Samudrudu Trailer Launch highlights : గ్రాండ్ గా “సముద్రుడు”మూవీ ట్రైలర్ విడుదల !

IMG 20240328 WA0119 e1711622593584

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సముద్రుడు”. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది..

ఈ నేపథ్యంలో నేడు ఫిల్మ్ ఛాంబర్ లో చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో తలకోన ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, డైరెక్టర్స్ సముద్ర, ప్రముఖ నిర్మాతలు రామ సత్యన్నారాయణ, ముత్యాల రాందాస్, పీపుల్ మీడియా ఎగిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాసుల శ్రీధర్, చిత్ర కో ప్రొడ్యూసర్స్ జ్ఞానేశ్వర్, సొములు, చిత్ర నిర్మాత కీర్తన తదితరులు పాల్గొన్నారు.

IMG 20240328 WA0120

 ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ “మత్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది సముద్రమే వారి జీవనాధారం.. అలాంటి సముద్రంలోకి వారు వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించే పరిస్థితుల్లో వారి జీవన పోరాటం, వారి మనో వేదనే ఈ చిత్రం అన్నారు..మా చిత్రంలో పెద్ద ఆర్టిస్టులు అందరూ నటించారు. ఈ రోజు మా చిత్ర ట్రైలర్ ను, పాటలను పాత్రికేయుల సమక్షంలో ప్రదర్శించడం ఆనందంగా ఉందని, త్వరలోనే సినిమా రిలీజ్ కూడా చేస్తామన్నారు..

IMG 20240328 WA0117

      హీరో రమాకాంత్ మాట్లాడుతూ “మా సముద్రుడు చిత్ర ట్రైలర్ మరియు పాటలను మీడియా మిత్రులకు చూపించడం చాలా సంతోషం గా వుంది. ఈ చిత్ర నిర్మాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మొక్కవోని విశ్వాసం తో చిత్రాన్ని అనుకున్న విధంగా పూర్తి చేశామన్నారు..

IMG 20240328 WA0118

ఈ సందర్భంగా రమాకాంత్ చాలా ఎమోషనల్ అయ్యారు..తప్పక విజయాన్ని అందుకుంటామని నమ్మకం వ్యక్తం చేశారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరక్టర్ వీర శంకర్, సముద్ర, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ముత్యాల రామదాసు, షేకింగ్ శేషు వంటి వారు విచ్చేసి టీమ్ మొత్తానికి వారి శుభాకాంక్షలు అందజేశారు..

నటి నటులు:

రమాకాంత్, అవంతిక, భానుశ్రీ, సుమన్, శ్రవణ్, రామరాజు, రాజ్ ప్రేమి, సమ్మెట గాంధీ, ప్రభావతి, జబర్దస్త్ శేష్, చిత్రం శ్రీను తదతరులు నటిస్తున్న ఈ చిత్రానికి..

సాంకేతిక నిపుణులు:

సంగీతం: సుభాష్ ఆనంద్, ఎడిటర్: నందమూరి హరి, కొరియో గ్రఫి: అనీష్, శ్యామ్, పి ఆర్ ఓ: బి. వీరబాబు,ప్రొడ్యూసర్స్: బదావత్ కిషన్, కో ప్రొడ్యూసర్స్:శ్రీ రామోజు జ్ఞానేశ్వరరావు, సోములు, కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం: నగేష్ నారదాసి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *