Sanjana Anne Directing a Feature Film: మెగా ఫోన్ పట్టుకోబోతున్న నటి సంజన అన్నే !

IMG 20240219 WA0163

అప్పుడెప్పుడో భానుమతి.. ఆ తర్వాత సావిత్రి , ఆపై విజయ నిర్మల.. ఆ తర్వాత బి జయ.. ఇలా తరానికి ఒక్క లేడీ డైరెక్టర్ కనిపిస్తుంటారు. ఏ ఇండస్ట్రీలో అయినా అంతే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది.

IMG 20240219 WA0166

ఇప్పుడు లేడీ డైరెక్టర్స్ చాలా మంది వస్తున్నారు. మెగా ఫోన్ పట్టి తమ సత్తా చూపిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కొందరు లేడీ డైరెక్టర్స్ వచ్చి సత్తా చూపించారు. విజయాలు కూడా అందుకున్నారు. అలా మొదలైది, కల్యాణ వైభోగమే, ఓ బేబీ సినిమాలను డైరెక్ట్ చేసి నందిని రెడ్డి మంచి దర్శకురాలు అనిపించుకున్నారు. అలాగే 2021 యేడాదిలో ‘వరుడు కావలెను’ సినిమాతో లక్ష్మీ సౌజన్య… ఆ తర్వాత విడుదలైన ‘పెళ్లి సందD’ సినిమాతో గౌరీ డైరెక్టర్స్ పని చేసారు.

IMG 20240219 WA0164

తాజాగా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంజన అన్నే కూడా దర్శకత్వ భాద్యలు చేపట్టబోతున్నారు. సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బాబు కొల్లబాతుల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ ఉదగండ్ల ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రచన, దర్శకత్వం సంజన అన్నే.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *