Santhosam Suresh: సినిమా సిగలో మూడు దశాబ్దాల సురేష్ కొండేటి ప్రస్థానం

18 ఏఫ్ విషెస్ టు సురేష్ కొండేటి

సంతోశం సురేష్ గా తెలుగు సినిమా ప్రముకులకు, సురేష్ కొండేటి గా సమకాలీన జర్నలిస్టు సోదరులకు, సురేష్ అన్నా గా సినీ కార్మికులకు పరిచయం ఉన్న ఈ పేరు ఒక్క రోజులో, ఒక్క సంవత్సరం లో వచ్చింది కాదు ఎవరో ఇచ్చిన బిరుదు కాదు.

నిరంతర పలితం ఆశించని శ్రమ  తో  కృషి తో మూడు దశాబ్దాలుగా సినీ కళమ్మా తల్లి ఆరాధనలో సాధించుకొన్నది.

పాలకొల్లులో పుట్టి ఫిలిం నగర్లో అడుగుపెట్టి సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి సురేష్ కొండేటి.

santosham awards 2022

‘సంతోషం’ సురేష్ అని అందరూ పిలుచుకునే సురేష్ కొండేటి జీవిత ప్రస్థానాన్ని అవలోకిస్తే ఎన్నో మజిలీలు కనిపిస్తాయి. స్కూల్ డేస్ లో సూపర్ స్టార్ కృష్ణ అభిమాని అయిన సురేష్ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా మారి హైదరాబాద్ లో అడుగుపెట్టి తన ‘సంతోషం’తో సినిమా పరిశ్రమకు సగం బలాన్ని అందిస్తున్న సురేష్ కొండేటి మూడు దశాబ్దాల అనుభవాన్ని మూటగట్టుకున్నారు.

జర్నలిస్టుగా, పంపిణీదారుడిగా, నిర్మాతగా, నటుడిగా రాణిస్తున్నారు సురేష్ కొండేటి. సురేష్ కొండేటి 1992లో చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ ఏడాది ఇండస్ట్రీ మనిషిగా 30 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు.

Santosham Film Awards 18th Anniversary1

ఈ మూడు దశాబ్దాల కెరీర్‌లో సురేష్ కొండేటి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయనను చూసి కొంత మంది పీఆర్వోలు కూడా అయ్యారు. సురేష్ కొండేటి దగ్గర పని చేసిన వాళ్లలో ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారు.

సురేష్ కొండేటి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు. సినిమాల మీద ఆసక్తితో నటుడు కావాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

హైదరాబాద్ వచ్చిన కొత్తలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. అక్కడి నుంచి జర్నలిజం వైపు జీవితం మళ్లింది. నటుడిగా కంటే జర్నలిస్టుగా దూసుకెళ్లారు. రెండు దశాబ్దాల క్రితం జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు.

Suresh kondeti birthday special 2

‘కృష్ణాపత్రిక’, ‘వార్త’ దిన ప్రతికల్లో సినిమా జర్నలిస్ట్‌గా విశేష అనుభవాన్ని సంపాదించుకున్న సురేష్ కొండేటి ఆ తర్వాత సొంతంగా ‘సంతోషం’ సినిమా వార పత్రిక ప్రారంభించారు.

ఈ వీక్లీ మ్యాగజైన్‌ నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. తన పత్రిక పేరుతో సంతోషం ఫిల్మ్ అవార్డులను అందించడం మొదలుపెట్టారు. ఇవాళ సౌత్‌లోనే ‘ఫిల్మ్ ఫేర్’ తర్వాత మళ్ళీ అంతటి క్రేజ్ ఉన్నది ‘సంతోషం అవార్డ్స్’కే అంటే అతిశయోక్తి కాదు.

‘చిత్రసీమలోని ప్రతి ఒక్కరూ తనను సొంత మనిషిగా భావించి అక్కున చేర్చుకోవడం వల్లే ఇది సాధ్యమైంది’ అని సురేష్ కొండేటి చెబుతుంటారు.

సంతోశం 2

జర్నలిస్ట్‌గా కొనసాగుతూనే మరో వైపు సినిమాలకు పీఆర్వోగానూ చేస్తున్నారు సురేష్ కొండేటి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సురేష్ కొండేటి పీఆర్వోగా వ్యవహరిస్తారనే విషయం అందరికీ తెలుసు.

పీఆర్వోగా దాదాపు 600 చిత్రాలు చేశారు. ఎస్‌కే పిక్చర్స్ సంస్థను స్థాపించి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు నిర్మించడం కూడా మొదలు పెట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, గజాల జంటగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘స్టూడెంట్ నెంబర్1’ చిత్రం సురేష్ కొండేటి కెరీర్‌కు పంపిణీదారుడిగా పునాది వేసింది.

student no 1 sk pictures release

మహేశ్వరి ఫిల్మ్ ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలో అప్పటివరకు ఎన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన సురేష్ కొండేటి, సొంతంగా ఎస్‌కే పిక్చర్స్ సంస్థను స్థాపించి తన తొలి సినిమాగా ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు.

