తెలుగు వెండితెర పై కొత్త యువరాజు, శాకుంతలం తో అందర్నీ ఆకట్టుకుంటున్న దేవ్ మోహన్

IMG 20230111 WA0077 e1673456224799

 

మలయాళ నటుడు దేవ్ మోహన్, గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న “శాకుంతలం” ద్వారా తెలుగు లో పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రం లో శకుంతలగా సమంత నటిస్తుండగా, యువరాజు దుష్యంతుడిగా దేవ్ కనిపించనున్నారు.

ఇటీవల విడుదలైన ట్రైలర్ లో అతని ఆహార్యానికి, నటనకి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఫిదా అవుతుండగా మీడియా తో మాట్లాడుతూ “హైదరాబాద్ నాకు రెండో ఇల్లు. ఇక్కడి ప్రేక్షకుల ఆదరణ, ప్రేమ మరచిపోలేనివి” అంటూ ఇబ్బంది పడకుండా తెలుగులో మాట్లాడుతూ అందరి మనసులు గెలుచుకున్నారు.

IMG 20230111 WA0078

అద్భుతంగా నటించడమే కాక దేవ్ ఈ చిత్రంలో తన పాత్రకి డబ్బింగ్ కూడా చెప్పారు. డైలాగ్ లో ఉచ్ఛారణ లోపాలు లేకుండా చూసుకుంటూ తెలుగు భాష పై మంచి పట్టు సాధించారు.

ఏదో ఒకలా తన పాత్ర పూర్తి చేసేసి వెళ్ళిపోకుండా కథ కోసం, అందులోని భావం ప్రేక్షకులకి పూర్తిగా చేర్చడం కోసం కష్టపడి భాష మీద పట్టు సాధించడం చాలా మంచి ఆలోచన. ఇలాంటి విలక్షణ నటుడికి తెలుగు తెరపై సుధీర్ఘమైన ప్రయాణం ఉంటుందన్నది తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *