మలయాళ సినీ లోకం లో సంచరిస్తున్న సంయుక్త మీనన్ తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అవుతూ సంతకం పెట్టిన మొదటి సినిమా బింబిసార అయితే, ఆ సినిమా విడుదల కాకుండానే రెండవ సినిమా గా సంతకం పెట్టిన సినిమా విరూపాక్ష.
అనుకోని కారణాల వలన ఆ రెండు సినిమాలు ఆలస్యం అవ్వడం తో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో రానా దగ్గుబాటి కి జోడిగా నటించిన మూడవ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి మొదటి సినిమా తో నే ఆశేష ప్రేక్షక ఆదరణ పొందినది సంయుక్త మీనన్.

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్ గా నటించిన థ్రిల్లర్ సినిమా విరూపాక్ష. ఈ సినిమా తో కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతూ బివిఎస్ఎన్ ప్రసాద్ నియూర్మాతగా సుకుమార్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ శుక్రవారం విడుదల అవుతున్న విరూపాక్ష సినిమా ప్రచారం లో భాగంగా మా 18 f మూవీ ప్రతినిధి కృష్ణ ప్రగడ ను కలిసి విరూపాక్ష సినిమా నిర్మాణం లో తన పాత్ర గురించి వివరించారు.
విరూపాక్ష ఎలాంటి సినిమా, అందులో మీ పాత్ర ఏమిటి ?

విరూపాక్ష ఫాంటసీ చిత్రం. రుద్రవనం అనే పర్వత ప్రాంతంలో జరిగిన స్టోరి ఈ సినిమా కథ. నా పాత్ర పేరు నందిని. పట్టుదల, పొగరు, యాటిట్యూడ్‌తో కూడిన పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించాను. నా పాత్రకు ఎంత పొగరు ఉంటుందంటే.. సూర్య (సాయిధరమ్ తేజ్) మా ఊరికి వస్తే.. ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకు ఏం పని అని నిలదీసే క్యారెక్టర్ నాది. అలాంటి యాటిట్యూడ్ ఉన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. మాట్లాడే విధానంలో, నడక తీరులో యాటిట్యూడ్ ఉండాలని డైరెక్టర్ కార్తీక్ స్పష్టంగా చెప్పారు.
ప్రి రెలిజ్ ఈవెంట్ లో సుకుమార్ గారూ మీ గురించి చాలా బాగా చెప్పారు ? ఎందుకో తెలుసుకోవచ్చా ?

రింగులు తిరిగిన జుట్టు, లంగా, ఓణిలో గ్రామీణ ప్రాంతపు అమ్మాయిలా కనిపిస్తాను. కానీ నేనెప్పుడు నా లుక్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. నేను కేవలం యాక్టింగ్ పార్ట్ మీదే దృష్టిపెట్టాను. సుకుమార్ గారిని నేను సినిమా షూట్‌లో కలువలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే కలిశాను. నా గురించి సుకుమార్ మంచిగా చెప్పడం చాలా ఆనందం కలిగింది. నాతో మాట్లాడుతూ.. బాగా చేశావని ప్రశంసించారు. అందుకు యూనిట్‌కు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను.
ఇది పిరియాడిక్ సినిమా కదా ? ఇందులొని నందిని పాత్ర కోసం మీరు తీసుకొన్న జాగ్రత్తలు ఏమిటి ?

నేను గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగాను. నందిని క్యారెక్టర్ కూడా గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయే. కాబట్టి ఈ పాత్రకు నేను పెద్దగా కష్టపడలేదు. ఈ పాత్ర కోసం నేను ఏపీలోని చాలా ప్రాంతాలు తిరిగి.. పాత్ర గురించి స్టడీ చేశాను. ఈ సినిమాపై మంచి కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను. ఫెర్ఫార్మెన్స్ పరంగా ఇంకా బెటర్ అవ్వాలని కోరుకొంటాను. ఈ సినిమా చూసిన కెమెరామెన్ నాకు కాల్ చేసి.. అద్బుతంగా చేశావని చెబితే.. నేను చాలా ఎమోషనల్ అయ్యాను. రిలీజ్‌కు ముందు అలాంటి కాల్ రావడం చాలా హ్యాపీగా ఉంది.
విరూపాక్ష సినిమా సెట్స్ లో ఏమైనా రిస్కీ ఘటనలు జరిగాయా ?

– మిస్టికల్ థ్రిల్లర్‌గా రూపొందిన విరూపాక్ష సినిమా షూటింగ్ చాలా అడ్వెంచరస్‌గా సాగింది. రకరకాల యాక్సిడెంట్స్ అయ్యాయి. ఈ సినిమా కోసం చాలా రిస్క్ తీసుకొన్నాం. చాలా కష్టతరమైన జర్నీ. ఓసారి ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇందంతా ఆలోచించుకొంటే.. ఒక వర్త్ఫుల్ సినిమా చేసాము అనిపిస్తుంది. దర్శకుడు కార్తీక్ బాగా డీల్ చేశాడు. చాలా జంతువులతో షూట్ చేశాం. సినిమా షూటింగ్ అంతా కష్టతరంగా సాగింది.
విరూపాక్ష సినిమా అవకాశం మీకు ఎలా వచ్చింది ?

తెలుగులో నేను ఒప్పుకొన్న సినిమా బింబిసార. తొలి సినిమా ఒప్పుుకొన్న రెండువారాల తర్వాత విరూపాక్ష సినిమా ఆఫర్‌ను ఒప్పుకొన్నాను. ఈ సినిమా ప్రారంభానికి ముందు చాలా వర్క్‌షాప్ చేశాం. షూటింగ్‌కు ముందు చాలా డైలాగ్ పేపర్లు ఇచ్చారు. అప్పుడు నాకు తెలుగు గురించి అసలే తెలియదు. అప్పుడు నేను తెలుగు నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాను. ట్యూటర్‌ను పెట్టించుకొని తెలుగు పాఠాలు నేర్చుకొన్నాను.
ఇంకా విరూపాక్ష సినిమా లో మీ పాత్ర విశేషాలు చెప్పమంటే ?

– 90వ దశకంలో సాగే పిరియాడిక్ సినిమా విరూపాక్ష. ఈ సినిమాలో నందిని పాత్ర ఎలా ఉంటుందో అర్ధం చేసుకొన్నాను. అంతేగానీ నేను ప్రత్యేకంగా ఎలాంటి కేర్ తీసుకోలేదు. ఈ సినిమాలో ప్రతీ క్యారెక్టర్ లింక్ అయి ఉంటుంది. సుమ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో జంతువులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. తెర మీద మీకు మంచి అనుభూతి కలిగిస్తుంది.
మీ కొ స్టార్ తేజు తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ?

సాయిధరమ్ తేజ్‌తో వర్క్ చేయడం డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. అతడిని యాక్సిడెంట్‌కు ముందు చూశాను. యాక్సిడెంట్ తర్వాత కూడా చూశాను. అతడు కష్టపడే విధానం నాకు బాగా నచ్చుతుంది. ఆయన కెరీర్‌లో చాలా ముందుకు వెళ్లాలి. జీవితంలో అలాంటి ప్రమాదం తర్వాత కూడా సాయిధరమ్ తేజ్ తిరిగి వచ్చి షూటింగులో పాల్గొన్న తీరు ఇన్సిపిరేషన్‌గా ఉంటుంది. సాయిధరమ్ ఫ్రెండ్లీగా ఉంటారు. సెట్లో అందరితో బాగా మాట్లాడుతారు. నాకు నా జీవితంలో గురువు లేరు. నేను పుస్తకాలు చదివి నేను అన్నీ నేర్చుకొంటాను
అల్ ద బెస్ట్ సంయుక్త గారూ..
#కృష్ణ ప్రగడ.