‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి గోదారి గట్టు పాట వచ్చేస్తుంది. 

IMG 20241127 WA0233 scaled e1732726011123

విక్టరీ వెంకటేష్ ఎక్స్-కాప్ గా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం‘. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ రోజు, మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టుకు సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. రమణ గోగుల పాడిన ఈ పాట ఆయన కమ్ బ్యాక్ ని సూచిస్తుంది. ఈ బ్రీజీ రొమాంటిక్ మెలోడీకి భాస్కరభట్ల రిరిక్స్ రాశారు.

సాంగ్ పోస్టర్ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ మధ్య ఒక బ్యూటీఫుల్ మూమెంట్, వెన్నెల రాత్రి నేపథ్యంలో సెట్ చేయబడింది. పౌర్ణమి ఆకాశంలో అందంగా వుంది, అద్భుతమైన సెట్టింగ్స్ మధ్య రొమాంటిక్ మూమెంట్స్ ని ఆస్వాదిస్తున్న జంట ఆకట్టుకుంది.

IMG 20241127 WA0175

హీరో వెంకటేష్‌, మరో హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలసి ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని అద్భుతమైన ప్రదేశాలలో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

తారాగణం:

వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సమర్పణ: దిల్ రాజు,బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,నిర్మాత: శిరీష్,సంగీతం: భీమ్స్ సిసిరోలియో,డీవోపీ: సమీర్ రెడ్డి,ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్,ఎడిటర్: తమ్మిరాజు,కో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ,యాక్షన్ డైరెక్టర్: వి వెంకట్,VFX: నరేంద్ర లోగిసా,పీఆర్వో: వంశీ-శేఖర్,డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా,మార్కెటింగ్: నాని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *