సంతోషం 2022 అవార్డుల కార్యక్రమంలో మరో బాలీవుడ్ హాట్ బాంబ్  వరీనా హుస్సేన్ తో స్పెషల్ పెర్ఫార్మెన్స్   

IMG 20221216 WA0078

 

ఎన్ని సినిమాలున్నా తెలుగు వారంతా తెలుగు సినిమాల మీదనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారో, అలాగే ఎన్ని అవార్డుల కార్యక్రమాలు ఉన్నా తెలుగు వారంతా సంతోషం అవార్డుల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు.

అందుకే ఇరవై సంవత్సరాలుగా సినీ రంగంలో ఉత్తమ చిత్రాలను గుర్తించి పలు విభాగాల వారికి అవార్డులు అందజేస్తోంది సంతోషం సంస్థ. ప్రస్తుతం సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022కి సన్నద్ధమవుతోంది.

SAVE 20221218 191643

కరోనా సమయంలో తప్పితే ప్రతేడాది సినీ పరిశ్రమలో ఉత్తమ విభాగాలను గుర్తించి వారికి అవార్డులను అందజేస్తున్న సురేష్ కొండేటి సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలలలో అన్ని విభాగాల వారికి అవార్డులు ఇస్తూ వస్తున్నారు. సురేష్ కొండేటి.

ఈసారి ఈ కార్యక్రమాన్ని మరో లెవెల్ కి తీసుకు వెళ్లే ప్రయత్నం చేసిన సురేష్ కొండేటి ఈసారి అనేక స్పెషల్ ఎట్రాక్షన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాతో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు.

ఇక ఇప్పుడు మరో మాస్ ఐటెం భామను కూడా సంతోషం అవార్డుల ఫంక్షన్లో స్టెప్పులు వేయించబోతున్నారు. ఆమె ఇంకెవరో కాదు వరీనా హుస్సేన్, ముందుగా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాలో గులేబకావళి సాంగ్ తో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న ఆమె ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి-సల్మాన్ ఖాన్ తో కలిసి ‘’బ్లాస్ట్ బేబీ” స్టెప్పులేసింది.

ఇక అంతకు ముందే దబాంగ్ ౩లొ కూడా మెరిసిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. అలాంటి భామతో ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ప్లాన్ చేశారు సురేష్ కొండేటి. సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022 కార్యక్రమం ఈనెల 26న ఘనంగా జరగనుంది.

సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సుమారు 12 గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలాగా సంతోషం సురేష్ కార్యక్రమాలు డిజైన్ చేశారు. ఇక దీనికి సంబంధించిన కర్టన్ రైజర్, సంతోషం OTT అవార్డుల కార్యక్రమం డిసెంబర్ 21 వెస్టిన్ హోటల్ లో ఘనంగా ప్లాన్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *