చిత్రం: “సఃకుటుంబానాం”
మూవీ: రివ్యూ ( Movie Review)
హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై ఉదయ్ శర్మ రచన, దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా తెరకెక్కిన “సఃకుటుంబానాం” చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ చిత్రం ఒక భావోద్వేగభరితమైన ఫ్యామిలీ డ్రామాగా నిలుస్తుంది
రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటించిన ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సుభలేఖ సుధాకర్, సత్యం, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించగా, మధు దాసరి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. శశాంక్ మాలి ఎడిటర్‌గా వ్యవహరించారు.

కధ పరిశీలిస్తే (Story Line):
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కుటుంబంతో ఉన్న బలమైన అనుబంధం అతడి జీవనశైలిలో కీలకంగా ఉంటుంది. ఆఫీస్‌లో కొత్తగా చేరిన అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. వారి ప్రేమపై నమ్మకంతో ఆమెను కుటుంబానికి పరిచయం చేస్తాడు.
ఈ దశలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుని కుటుంబంలో కలకలం రేపుతాయి. దాచిన నిజాలు వెలుగులోకి రావడం, వారి మద్య బంధాలు పరీక్షకు లోనవడం, భావోద్వేగ సంఘర్షణలు కథకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ప్రేమతో పాటు కుటుంబ బాధ్యతలు ఎలా సమతుల్యం చేయాలి?
ఆరోగ్య సమస్యలు జీవిత నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?
అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే ఈ రోజు మీ దగ్గర లోని థియేటర్ కి వెళ్లి తెలుసుకోవాలి.
పాజిటివ్ పాయింట్స్ (Positive Points):
* భావోద్వేగాలకు దగ్గరైన కథ
* దర్శకుడి నిజాయితీగల కథన శైలి
* రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం అద్భుతమైన నటన
* బలమైన లీడ్ పెర్ఫార్మెన్సెస్
* సంగీతం, పాటలు, నృత్యాలు
* ప్రభావవంతమైన ఇంటర్వెల్ బ్లాక్
నెగటివ్ పాయింట్స్ :
* కొన్ని సన్నివేశాల్లో నెమ్మదిగా సాగిన కథనం.

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు ఉదయ్ శర్మ కమర్షియల్ కు దూరంగా, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ కథను నడిపించిన తీరు ప్రశంసనీయం. చిత్రీకరణ సహజంగా, హృదయానికి దగ్గరగా ఉంటుంది.

ప్రధాన కథానాయకుడిగా రామ్ కిరణ్ చేసిన నటన ప్రశంసనీయం. తొలి చిత్రమే అయినా ఎక్కడా కొత్తవాడిలా అనిపించకుండా భావోద్వేగ సన్నివేశాల్లో, డాన్స్‌లలో, డ్రమాటిక్ సీన్స్‌లో మెప్పించారు.
మేఘ ఆకాష్ తన పాత్రలోని రెండు విభిన్న కోణాలను అమాయకత్వం, తెలివితేటలను సమర్థవంతంగా ఆవిష్కరించారు.
నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచారు. తండ్రి పాత్రలో ఆయన చూపించిన ఆత్మీయతల ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన సినిమాను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది.
బ్రహ్మానందం సహజమైన, సందర్భోచితమైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తూనే కథకు భావోద్వేగ సమతుల్యతను అందించారు. ఆయన టైమింగ్ మరోసారి తన క్లాసిక్ టచ్‌ను గుర్తు చేస్తుంది.
సపోర్టింగ్ నటులు సుభలేఖ సుధాకర్, సత్య, భద్రం, రచ్చ రవి తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
మధు దాసరి సినిమాటోగ్రఫీ సినిమా విజువల్ టోన్‌ను మరింత అందంగా మలిచింది.
మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు బలం చేకూర్చగా, పాటలు, డాన్స్ మంచి ఉత్సాహాన్ని అందించాయి.
శశాంక్ మాలి ఎడిటింగ్ సవ్యంగా ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల మరింత కట్స్ అవసరమైందని అనిపిస్తుంది. మొత్తం మీద నిర్మాణ విలువలు మంచి స్థాయిలో ఉన్నాయి.