తొలి సినిమాతోనే హిట్ అందుకున్న దర్శకుడిగా రాజమౌళికి గుర్తింపు రాగా తొలి సినిమా డిస్ట్రిబ్యూషన్‌తో విజయం సొంతం చేసుకున్న సంస్థగా ఎస్‌కే పిక్చర్స్‌ గుర్తింపు తెచ్చుకుంది. సుమారు 80 దాకా సినిమాలను పంపిణీ చేసిన అనుభవం సురేష్ కొండేటిది.

santosham awards2021

ఆ అనుభవంతో ‘ప్రేమిస్తే’ చిత్రంతో నిర్మాతగా మారారు. తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ‘జర్నీ’ ‘పిజ్జా’ ఇలా దాదాపు పదిహేను చిత్రలను తెలుగువారి ముందుకు తీసుకొచ్చారు.

సంతోశం 3

స్టార్ కమెడియన్ ‘షకలక’ శంకర్ హీరోగా ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో రూపుదిద్దుకున్న విజయవంతమైన చిత్రం ‘శంభో శంకర’ నిర్మాతల్లో సురేష్ కొండేటి ఒకరు. అలాగే మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్‌’ను తెలుగులో ‘జనతా హోటల్‌’ పేరుతో సురేష్ కొండేటి విడుదల చేశారు.

వినోదంతో పాటు సామాజికాంశాలతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు సురేష్ కొండేటి ఉత్తమాభిరుచిని తెలియచేసేవే. కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలు చేసిన సురేష్ కొండేటి ఇటీవల కీలక పాత్రలు పోషించారు.

suresh DEVINENI poster

‘దేవినేని’ మూవీలోని వంగవీటి రంగా పాత్రతో ఆయన ఆకట్టుకున్నారు. అలాగే మరికొన్ని చిత్రాల్లో కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
‘‘చిత్రసీమలోకి వచ్చిన తర్వాత కూడా తనకు పుట్టిన రోజుని వేడుకగా జరుపుకోవడం అలవాటు లేదని, అయితే ఓసారి ‘మగధీర’ ప్రెస్ మీట్ కు వెళ్ళినప్పుడు ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ గారికి ఆ వేళ నా బర్త్ డే అనే విషయం తెలిసి… వెంటనే కేక్ తెప్పించి బర్త్ డే జరిపించారని సురేష్ చెబుతుంటారు.

మా పాలకొల్లు వాసి, నాకు చిత్ర పరిశ్రమలో చేదోడు వాదోడుగా ఉండే అల్లు అరవింద్ గారి ఆశీస్సులతో అప్పటి నుంచి బర్త్ డే జరుపుకుంటున్నానని సురేష్ కొండేటి గతంలో ఒక సందర్భంలో వెల్లడించారు. సురేష్ కొండేటి మల్టీ టాలెంటెడ్ పర్సన్.

santosham awards4

తన కలాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా మలుచుకుంటూ ఒక్కో మెట్టూ అధిరోహించారు. పత్రికలకు కాలం చెల్లడంతో వెబ్ జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అంతేకాదు యూట్యూబ్ ఛానెల్ ను స్థాపించి నిర్విఘ్నంగా దాన్ని కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో తనకు తిరుగులేదని ఈ డిజిటల్ ప్రపంచానికి చాటి చెప్పారు.

నేటి డిజిటల్ ట్రెండ్ ని ఒడిసిపట్టుకొని, సంతోషం సౌతిండియన్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ ని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే కరోనా సమయంలో అన్నీ మూత పడినా ఎక్కడా వెనకడుగు వేయకుండా యూట్యూబ్ లో డైలీ బులెటిన్ రిలీజ్ చేస్తూ అందరూ ఔరా అనిపించేలా చేశారు.

సంతోశం అవార్డ్స్ 1

అంతేకాదు ఈ బులెటిన్ కోసం టాలీవుడ్లో అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇవి కాక సినిమా ప్రెస్ మీట్లలో తనదైన శైలిలో ప్రశ్నలను సంధించి విషయం రాబట్టడంలో ఘనపాటిగా సురేష్ కొండేటికి పేరుంది.

అందుకే ఆయనది కలకలం సృష్టించే కలం.. అది చిత్ర పరిశ్రమలో నిలుస్తుంది కలకాలం అంటూ ఉంటారు సన్నిహితులు.. ఇక నిరాటకంగా సంతోషం అవార్డ్స్ అందిస్తూ వస్తున్న ఆయన ఈ ఏడాది సంతోషం 21వ వార్షికోత్సవం సంధర్భంగా 2021-22 సంవత్సరాలలో విడుదలైన సినిమాలకు అవార్డులు అందించనున్నారు.

త్వరలోనే అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది అని సంతోశం అవార్డ్స్ కమిటీ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *