Santosham 22nd Sounth India Awards 2023 Date locked: గోవాలో అంగరంగ వైభవంగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డుల 2023 ఎప్పుడంటే! 

IMG 20231013 WA0144 e1697203929823

 

జాతీయ సినిమా దినోత్సవం పురస్కరించుకుని సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డుల ఈవెంట్ కి సంబంధించిన డేట్ అనౌన్స్ చేశారు ప్రముఖ అగ్ర కథానాయిక శ్రీలీల.

ఈరోజు అధికారికంగా ఒక వీడియో రిలీజ్ చేస్తూ శ్రీ లీల ఈ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డుల ఈవెంట్ డిసెంబర్ 2 – 2023న గోవాలో అంగరంగ వైభవంగా జరగనుందని ఆమె పేర్కొన్నారు.

IMG 20231010 WA0132

ఇక గోవాలోని బాంబోలిం బీచ్ కు అతి చేరువలో ఉన్న డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది. ఇక అదే సమయంలో గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. 150 దేశాల నుంచి సినీ ప్రేమికులు ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

 

ఇక ఆ దేశాల సినీ ప్రేమికులు, మన ఇండియన్ సినీ లవర్స్ మోహరించి ఉన్న గోవాలో వేలాది ప్రేక్షకుల మధ్య సంతోషం 22వ సౌత్ ఇండియన్ ఇండియన్ ఫిలిం అవార్డుల వేడుక జరగనుంది.

ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు బాలీవుడ్ కు చెందిన పలువురు సినీ రంగాలకు చెందిన అతిరథ మహారధులు హాజరు కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *