సంతోష్ శోభన్ హీరోగా యూవీ క్రియేషన్స్  “కపుల్ ఫ్రెండ్లీ” షూటింగ్ అప్ డేట్! 

IMG 20250317 171835

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా “కపుల్ ఫ్రెండ్లీ“. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది.

అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ గా తెరకెక్కుతున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది.

IMG 20250317 171854

“కపుల్ ఫ్రెండ్లీ” సినిమా టైటిల్ కొత్తగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా వీడియో గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఆడియెన్స్ కు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇవ్వనుంది. ఈ సినిమా తెలుగు తమిళ ఆడియో రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ తీసుకుంది. త్వరలోనే “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నటీనటులు :

సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు

టెక్నికల్ టీమ్: 

ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ, ఎడిటర్ – గణేష్ శివ, డీవోపీ – దినేష్ పురుషోత్తమన్, మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ, సమర్పణ – యూవీ క్రియేషన్స్, నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి., పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *