సాయి ధన్సిక “దక్షిణ” చిత్రం  ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే !

IMG 20250225 WA0076 e1740497093240

 మర్డర్ మిస్టరీలు, క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ అంటే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫాంలు.. ఆడియన్స్ ఆసక్తికి అనుగుణంగానే థ్రిల్లింగ్ మూవీస్, సిరీస్‌లను అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా, మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ వివరాలు చూస్తే.. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కబాలి’ మూవీలో నటించిన నటి సాయి ధన్సిక ఇటీవల ఓ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

‘మంత్ర’ ఫేం ఓషో తులసీరామ్ దర్శకత్వంలో సాయి ధన్సిక లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘దక్షిణ’ గతేడాది అక్టోబర్ 4న రిలీజై మంచి టాక్ సంపాదించుకున్న ఈ మూవీ తాజాగా.. ‘లయన్స్‌గేట్ ప్లే’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

IMG 20250225 WA0078

 ఓ మహానగరంలో సైకో కిల్లర్ వరుసగా అమ్మాయిలను హత్య చేస్తుంటాడు. సంబంధిత కేసును ఏసీబీ దక్షిణ (సాయి ధన్సిక) టేకప్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లేంటి..?, ఈ క్రమంలో ఊహించని విధంగా ఆమె జీవితం మలుపు తిరుగుతుంది. దీంతో పోలీస్ జాబ్‌కు రిజైన్ చేసి మద్యానికి బానిసవుతుంది.

ఆ తర్వాత ఆమె జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలేంటి.?, ఆ కిల్లర్‌కు, దక్షిణకు ఉన్న సంబంధం ఏంటి.? సైకో కిల్లర్‌ను ఆమె పట్టుకుందా.? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం దక్షిణ చిత్రం ‘లయన్స్‌గేట్ ప్లే’ ఓటీటీలో టాప్ వన్ ప్లేస్ లో ట్రేండింగ్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *