యానిమాల్ యంగోవర్ నుండి బయటకు వచ్చి స్పిరిట్ పనులు మొదలు పెట్టిన సందీప్ వంగ, ప్రస్తుతం ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకొనే హీరోయిన్ వేటలో ఉన్నాడు అని యూనిట్ సబ్యులు చెప్తున్నారు. కొన్ని పేర్లు పరిశీలనకు వచ్చిన తర్వాత యానిమాల్ యంగోవర్ లోనే రష్మిక మందన్న తో కంటెన్యూ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకొంటున్నారంట !
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాటిలో మొదటిగా చెప్పుకోవాలసింది నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 ఏడి రెండవది మారుతీ తీస్తున్న ది రాజా సాబ్. కల్కి మాత్రం రెండు భాగాలు గా రానుంది. రెండు పార్ట్శ్ ఘాట్ ఓకె సారీ చేసేస్తున్నట్టు తెలుస్తుంది. రాజా సాబ్ మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ కి కాంప్లెట్ చేసి స్పిరిట్ మూవీ కోసం రెఢీ అవ్వాలి అనేది ప్రభాస్ ఆలోచన.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమాల్ మంచి కలెక్షన్స్ తెచ్చుకొని ఇండియన్ సినీ హిస్టరీ లో తనకంటూ ఓక పేజీ క్రియేట్ చేసుకోంది. యానిమాల్ సినిమా కి కొనసాగింపుగా యానిమాల్ పార్క్ చేస్తాను అని సందీప్ చెప్పినా ప్రస్తుతం స్పిరిట్ ఆ తర్వాత మరో సినిమా చేసిన తర్వాత యానిమాల్ పార్క్ చేయాలని వంగ అనుకొంటున్నారని తెలిసింది.
స్పిరిట్ మూవీ కంటెంట్ విశయానికి వస్తే ,ఇందులో ప్రభాస్ ఒక హానెస్ట్ అండ్ ఎనర్జిటిక్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు ఇటీవల పలు ఇంటర్వ్యూస్ లో భాగంగా దర్శకుడు సందీప్ వంగ చెప్పారు. డార్లింగ్ ప్రభాస్ కి స్పిరిట్ మూవీ 25 వ చిత్రం కాబట్టి, ప్రభాస్ కెరియర్ బెస్ట్ మూవీ గా ఉండాలని చూస్తున్నారు చిత్ర యూనిట్.
రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఆనిమల్ లో రష్మిక హీరోయిన్ గా నటించి తన అందం, అభినయంతో అందరినీ మెప్పించిన విషయం తెలిసిందే. రష్మిక వర్క్ తనకు ఎంతో నచ్చడంతో మరొక్కసారి స్పిరిట్ లో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని సందీప్ ఫిక్స్ అయ్యారట.
ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై మూవీ మేకర్స్ నుండి అఫీషయల్ గా క్లారిటీ త్వరలోనే వస్తుంది అని ఇండస్ట్రి లో టాక్. చూద్దాం ప్రభాస్ రష్మిక ల జోడీ వెండి తెర మీద ఎలా ఉండబోతుందో..