NENEVVARU MOVIE GETTING READY FOR RELEASE: విడుదల సన్నాహాల్లో సాక్షి చౌదరి హీరోయిన్ గా “నేనెవరు“

BF4CC75D 18F3 4229 87DB D681B4FAEC33

కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు నిర్మాతలుగా… నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనెవరు’. పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు.

ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సాక్షి చౌదరి హీరోయిన్ కాగా.. తనిష్క్ రాజన్, గీత్ షా సహాయ పాత్రల్లో, బాహుబలి ప్రభాకర్ విలన్ గా నటిస్తున్నారు.

రాధ గోపి తనయుడు ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

19785D5B A3CE 499D B554 1EC739AA08B5

సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “నేనెవరు” అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని దర్శకుడు నిర్ణయ్ పల్నాటి తెలిపారు.

హీరో కోలా బాలకృష్ణ, దర్శకుడు నిర్ణయ్, సంగీత దర్శకుడు ఆర్.జి.సారథిలకు చాలా మంచి పేరు తెస్తుందని నిర్మాతలు భీమినేని శివప్రసాద్ – తన్నీరు రాంబాబు పేర్కొన్నారు. బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న “నేనెవరు”ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నామని తెలిపారు.

85800F07 0FC2 418E AA60 7EAF0A39F4E1
ఈ చిత్రంలో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎడిటర్ గా కోలా భాస్కర్ చివరి చిత్రం “నేనెవరు” కావడం విశేషం.

E12F05F7 A019 4C9A 8143 AD7EC7795F80

ఈ చిత్రానికి కెమెరా: సామల భాస్కర్, ఎడిటింగ్: కోలా భాస్కర్ ఫైట్స్: రియల్ సతీష్, కొరియోగ్రఫీ: చంద్రకిరణ్.జె, పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ, పబ్లిసిటీ డిజైన్స్: వాల్స్ అండ్ ట్రెండ్స్, పోస్ట్ ప్రొడక్షన్: ప్రసాద్ లాబ్స్, ఎడిటింగ్: కోలా భాస్కర్, పాటలు: కృష్ణకాంత్, సంగీతం: ఆర్.జి.సారథి, సహనిర్మాతలు: పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి, నిర్మాతలు: భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు, దర్శకత్వం: నిర్ణయ్ పల్నాటి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *