మూవీ: సప్త సాగరాలు దాటి సైడ్ – A
విడుదల తేదీ :సెప్టెంబర్ 22, 2023
నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, అవినాష్, శరత్ లోహితాశ్వ, అచ్యుత కుమార్, పవిత్ర లోకేష్, రమేష్ ఇందిర, గోపాల్ కృష్ణ దేశ్ పాండే తదితరులు.
దర్శకుడు : హేమంత్ ఎం రావు
నిర్మాత: రక్షిత్ శెట్టి, టి జి విశ్వ ప్రసాద్
సంగీతం: చరణ్ రాజ్
సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి
ఎడిటర్: సునీల్ భరద్వాజ్ మరియు హేమంత్ ఎం రావు

మూవీ రివ్యూ: సప్త సాగరాలు దాటి సైడ్ – A
ఈ నెల మొదటి రోజున కన్నడ లో విడుదల అయి కన్నడ బాక్స్ ఆఫీసు దగ్గర భారీ సక్సెస్ ని సాధించిన చిత్రం సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ -A. ఆ సినిమా ని తెలగు ప్రేక్షకుల కోసం రక్షిత్ శెట్టి తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు సప్త సాగరాలు దాటి సైడ్ – A గా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
హీరో రక్షిత్ శెట్టి నటించిన ఈ చిత్రం కన్నడ ప్రేక్షకులని మెస్మరైజ్ చేసి హిట్ అయ్యింది. మరి తెలుగులో ఈ చిత్రం ఈ శుక్ర వారమే దియేటర్స్ లోకి వచ్చింది. మరి ఎంతమేర తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందో మా 18F మూవీస్ సమీక్షలో చదివి తెలుసుకొందామా !

కథ ని పరిశీలిస్తే (Story line):
ఈ సప్త సాగరాలు దాటి సినిమా కథ ని పరిశీలిస్తే …మను(రక్షిత్ శెట్టి) ఓ క్యాబ్ డ్రైవర్ కాగా ప్రియా(రుక్మిణి వసంత్) ఓ కాలేజ్ స్టూడెంట్ మరియు లైఫ్ లో సింగర్ కావాలని కోరుకుంటుంది. అయితే మను ప్రియ లు ఇద్దరు కూడా గాఢమైన ప్రేమలో ఉంటారు. ప్రియా చిన్నప్పటినుండి సముద్రం పక్క ఊరులో పెరగడం వలన తనకు ఇష్టమైన సొంత ఊరి సముద్రం దగ్గర ఓ ఇంటిని కట్టుకోవాలని అందులో ఉండాలని మను గట్టిగా నిర్ణయించుకుంటాడు.
అలా స్వంత ఇంటి కల నెరవేరడం కోసం, వారిద్దరి మంచి భవిష్యత్ కోసం మను ఓ ఊహించని నిర్ణయం సొంతంగా తీసుకుంటాడు. ప్రియ వద్దు అని చెప్పినా మను తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడి వెళ్ళిపోతాడు.
ప్రియ కు ఇష్టం లేని మను తీసుకొన్న ఆ నిర్ణయం ఏంటి?
ఆ నిర్ణయం వారిద్దరి జీవితాల్లో ఏమన్నా ఊహించని మార్పులు తీసుకొచ్చిందా ?
వారిద్దరూ తమ స్వంత ఇంటి కలని నెరవేర్చుకున్నారా లేదా ?
మను తీసుకొన్న తప్పుడు నిర్ణయానికి శిక్ష ఏంటి ? ఎందుకు అలా చేశాడు ?
ప్రియ తనకు ఇష్టమైన సింగింగ్ కొనసాగించిందా ?
ఈ క్రమంలో వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది ?
అనే ప్రశ్నలకు జవాబులు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెంటనే దియేటర్ కి వెళ్ళి చూడాల్సిందే.

కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):
ఈ చిత్రంలో అయితే కొత్త కథ అనేది కనిపించదు కానీ అందరికీ తెలిసింది కనెక్ట్ అయ్యేదే కనిపిస్తుంది. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ లాంటి వాటిని ఆశించి చూసేవారికి కూడా ఇది రుచికపోవచ్చు. వీటితో పాటుగా సినిమా నుంచీ కాస్త స్లోగా అలా సాగదీతగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
అలాగే కొందరు ముఖ్య నటులు అచ్యుత్ కుమార్, పవిత్ర లోకేష్ అలాగే శరత్ లాంటి నటుల పాత్రలని ఇంకా బెటర్ గా డిజైన్ చేసి అవసరమైనంత స్క్రీన్ స్పేస్ ఇవ్వాల్సింది. అలాగే సినిమాకి సోల్ లాంటి సెకండాఫ్ లో కాస్త విసుగు రావొచ్చు. కొన్ని సన్నివేశాలు కాస్త రీపీటెడ్ గా వస్తూ ఉంటాయి. వీటితో అయితే ఈ చిత్రం అన్ని వర్గాలు ప్రేక్షకులని ఆకట్టుకోకపోవచ్చు.

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:
దర్శకుడు హేమంత్ ఎం రావు విషయానికి వస్తే..తాను రాసుకొన్నది చాలా సింపుల్ కధ అయినప్పటికీ తన స్క్రీన్ రైటింగ్ మరియు డైరెక్షన్ తో పాటూ ఆర్టిస్ట్ నుండి బెస్ట్ ఫెరఫ్వర్మన్స్ తీసుకొని మంచి అవార్డు సినిమా ప్రేక్షకులకు ఇచ్చాడు . మరో రకంగా చెప్పాలి అంటే క్లీన్ ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ పోయాట్రిక్ సినిమా ఇచ్చాడు అని చెప్పవచ్చు.
దర్శకుడు హేమంత్, ఈ కధ రాసుకొన్నప్పుడు ఓక సిన్మా గానే తీద్దాము అని మొదలు పెట్టు 50% సినిమా షూటింగ్ అయిన తర్వాత రష్ చూసుకొని ఇంకా సీన్స్ రాసుకొని ఐదు గంటల సినిమా ఎడిట్ చేసి రెండు పార్టులుగా (సైడ్ – A & సైడ్ – B) విడుదల చెయ్యాలి అని నిర్ణయించుకొని మొదటి పార్ట్ గా సైడ్ – A విడుదల చేయడం సాహసమే అయినా చేసి సక్సెస్ సాదించడం నిజంగా గ్రేట్ .

ఈ “సప్త సాగరాలు దాటి” సినిమా లో కూడా ఎమోషనల్ ఫీల్ టు పాటు గొప్ప సందేశం కూడా ఉంది. సంతోషంగా సాగిపోతున్న జీవితంలో అతిగా ఆలోచించి చేసే చిన్న తప్పులు కూడా జీవిత గమ్యాన్ని మార్చే స్తాయి అనిడే సోషల్ మెసేజ్. అలాగే సినిమా కధ ను నడిపించే కధనం (స్క్రీన్ -ప్లే ) కూడా చక్కగా ఉంది.
మెయిన్ గా సినిమా లవర్స్ కి ఈ సిన్మా మరింతగా కనెక్ట్ కావచ్చు. విజయల్స్ కి అనుగుణంగా సినిమాలో వినిపించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పలు సీన్స్ కి ఎమోషన్స్ కి అదనపు బలాన్ని చేకూర్చింది. ఇక నటీనటులు కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ లను కనబరిచారు.

రక్షిత్ శెట్టి తన సింపుల్ రోల్ ని చాలా మెచ్యూర్డ్ గా సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో ఇంప్రెస్ చేసాడు. లుక్ ని కూడా చాలా న్యాచురల్ గా మెయిన్టైన్ చేశాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అయితే సినిమా చూసే ప్రేక్షకుడి చేత కూడా కంటతడి పెట్టిస్తాడు. మను పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు నటించి మెప్పించాడు.
ఇక నటి రుక్మిణి వసంత్ కూడా ప్రియ పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. తన డీసెంట్ పెర్ఫామెన్స్ లుక్స్ తో ప్రియ పాత్రలో ఆమె చేసిన సహజ నటన కనిపిస్తుంది కానీ రుక్మిణీ ఎక్కడా కనిపించదు. అలానే ఇద్దరి నడుమ పలు సీన్స్ కానీ వారి కెమిస్ట్రీ కానీ చాలా బాగున్నాయి.
వీరితో పాటుగా ఇంట్రెస్టింగ్ గా చెప్పుకోవాల్సింది మరో నటి పవిత్ర లోకేష్. కాస్త లిమిటెడ్ గానే ఆమె కనిపించిన మంచి పాత్రలో అయితే ఆమె కనిపించి దానిని రక్తి కట్టించారు. చాలా సింపుల్ అమ్మగా కనిపించి కొన్ని సీన్స్ లో కంటతడి పెట్టించింది అని చెప్పవచ్చు. మిగిలిన పాత్ర ధరులు తమ తమ పాత్రల పరిది లో చక్కగా నటించి మెప్పించారు.

సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:
ఇలాంటి ఫీల్ గుడ్ సిన్మాలకు సాంకేతిక నిపుణుల పనీతిరే ప్రాణం. మ్యూజిక్, ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్ లలో ఏది సరిగా లేకపోయినా చూసే ప్రేక్షకుడు డిస్కనెక్ట్ అయిపోతాడు. కానీ ఈ సప్త సాగరాల దాటి సినిమా కి అన్నీ చక్కగా కుదిరాయి.
చరణ్ రాజ్ మ్యూజిక్ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పాలి. సౌండ్ డిజైన్ అద్భుతంగా కుదిరి కొన్ని సీన్స్ కి ప్రాణం పోసినట్టుగా ఉంది.

అలాగే అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ సినిమామూడ్ ని చాలా బాగా ఎలివట్ చేసింది. ఫీల్ గుడ్ రావడానికి విజువల్స్ కూడా ప్రత్యేక పాత్ర పోశించాయి అని చెప్పవచ్చు.
అలాగే సునీల్ భరద్వాజ్ ఎడిటింగ్ కూడా బాగుంది. కొన్ని సీన్స్ ఎందుకో నిడివి ఎక్కువగా వదిలేశారు. అవి ట్రిమ్ చేసి ఉంటే బాగుండును. ఓవరాల్ గా టెక్నికల్ టీం సపోర్ట్ వలన ప్రేక్షకుడు స్లో నరేషన్ ని కూడా ఓపిగ్గా చూసేలా చేసింది .
చిత్ర నిర్మాత కూడా ఖర్చుకి వెనకాడకుండా మంచి పొయిట్రిక్ సినిమా నిర్మించాడు. డబ్బింగ్ కూడా పాత్రలకు తగ్గట్టుగా వాయిస్ ఇచ్చారు. తెలుగు డైలాగ్స్ కూడా బాగా కుదిరాయి.

18F మూవీస్ టీం ఒపీనియన్:
ఈ “సప్త సాగరాలు దాటి సైడ్ – ఏ” నెమ్మదిగా మనస్సుని అత్తుకొనే మంచి లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. కథా కథనాలు బాగున్నా, సినిమా మొత్తం స్లో గా సాగే నరేషన్ సీన్స్ వలన అందరు ఆడియెన్స్ కి నచ్చకపోవచ్చు. మంచి ఏమోసనల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కావాలి అనుకొనే వారు ఓకసారీ ట్రై చేయవచ్చు. దియేటర్స్ కి వెళ్ళడం ఇష్టం లేనివారు రెండు, మూడు వారాలు ఆగితే చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఓటీటీ లో చూడవచ్చు.
టాగ్ లైన్: కష్టంగా తీరం దాట వచ్చు !
18FMovies రేటింగ్: 3 / 5
* కృష్ణ ప్రగడ.