Santosham Awards campaign in full swing in Goa: ధూమ్ ధాంగా సంతోషం అవార్డుల వేడుక ప్రమోషన్స్ ! 

IMG 20231126 WA0127 e1700999474365

 

సంతోషం పేరుతో గత 22 ఏళ్లుగా అవార్డులు అందిస్తున్న సంతోషం వారపత్రిక ఈ ఏడాది కూడా అందుకు సిద్ధం అయింది. సురేష్ కొండేటి ఆధ్వర్యంలో డిసెంబర్ 2న గోవాలో గ్రాండ్ గా జరగబోయే 22 వ సంతోషం – సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ వేడుకల నేపథ్యంలో సంతోషం టీం అప్పుడే ప్రమోషన్ మొదలెట్టింది.

ఈ ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే ఔట్ డోర్ ఆఫ్ లైన్, ఆన్ లైన్ ప్రమోషన్ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేసారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తో పాటు పలు పట్టణాలు, నగరాల్లో సంతోషం – సౌత్ ఇండియా ఫిలిం అవార్డు వేడుకల యాడ్స్, ఈవెంట్ డీటెయిల్స్ తో అందిస్తున్న ప్రమోషన్స్ కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో సంతోషం డిజిటల్ ప్రమోషన్స్ గురించి ఓ రేంజ్ లో చర్చించుకుంటున్నారు.

IMG 20231126 WA0126

సౌత్ ఇండియాలో గ్రాండ్ గా జారబోయే 22వ సంతోషం – సౌత్ ఇండియా ఫిలిం అవార్డు వేడుకలు డిసెంబర్ 2న గోవాలో మధ్యాహ్నం 3గంటల నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సౌత్ ఇండియా లోని నాలుగు బాషల సినిమాలకు అవార్డులు అందిస్తూ ప్రాచుర్యం పొందింది. అదే తరహాలో డిసెబంర్ 2న జరగబోయే

IMG 20231126 WA0128

ఈ అవార్డు వేడుకల్లో తెలుగు తో పాటు తమిళ్, మలయాళ, కన్నడ బాషల సినిమాలకు అవార్డులు అందచేయనున్నారు. సంతోషం అధినేత సురేష్ కొండేటి ఈ అవార్డు వేడుకలను ప్రతి ఏడాది ఓ యజ్ఞం లా జరుపుతున్నారు. ఈ వేడుకలకు తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలకు సంబందించిన పలువురు స్టార్స్, టెక్నీషియన్స్ పాల్గొననున్నారు.

 

అంతర్జాతీయ స్థాయిలో గ్రాండ్ గా జరగనున్న ఈ వేడుకల్లో పలువురు తారల డాన్స్, కామెడీ, హంగామాతో ఫుల్ ఫన్ అండ్ ఎంటర్ టైనేమేంట్ గా ఉండబోతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *