sardaar director mitran special interview

‘సర్దార్’ సినిమా  లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్..ఇలా అన్ని రుచులున్న విందు భోజనం లాంటి సినిమా అంటున్న సర్దార్ సినిమా దర్శకుడు పిఎస్ మిత్రన్  స్పెషల్ ఇంటర్వ్యూ విత్ 18F

హీరో కార్తి, అభిమన్యుడు సినిమా  దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’.

రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలౌతుంది.

కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది.

ఈ నేపధ్యంలో చిత్ర దర్శకుడు పిఎస్ మిత్రన్ మా ప్రతినిధి తో  సమావేశం అయినప్పుడు  ‘సర్దార్’ సినిమా  విశేషాలని పంచుకున్నారు.

ఆ విశేశాలు మా 18F MOVIE వెబ్సైటు పాఠ కుల కోసం ఇక్కడ ఇస్తున్నాము. 

sardar official telugu theatrical trailer out

కార్తీ తో  ‘సర్దార్’ చిత్రం ఎలా మొదలైయింది ?
నా తొలి చిత్రం ‘అభిమన్యుడు’ డబ్బింగ్ చేస్తున్నపుడే సర్దార్ ఐడియా వచ్చింది. నా రచయితల్లో ఒకరితో ఆలోచన పంచుకొని దాన్ని డెవలప్ చేశాం. నిర్మాత లక్ష్మణ్ గారికి ఈ కథ చెప్పాను.

ఆయన కార్తి గారిని కలవమన్నారు. కార్తి గారికి ‘సర్దార్’ ఐడియా చాలా నచ్చింది. మరో ఆలోచన లేకుండా ఈ సినిమా తప్పకుండా చేస్తున్నామని చెప్పారు.

‘సర్దార్’ ట్రైలర్ చూస్తుంటే పిరియడ్ సినిమాలా అనిపిస్తోంది.. కథ ఏ కాలంలో వుండబోతుంది ?

SARDAR TEASER OUR

వర్తమాన కాలంలో పాటు 1980లో నడిచే కథ ఇది. 1980 లో ఇండియన్ ఇంటలిజెన్స్ ఒక స్పై (గూఢచారి) ని తయారుచేయాలని ప్రయత్నించింది. అయితే సైన్యంలో పని చేసే వ్యక్తిని గూఢచారిగా మార్చడం అంత సులువు కాదు.

గూఢచారికి నటించడం రావాలి, మారువేషాలు వేయడం తెలియాలి. దీనికి బదులు ఒక ఒక రంగస్థల నటుడిని గూఢచారిగా మార్చారు. ఇది యదార్ధంగా జరిగింది. ఈ సంఘటన సర్దార్ కథకు ఒక స్ఫూర్తి. అలాగని ఇది పూర్తిగా యాదార్ధకథ కాదు. కొన్ని యదార్ధ సంఘటనలు స్ఫూర్తితో చేసిన కథ.

SARDAAR 2 DAYS TO GO 1

సర్దార్ ట్రైలర్ లో కార్తి రెండు పాత్రలలో కనిపిస్తున్నారు కదా.. దాని గురించి ?
ఇందులో కార్తి పాత్ర చాలా సర్ ప్రైజింగా వుంటుంది. కార్తి ఇందులో రెండు భిన్నమైన పాత్రలలో తండ్రి కొడుకులుగా కనిపిస్తారు. ఒకరి పాత్రకు మరొకరి పాత్రకి పూర్తి వైవిధ్యం వుంటుంది.

గూఢచారి పాత్ర ఎలాంటి గుర్తింపుని కోరుకోదు, తన ఉనికి గురించే బయట ప్రపంచానికి తెలీదు. మరో పాత్ర ప్రతి చిన్నదానికి పబ్లిసిటీని కోరుకుంటుంది. ఈ పాత్రలు రెండూ తెరపై చూడటానికి చాలా ఆసక్తికరంగా వుంటాయి.

కార్తితో పని చేయడం ఎలా అనిపించింది ?
నేను ఇప్పటివరకూ పని చేసిన నటుల్లో కార్తి ది బెస్ట్. తన పాత్ర పట్ల చాలా అంకిత భావంతో పని చేస్తారు. సినిమాకి ఉపయోగపడే చాలా ఆలోచలని పంచుకుంటారు. ఆయన తాజా చిత్రం పిఎస్ 1 ఘన విజయం సాధించింది. సర్దార్ ఈ విజయాన్ని కొనసాగిస్తుందని నమ్ముతున్నాను.

sardar team in special interview 3

కార్తి చాలా వైవిధ్యమైన సినిమాలు చేసినప్పటికీ ఆయన చిత్రాల్లో వినోదం వుంటుంది. మరి సర్దార్ ఎలా వుండబోతుంది ?
సర్దార్ అన్నీ రుచులు గల ఫుల్ మీల్స్ లాంటి సినిమా. లవ్, కామెడీ, యాక్షన్, బలమైన ఎమోషన్, సోషల్ కాన్సెప్ట్ వున్న సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది.

హీరోయిన్ లు రాశి ఖన్నా , రజిషా విజయన్ పాత్రలు గురించి ?
రాశి ఖన్నా , రజిషా విజయన్ పాత్రలు కథలో చాలా కీలకంగా వుంటాయి. వారి పాత్రలని అద్భుతంగా చేశారు. అలాగే ఈ చిత్రంలో లైలా పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా వుంటుంది.

మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం గురించి ?
జీవి ప్రకాష్ కుమార్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన బెస్ట్ స్కోర్స్ లో సర్దార్ ఒకటి. కథకు తగ్గ పాటలని చాలా ఎక్స్ టార్డినరీగా చేశారు. నేపద్య సంగీతం కూడా బ్రిలియంట్ గా వుంటుంది.

SARDAAR PRE RELEASE UA CENSORED

దీపావళికి చాలా సినిమాలు పోటి పడుతున్నాయి. తమిళ్ లో శివకార్తికేయన్ సినిమా కూడా వుంది. ఎలా అనిపిస్తుంది ?
గతంలో నేను శివకార్తికేయన్ సినిమా చేసినప్పుడు అది కార్తి సినిమాతో పాటుగా విడుదలైయింది. ఇప్పుడు కార్తి సినిమాతో పాటు శివకార్తికేయన్ సినిమా విడుదలౌతుంది.

గమ్మత్తుగా రెండు సార్లు నా హీరోలతోనే నా సినిమాలు ఒకేసారి వచ్చాయి.(నవ్వుతూ). అయితే రెండు డిఫరెంట్ చిత్రాలు. దేనికదే ప్రత్యేకమైనవి. దీపావళికి వస్తున్న అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ కావాలని కోరుకుంటున్నాను.

nag and karthi in Sardaar pre release

నాగార్జున గారి అన్నపూర్ణ స్టూడియోస్ సర్దార్ ని తెలుగులో విడుదల చేయడం ఎలా అనిపిస్తుంది ?
అన్నపూర్ణ స్టూడియోస్ నా ఫేవరేట్ ప్రొడక్షన్ హౌస్. నాగార్జున గారి ఆతిధ్యం అద్భుతంగా వుంటుంది. నాగార్జున గారికి కార్తికి మంచి అనుబంధం వుంది. వారిద్దరూ కలసి ఊపిరి లాంటి అద్భుతమైన సినిమా చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ సర్దార్ ని తెలుగు విడుదల చేయడం గొప్పగా, అనందంగా వుంది.

కొత్తగా చేయబోయే సినిమాలు గురించి ?
అఖిల్ తో ఒక సినిమా చేసే ఆలోచన ఎప్పటి నుండో వుంది. అయితే ప్రస్తుతానికి నా ద్రుష్టి సర్దార్ విడుదల పైనే వుంది.

ఒకే అల్ ది బెస్ట్ మిత్రన్ ..

-కృష్ణా ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *