Samudrakhani Dhanraj New Movie Opening: తండ్రీ కొడుకుల గా సముద్రఖని & ధనరాజ్ ల చిత్రం ప్రారంభం ! 

IMG 20231022 WA0091 e1697970018206

 

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

 

ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి. క్లాప్ శివబాలాజీ, కెమెరా సోలో బతుకె సో బెటర్ డైరెక్టర్ డైరెక్టర్ సుబ్బు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ బలగం వేణు చేశారు. అలాగే అమిగోస్ డైరెక్టర్ రాజేంద్ర తెలుగు స్క్రిప్ట్ అందజేయాగ, డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ కమ్మ తమిళ్ స్క్రిప్ట్ ను యూనిట్ సభ్యులకు అందజేశారు.

IMG 20231022 WA0092

ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, మధునందన్ , భూపాల్, పృద్వి, రాకెట్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

తండ్రి కొడుకులుగా సముద్రఖని , ధనరాజ్ నటిస్తున్న ఈ సినిమాలో మోక్ష , హరీష్ ఉత్తమన్, పృద్వి, అజయ్ ఘోష్, లావణ్య రెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ తదితరులు నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 9నుండి ప్రారంభం కానుంది. విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల ఈ సినిమాకు కథ మాటలు సమకూరుస్తూన్నారు.

IMG 20231022 WA0094

ఎవరూ టచ్ చెయ్యని ఒక తండ్రి కొడుకుల ఎమోషన్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. శశి చిత్ర సంగీత దర్శకుడు అరుణ్ చిలువేరు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *