Satyabhama Movie Release Date Locked: ‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ “సత్యభామ” విడుదల ఎప్పుడంటే! 

IMG 20240422 WA0166 e1713785612606

క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న “సత్యభామ” సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మే 17న ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. “సత్యభామ” సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది.

నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు.

“సత్యభామ” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం డిజైన్ చేసిన వీడియో క్రియేటివ్ గా ఉంది. క్రైమ్ సీన్ నుంచి రికవరీ చేసిన గన్ విడి పార్ట్స్ లోడ్ చేసి కాజల్ షూట్ చేయగా..అది క్యాలెండర్ లో మే 17 డేట్ ను టార్గెట్ చేస్తూ దూసుకెళ్తుంది. మే 17న “సత్యభామ” సినిమా రిలీజ్ ను ఇలా ఇన్నోవేటివ్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.

ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే క్రియేట్ అయిన బజ్ తో “సత్యభామ” సినిమా సూపర్ హిట్ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

నటీనటులు:

కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు

టెక్నికల్ టీమ్: 

బ్యానర్: అవురమ్ ఆర్ట్స్, స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క, నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి,, కో ప్రొడ్యూసర్ – బాలాజీ, సినిమాటోగ్రఫీ – బి విష్ణు, సీఈవో – కుమార్ శ్రీరామనేని, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్),దర్శకత్వం: సుమన్ చిక్కాల.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *