Sampoo New Movie Postar Launch: సంపూర్ణేష్ బాబు, సంజోష్ ల ‘సోదరా’ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ !

IMG 20231024 WA0050 e1698153216721

 

సంపూర్ణేష్ బాబు, సంజోష్ ముఖ్యపాత్రలో సోదరా మూవీని నిర్మిస్తున్నారు. అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే సోదరా.

తెలుగు చిత్రసీమలో ఎందరో సోదరులు ఉన్నారు అలాంటి సోదరులందరినీ బంధాన్ని అద్దం పట్టేలా చూపించడానికి ఈ సోదరా వస్తోంది. సోదరా మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వస్తుండగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అక్టోబర్ 29న రిలీజ్ అవుతుంది.

IMG 20231024 WA0060

నిర్మాత చంద్ర చగంలా మాట్లాడుతూ ఈ సోదరా సినిమా సోదరులందరికీ బంధాన్ని చూపించే విధంగా నిర్మించామన్నారు. గతంలో తెలుగులో అన్నయ్య, సీతారామరాజు, తమ్ముడు వంటి ఎన్నో సినిమాలు అన్నదమ్ముల బంధాన్ని ఆ బంధంలోని విశిష్టతను తెలియజేసేలా వచ్చాయి ఆ కోవలోకే మా సోదరా సినిమా కూడా వస్తుంది అని అన్నారు.

IMG 20231024 WA0061

 

 

నటీనటులు:

సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా, బాబా భాస్కర్, బాబు మోహన్, గెటప్ శీను,

సాంకేతిక వర్గం:

కథ మరియు దర్శకత్వం: మన్ మోహన్ మేనంపల్లి, సంగీతం: సునీల్ కశ్యప్ , డిఓపి: జాన్ , ఎడిటర్: శివశర్వాణి, లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ మరియు పూర్ణ చారి, ప్రొడ్యూసర్: చంద్ర చగంలా, నిర్మాణ సంస్థ: క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్ మరియు మాంక్ ఫిలిమ్స్, పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *