ఆడవాళ్ళ రక్షణ కోసం సత్యభామ ఏమి చేసింది?,

కేసు పరిశోదన క్రమంలో సత్యభామకు వృత్తి పరంగా ఎదురైన సవాళ్లు ఏంటి?,

అనే ప్రశ్నలు మీకు ఇంటరెస్ట్ ని క్రియేట్ చేసి వాటికి జవాబులు తెలుసుకోవాలి అంటే వెంటనే మీ దగ్గరలోని దియేటర్ కి వెళ్ళి ఈ సత్యభామ చిత్రాన్ని చూసేయండి.

SAtyabhama review by 18fms 6

కధనం పరిశీలిస్తే (Screen – Play):

గూడచారి, మేజర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు దర్శకుడు అయిన శశి కిరణ్ తిక్క ఈ సత్యభామ చిత్రాన్ని నిర్మిస్తూ కధ లో సహాయం చేస్తూ కధనాన్ని అందించారు. శశి, ఈ చిత్ర దర్శకుడు సుమన్ చిక్కల మరి కొందరి ఫ్రెండ్స్ సహాయం తో జరిగిన కొన్ని యాధార్ధ సంఘటనల ఆధారంగా కధగా అయితే బాగానే వ్రాసుకొన్నా, కథనం (స్క్రీన్ – ప్లే) మాత్రం సామాన్య సినీ ప్రేక్షకులకు అర్దం కానీ ఒకింత కన్ఫ్యూజ్ క్రైమ్ థ్రిల్లర్ గా నడిపారు.

అసలే క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కాబట్టి, ట్విస్టులు ఓపెన్ కాకుండా చూసే ప్రేక్షకులకు కూడా నెక్స్ట్ ఏమిటి అనే ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తూ చేసిన కధనం సినిమా లవర్స్ కి, ఇన్వెస్టిగెటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సత్యభామ స్క్రీన్ – ప్లే బాగా నచ్చుతుంది. న్యూ ఏజ్ సినిమా మేకింగ్ ఇష్టపడే వారికీ మంచి విజువల్ ట్రీట్ అని చెప్పవచ్చు.

కాని సినిమా అనేది సామాన్య ప్రేక్షకుల రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్.  అలాంటి సామాన్య సినీ ప్రేక్షకులను ఎంత వరకూ ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.  ఈ సత్యభామ చిత్రం, మరీ అంత గొప్పగా లేకపోయినా ఓ మాదిరిగా ఓకే అనిపించేలా ఉండే మొదటి అంకం (ఫస్టాఫ్) తర్వాత రెండవ అంకం (సెకండాఫ్) లో కధనం మరింత స్లో గా వెళ్తూ ఫ్రీ క్లైమాక్స్ నుండి స్పీడ్ అందుకోంది.

ఇంకా కథనంలో మెయిన్ పాయింట్ తో జర్నీ చేసే ప్రేక్షకుడికి, కొత్త పాత్రల పరిచయం, ఇతర సమస్యలు ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. దీనితో అసలు కథనం ఎటెటో వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఎవరైతే అమాయకంగా ప్రొజెక్ట్ చేయబడతారో వారే మెయిన్ విలన్ అన్నట్టుగా కనిపించే టెంప్లెట్ ఎన్నో సినిమాల్లో చూసేసాం.

అయితే కాజల్ రోల్ ని ఇంకా బాగా ఎలివేట్ చేస్తూ మరిన్ని మాస్ సీన్స్ దట్టించాల్సింది. ఇంకా ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర లాంటి మంచి నటులు ఉన్నా వారు పోషించిన పాత్రలకి సినిమాలో పెద్దగా స్కోప్ లేకపోవడం సినిమా కామర్స్యల్  సక్సెస్ మైనస్ అని చెప్పవచ్చు.

SAtyabhama review by 18fms 9

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

దర్శకుడు సుమన్ చిక్కాల విషయానికి వస్తే దర్శకునిగా నటీనటులనుండి మంచి నటన రాబట్టుకొనే విశయం లో సక్సెస్ అయ్యాడు. కధను మలచిన తీరు కూడా బాగుంది.  శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే ని వ్రాసినా,  శశి వర్క్ మాత్రం ఈ సినిమాలో సామాన్య ప్రేక్షకులను  మెప్పించే విధంగా సాగలేదు అని చెప్పాలి.

కధా పాయింట్  రొటీన్ లైన్ అయినా దానిని థ్రిల్స్ తో  ఎంగేజింగ్ గా మలచడంలోచాలా వరకూ సక్సెస్ అయ్యారు అని చెప్పవచ్చు.ముఖ్యంగా  కాజల్ క్యారక్టరైజేషన్ బాగుంది.

కాజల్ అగర్వాల్ కి సత్యభామ లాంటి  ఒకటి రెండు లేడి ఓరియంటెడ్ సినిమా లు పడితే,  తెలుగు ప్రేక్షకులకు విజయశాంతి తర్వాత మరో లేడి సూపర్ స్టార్ దొరికినట్టే ! 

చాలా రోజుల గ్యాప్ తర్వాత కాజల్ అగర్వాల్  ఫ్యాన్స్ కి అయితే ఆమె నుంచి మంచి ట్రీట్ లభిస్తుంది అని చెప్పాలి. ఈ సత్యభామ సినిమా కోసం కాజల్ పెట్టిన ఎఫర్ట్స్ ని మెచ్చుకొని తీరాలి. ఇప్పుడు వరకు మనం చూసిన కాజల్ వేరు సత్యభామలో కాజల్ వేరు అని చెప్పాలి. ఒక అగ్రెసివ్ పోలీస్ గా ఆమె తన రోల్ అదరగొట్టేసింది అని చెప్పాలి.

మెయిన్ గా ఆమె పెర్ఫామెన్స్ తో పాటుగా ఆమెపై కొన్ని మాస్ మూమెంట్స్ అయితే ఒక స్టార్ హీరోని ఎలా చూపిస్తారో ఆ రేంజ్ లో సాలిడ్ గా ఉన్నాయి. ఆమె ఇంట్రో సీన్ కానీ క్లైమాక్స్ సీక్వెన్స్ లో కానీ కాజల్ అదరగొట్టింది. అలాగే ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆమె విషయంలో ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తాయి.

యంగ్ నటీనటులు అంకిత్, అనిరుద్ లు సాలిడ్ పెర్ఫామెన్స్ ను కనబరిచారు. అలాగే నేహా పఠాన్ మంచి ఎమోషన్స్ ని కనబరిచింది అలాగే వీరితో పాటుగా సంపద తదితర యువ నటులు సహజమైన పెర్ఫామెన్స్ ని కనబరిచారు.

ఇక వీరితో పాటుగా ప్రముఖ నటులు నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్ష వర్ధన్ లు తమ పాత్రలు పరిధి మేరకు బాగా చేశారు.

SAtyabhama review by 18fms 8

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మేకర్స్ సినిమాకి కావాల్సినంత ఖర్చు పెట్టారు. ఇక సాంకేతిక టీంలో

శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్ సినిమాలకు BGM చాలా ప్లస్ అవుతుంది. ఈ సత్యభామలో కూడా BGM చాలా సీన్స్ కి జీవం పోసింది. శ్రీచరణ్ కూడా థ్రిల్లింగ్ సీన్స్ కి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తో ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ (OSDs ) క్రియేట్ చేస్తాడు అనే పేరు ఉంది. ఈ సినిమా కి కూడా మంచి స్కోర్ ఇచ్చాడు.

DOP విష్ణు బేసి సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా కొంపోస్ చేశారు.

పవన్ కళ్యాణ్ కోదాటి  ఎడిటింగ్ పర్వాలేదు కానీ చాలా కొన్ని అనవసర సీన్స్ తగ్గించాల్సింది.  కొన్ని సీన్స్ లో ఫాస్ట్ కట్స్ ఉన్నా అవి అంతగా ఆకట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ కోదాటి ఎడిటింగ్ తో పాటు నటుడిగా కూడా మెప్పించే ప్రయత్నం చేశాడు. 

నిర్మాతలు శశికిరణ్ తిక్క, బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి మహిళల సమస్యలపై మంచి సందేశం ఉన్న కధతో సత్యభామ సినిమా నిర్మించిన విధానాన్ని మెచ్చుకోవాలి.  చిత్ర నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

SAtyabhama review by 18fms 4

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

 “సత్యభామ”సినిమా మాత్రం కాజల్ వన్ విమెన్ షో అని చెప్పాలి. సినిమాలో ఆకట్టుకునే కథ కథనాలు లేకపోయినా ఆమె మాత్రం తన నటన యాక్షన్ పెర్ఫామెన్స్ లతో అదరగొడుతుంది. కాజల్  ఆమె ఫ్యాన్స్ కి మాత్రం తన నుంచి ఎలాంటి డిజప్పాయింట్మెంట్ అనిపించదు.

అలాగే ఆమె రోల్ ని ఇంకా హైలైట్ గా చూపించినా బాగుణ్ణు అనిపిస్తుంది. కానీ సినిమాలో కథ బాగున్నా  కధనం మాత్రం కొంచెం బోరింగ్ అండ్ కన్ఫ్యూజ్ గా సాగడం వలన సినిమా ఫలితాన్ని దెబ్బ తీయవచ్చు.

ఓవరాల్ గా  అయితే కాజల్ అగర్వాల్ అభిమానులకి, క్రైమ్ థ్రిల్లర్  సినిమాలు ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది కానీ ఇతర ఆడియెన్స్ మాత్రం  చాలా తక్కువ అంచనాలు పెట్టుకుని సినిమా చూస్తే మంచి ఎమోషన్ ఉన్న  క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది.

ఇంకా ఇలాంటి కధలు సినిమాలు గా వస్తే,  వంటరీగా జీవనం సాగిస్తున్న మహిళలకు, భర్తలతో ఇబ్బందులు పడుతూ, వాటిని తల్లి దండ్రులకు చెప్పుకొలేని మహిళలకు ధైర్యాన్ని ఇస్తాయి. ఈ సత్యభామ మూవీ మాత్రం ప్రతి మహిళా చూడవలసిన సినిమా కధ.

SAtyabhama review by 18fms 2

చివరి మాట: మహిళలకు ధైర్యాన్ని ఇచ్చే సత్యభామ !

18F RATING: 3  / 5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *