Sampoo’s Sodhara Movie First Look Launched: సంపూర్ణేష్ బాబు, సంజోష్ ల ‘సోదరా’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల !

sodara movie first look launch e1699257004620

సంపూర్ణేష్ బాబు, సంజోష్ ముఖ్యపాత్రలో సోదరా మూవీని నిర్మిస్తున్నారు. అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే సోదరా. తెలుగు చిత్రసీమలో ఎందరో సోదరులు ఉన్నారు అలాంటి సోదరులందరినీ బంధాన్ని అద్దం పట్టేలా చూపించడానికి ఈ సోదరా వస్తుంది అంటున్నారు. ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వస్తుండగా ఈ రోజు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

మార్టిన్ లూథర్ కింగ్ సంపూర్ణేష్ బాబు మరియు సంజోష్ ఇద్దరు పెళ్లి కొడుకు గెటప్ లో ఒకరు తాళి ఒకరు రోజా పువ్వు పట్టుకొని ఉండగా వెనక మేళతాళాలతో ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ ని చూస్తుంటే ఈ సినిమా అత్యంత హాస్య భరితంగా ఉండేలా దర్శకుడు మన్మోహన్ మేనంపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

sodara movie first look launch 1

ఈ సోదరా సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్య ప్ మంచి వీనుల విందైన మ్యూజిక్ ఇచ్చారు, త్వరలోనే  ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రొడ్యూసర్: చంద్ర చగంలా  చెప్తూ,  సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు అతి త్వరలోనే తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు అన్నారు.

నటీనటులు:

సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా, బాబా భాస్కర్, బాబు మోహన్, గెటప్ శీను,

సాంకేతిక నిపుణులు: 

కథ మరియు దర్శకత్వం: మన్ మోహన్ మేనంపల్లి, సంగీతం: సునీల్ కశ్య ప్, డిఓపి: జాన్, ఎడిటర్: శివశర్వాణి, లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ మరియు పూర్ణ చారి, ప్రొడ్యూసర్: చంద్ర చగంలా, నిర్మాణ సంస్థ: క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్ మరియు మాంక్ ఫిలిమ్స్, పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *