చిత్రం: సరిపోదా శనివారం
విడుదల తేదీ : ఆగస్టు 29, 2024,
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్.జె.సూర్య, అభిరామి, సాయికుమార్, శివాజీ రాజా తదితరులు,
దర్శకుడు: వివేక్ ఆత్రేయ,
నిర్మాతలు : డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి,
సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్,
సినిమాటోగ్రఫీ: మురళి జి,
ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్.
మూవీ: సరిపోదా శనివారం రివ్యూ ( Saripodhaa Sanivaaram Movie Review)
న్యాచురల్ స్టార్ నాని – వివేక్ ఆత్రేయ కాంబో లో రెండవ సినిమా గా డివివి దానయ్య నిర్మించిన ఈ ‘సరిపోదా శనివారం’ సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాలతో వచ్చింది. నిన్న విడుదల అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంత మేరకు రంజింప చేసిందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకొందామా !
కధ పరిశీలిస్తే (Story Line):
చిన్నప్పటి నుండి సూర్య (నాని)కి తన ముందు జరిగే అన్యాయం, అవమానాలను తట్టుకోలేదు. తనకైనా, తను అనుకొనే వారికి ఎవరికి అన్యాయం జరిగిన విపరీతమైన కోపం వస్తుంది. అతని కోపాన్ని కంట్రోల్ లో పెట్టడానికి సూర్య తల్లి (అభిరామి) ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సూర్య కోపానికి పరిష్కారంగా వారంలో ఆరు రోజులు ప్రశాంతంగా వుంటూ, వారం లో ఒక్క రోజు మాత్రామే ని కోపానికి పరిస్కరం వెదుకు అంటుంది.
ఆలా అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం తన కోపానికి కారణం అయిన వారి పేర్లు ఒక బుక్ లో రాసుకొంటూ ఒక్క శనివారం రోజు మాత్రమే కోపాన్ని సూర్య చూపిస్తూ ఉంటాడు. చనిపోయిన తన తల్లికి ఇచ్చిన వాగ్దానం కారణంగా సూర్య కూడా శనివారం ఒక్కరోజు మాత్రమే గొడవలు పడుతూ ఉంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సూర్య, కానిస్టేబుల్ చారులత (ప్రియాంక మోహన్) తో ప్రేమలో పడతాడు.
కధ లో వెరే ప్రాంతం లో అన్నయ్య కుర్మా నాంద్ ( మురళి శర్మ) మీద కోపం తో క్రూరమైన పోలీసు అధికారిగా మారిన దయానాంద్ (ఎస్‌జే సూర్య) అన్న కుర్మా కు అనుకూలంగా ఉన్న సోకులపాలెం అనే ప్రాంతాన్ని, అక్కడ నివశిస్తున్న ప్రజలను తన అధికార బలంతో హింసిస్తూ, ఎటువంటి దయ, కరుణ, జాలి లేకుండా తనకు కోపం వచ్చిన ప్రతి రోజు, ప్రతిసారీ ఇష్టం వచ్చినట్టు దారుణంగా కొడుతూ ఉంటాడు.
కానిస్టేబుల్ చారులత కు దగ్గర అయిన సూర్య, చారు ద్వారా సోకులపాలెం ప్రజల భాధలు తెలుసుకొని, వారు తన వారే అని ఫీల్ అవుతూ ఆ ప్రజలను కాశతాలనుండి కాపాడాలని ఫిక్స్ అవుతాడు. ఇక్కడి నుండి కధ సూర్య – దయా మద్య దాగుడుమూతలడుతుంది.
దయా (ఎస్.జె. సూర్య) పేరును సూర్య తన పుస్తకంలో ఎందుకు రాసుకున్నాడు?,
సోకులపాలెం ప్రజల కోసం సూర్య ఎందుకు నిలబడ్డాడు?,
కానిస్టేబుల్ చారులత (ప్రియాంక మోహన్)తో సూర్యకు ఎలా పరిచయమైంది?,
దయానంద్, కూర్మానంద్ (మురళీ శర్మ) మధ్య ఉన్న గొడవలు ఏంటి?,
దయాను సూర్య టార్గెట్ చేశాడని దయాకు తెలిసిందా? లేదా?
ఆ సోకులపాలెం ప్రజల్లో సూర్య ధైర్యాన్ని నింపాడా? లేదా ?,
అలాగే చారులత తో సూర్య ప్రేమ కథ ఎలా సాగింది ?,
వంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే వెంటనే మీ దగ్గరలొని దియేటర్ కి వెళ్ళి సినిమా చూసేయండి. అప్పటివరకూ మా సమీక్ష చదివి మారాన్ని విశయాలు తెలుసుకొనే ప్రయత్నం చేయండి.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
నాని పోషించిన సూర్య పాత్రను, ఆ పాత్ర తాలూకు మదర్ సెంటిమెంట్ , సూర్య పాత్ర కోపాన్ని చూపించే శనివారాన్ని బాగా డిజైన్ చేసుకున్న వివేక్, కొన్ని చోట్ల అంతే స్థాయిలో ఈ ‘సరిపోదా శనివారం’ సినిమా ట్రీట్మెంట్ ను కధనాన్ని (స్క్రీన్ – ప్లే ) రాసుకోలేదు అనిపిస్తుంది.
90 లో వచ్చిన సినిమాల సీన్స్ మాదిరి లాకప్ లో మనిషిని పెట్టి ప్రతి రోజు కొట్టడం ఆ కాలం లో చెల్లి ఉంటుంది కానీ, ఇప్పటి ఆధునిక సోషల్ మీడియా కాలంలో స్టేషన్ లాకప్ ఉంచిన ముద్దాయిని 24 గంటలలో కోర్టు లో హాజరు పరచాలి అని ప్రతి సమాన్యుడికి తెలుసు . ఇలాంటి చాలా సీన్స్ లాజిక్ లేకుండా సినిమాటిక్ వే లో కధనం రాసుకోవడం కొంత మైనస్ అని చెప్పవచ్చు.
ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సింది. అలాగే హీరో -హీరోయిన్ మధ్య ప్రేమ కథను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి చూపించి ఉంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు వివేక్ ఆత్రేయ కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తీసినప్పటికి, రాసుకొన్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కధనం ( స్క్రీన్ ప్లే) ను రాసుకోలేకపోయారు. ఇప్పుడు జరుగుతున్న కధకి ఓల్డ్ డేస్ లో జరిగిన సంఘటనలతో కధనం నడపడం వలన 80 ల , 90ల లో సినిమా చూసినట్టు ఉంది.
కధ కూడా ఏ ప్రాంతం లో జరుగుతుందో దర్శకుడు క్లారిటీ గా చెప్పలేకపోయాడు. ప్రస్తుతం వస్తున్న సినిమాలలో కధ జరిగే ప్రాంతాన్ని బట్టి ఆయా ప్రాంత వాడుక భాషను, సంస్కృతి ని బాగా ప్రెసెంట్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా లో వివేక్ ఆత్రేయ మాత్రం కామన్ కా ఒక ప్రాంతాన్ని క్రియేట్ చేసి చేయడం వలన కూడా రొటీన్ సినిమా లానే ఉంది.
ఈ సరిపోదా శనివారం సినిమాలో నాని చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ నాని మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. నాని నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో మరియు తన నేచురల్ లుక్స్ తో నాని సినిమాకే హైలైట్ గా నిలిచాడు.ప్రియాంక అరుల్ మోహన్ తో సాగిన లవ్ స్టోరీలోనూ నాని తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.
కానీ ఎస్ జె సూర్య చేసిన దయా పాత్ర ముందు నాని చేసిన సూర్య పాత్ర తేలిపోయింది అని చెప్పవచ్చు. దయా గా ఎస్ జె సూర్య నటన, తనదైన వాయిస్ మాడ్యులేసన్స్ తో రెచ్చిపోయి నటించాడు అని చెప్పవచ్చు. సూర్య, దయా పాత్రల డిజైన్ లో కూడా , సూర్య పాత్రకి సెటిల్డ్ ఫెరపర్మెన్స్ ఇచ్చి, దయా పాత్రకు మాత్రం హై ఎనర్జీ ఇవ్వడం వలన మరియు దయా పాత్రలో ఎస్ జె సూర్య ఉండటం వలన నాని ఫెరపర్మెన్స్ తక్కువగా కనిపిస్తుంది.
హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకుంది.
కీలక పాత్రలో నటించిన మురళీశర్మ కూడా తనదైన మేనరీజమ్స్ తో ఆకట్టుకొన్నాడు. ఎస్ జె సూర్య – మురళి శర్మ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.
ఇక నాని కి తండ్రి పాత్రలో నటించిన సాయి కుమార్ కూడా బాగా నటించాడు. మిగిలిన పాత్రలలో నటించిన అజయ్, అజయ్ ఘోష్, అభిరామి, శివాజీ రాజా హర్షవర్ధన్, ఝాన్షీ మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన పాటలు ఓకే కానీ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని సీన్స్ లో మాత్రం మరి ఎక్కువ సౌందయింగ్ ఇచ్చినట్టు ఉంది.
మురళి జి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. సూర్య పాత్రకు కోపం వచ్చినప్పుడు బాక్ గ్రౌండ్ ఎర్రగా మారడం వంటి లైటింగ్ పాటర్న్స్ వలన సీన్స్ పర్ఫెక్ట్ మూడ్ ని విజువల్స్ ప్రెసెంట్ చేశాయి.
కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ట్రిమ్ చేసి ఉండవలసింది. ఓవరాల్ గా సినిమా లెంత్ చాలా ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. ఈ కధకు 173 మినిట్స్ అంటే చాలా ఎక్కువ.
నిర్మాత డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి కానీ అవసరానికి మించి ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది, తెరమీద కూడా కనిపిస్తుంది.
సోకులపాలెం అనే స్లమ్ క్రియేట్ చేయడం అవసరానికి మించి జూనియర్ ఆర్టిస్టులను ప్రతి ఫ్రేమ్ లో ఉంచడం తగ్గించి ఉంటే ఎమోషన్ ఉన్న సీన్స్ ఇంకా బాగా ఎలివేట్ అయ్యేవి. సినిమా బడ్జెట్ కూడా కంట్రోల్ లో ఉండేది.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా పోస్టర్స్, ప్రమోషనల్ కంటెంట్ తో ఇది యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా సినిమా అని తెలిసిపోతుంది. నాని సూర్య ల నటన, వారి మద్య వచ్చే యాక్షన్ సీన్స్ మరియు నాని పాత్ర తాలూకు ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్, మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి.
ఐతే, కొన్ని వయాలెన్స్ సీన్స్, హీరో హీరోయిన్ మద్య వచ్చే సీన్స్ మాత్రం రెగ్యులర్ గా సాగాయి. సూర్య పాత్ర సెటిల్ గా ఉన్నా, దయా పాత్ర మాత్రం చాలా వాయిలెంట్ గా రియాక్ట్ అవుతుంది. కానీ SJ సూర్య నటనతో పాటు పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆధారగొట్టాడు. సూర్య, సాయి కుమార్ మద్య తండ్రి కొడుకుల బాండింగ్ మరియు నాని – అభిరామి మద్య మదర్ సెంటమెంట్ చాలా బాగా ఆకట్టుకున్నాయి.
మొత్తానికి ఈ సినిమా నానిని ఇస్తాపడే ఫాన్స్ ని, ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. క్రిటిక్స్, సామాన్య ప్రేక్షకులు మాత్రం సినిమా లెంత్ ఎక్కువ అయ్యింది, అనుకొన్న స్థాయిలో లేదు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా అయితే సినిమా బాగానే ఉంది అని చెప్పవచ్చు.