Sagileti Katha Song launch By RGV:  ‘ఆర్జీవీ’ చేతుల మీదగా ‘సగిలేటి కథ’ మూవీ ‘ఏదో జరిగే’ సాంగ్ గ్రాండ్ లాంచ్ ! 

sagileti kadha movie song launch by RGV 1 e1692373636298

హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘రాజశేఖర్ సుద్మూన్’ రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మించారు. ఇప్పటికే, విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు అనుహ్య స్పందన లభించింది. డ్యాషింగ్ డైరెక్టర్ ఆర్జీవీ డెన్ ఆఫీస్ లో, ఈ చిత్రం ఫస్ట్ లిరికల్ ‘ఏదో జరిగే’ వీడియో సాంగ్ ని ఎంతో గ్రాండ్ గా ఆర్జీవీ చేతుల మీదుగా సరిగమ తెలుగు లో ఈ రోజు విడుదలైంది…

sagileti kadha movie song launch by RGV

డైరెక్టర్ ఆర్జీవీ మాట్లాడుతూ: సగిలేటి కథ సినిమా ట్రైలర్ చూసాక నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఈ సినిమా ఇంత ఘన విజయంగా కంప్లీట్ చేసి ముందుకి తీసుకెళ్తున్న డైరెక్టర్ ‘రాజశేఖర్ సుద్మూన్’కి, బ్యూటిఫుల్ గా పాడి అందరిని కవ్వించిన కీర్తన శేష్ కి నా ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది….టీం అందరికి నా ఆల్ ది బెస్ట్

sagileti kadha movie song launch by RGV 3

ప్రొడ్యూసర్ దేవీప్రసాద్ బలివాడ మాట్లాడుతూ: నేను పుట్టిన సంవత్సరంలో, ఆర్జీవీ సినిమాల్లోకి రావడం. నా రెండు సంవత్సరాలప్పుడు ‘శివ’ మూవీ కి ఆర్జీవీ డైరెక్ట్ చెయ్యడం, నాకు ఊహ తెలియని వయసులో ‘శివ’ మూవీ చూసి ‘శివ’ అనే డైలాగ్ చెప్పడం. అప్పటి నుంచి మా పేరెంట్స్ నన్ను ముద్దుగా ‘శివ’ అని పిలిచేవారు. ఈ విషయం చెప్పి ప్రతిసారి మా పేరెంట్స్ గుర్తు చేస్తుంటారు.

నాకు తెలియకుండానే ఆర్జీవీ గారు నా చిన్నప్పటి నుంచి ఇన్ఫ్లూయెన్స్ చేశారు. అదే విధంగా నేను సినిమాల్లోకి రావడానికి ఒక బీజం నాటారు… నేను ప్రొడ్యూజ్ చేసిన మొదటి సినిమా ‘కనుబడుటలేదు’ మూవీ నుండి ‘సగిలేటి కథ’ వరుకు ప్రత్యేక్షంగా అండ్ పరోక్షంగా మా మూవీస్ కి ఆర్జీవీ గారు హెల్ప్ చేస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యు….

sagileti kadha movie song launch by RGV 9

డైరెక్టర్ రాజశేఖర్ సుద్మూన్ మాట్లాడుతూ: ఈ సినిమా కి పని చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మా సినిమా సాంగ్ ని ఆర్జీవీ గారు చేతుల మీదగా చేయడం వళ్ళ మాకు ఎంతో ఎనర్జీ వచ్చింది. నేను ఆయనికి ఎంతో రుణపడి ఉంటాను. అలాగే, మా సినిమా నీ ప్రెసెంట్ చేస్తున్న హీరో నవదీప్ ఎంత చెప్పినా తక్కువే, ఎంత బిజీగా గా వున్న ఇమ్మిడియట్ గా రెస్పాండ్ అయ్యి మాకు కావలిసిన థింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు..థ్యాంక్ యు నవదీప్ అన్నా…

ప్రొడ్యూసర్ అశోక్ మాట్లాడుతూ:
థ్యాంక్ యు ఆర్జీవీ గారు…మా సాంగ్ ని లాంఛ్ చేసినందుకు…ఈ సాంగ్ ఔట్ పుట్ బాగొచ్చింది. ఒక మంచి మెలోడీ సాంగ్ అవ్వుతుందని, ఎంతో నమ్మకంతో అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. జశ్వంత్ పసుపులేటి, కీర్తన శేష్, పవన్ కుందాని వర్క్ అదరకొట్టేసారు…

sagileti kadha movie song launch by RGV 8

సి స్పెస్ కో-ఫౌండర్ పవన్ మాట్లాడుతూ: నేను ఈ మూవీ చూసినప్పుడు సినిమా బాగుండటంతో పాటు, టీం అందరు కసి తో కనిపించారు. సో, టాలెంట్ ఉంటే తప్పకుండా సి స్పెస్ టీం ముందుండి ప్రోత్సహిస్తుంది.

హీరో ‘రవి మహాదాస్యం’ మాట్లాడుతూ: సగిలేటి కథ ఒక బ్యూటిఫుల్ అండ్ మ్యూజికల్ మూవీ. ఈ సినిమాలో ప్రతి సాంగ్ బాగుంటుంది. ముఖ్యంగా, ఏదో జరిగే పాట హాయిగా పాడుతూ నిద్రలోకి జారుకోవచ్చు. కాంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. చాలా తక్కువ సమయంలోనే మా మూవీ ట్రైలర్ మిళియన్స్ వ్యూస్ రీచ్ అయ్యాయి, అదే విధంగా ఈ సాంగ్ రీచ్ అవ్వుతుందని నమ్మకంతో ఉన్నాం… థ్యాంక్ యు సో మచ్…

sagileti kadha movie song launch by RGV 5

హీరోయిన్ ‘విషికా లక్ష్మణ్’ మాట్లాడుతూ: ఆర్జీవీ గారికి థ్యాంక్ యు…షూటింగ్ లో సాంగ్ వింటున్నప్పుడు, నేను ఒక ట్రాన్స్ లోకి వెళ్లేదాన్ని. అంతే కాకుండా, సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు రొమాంటిక్ గా చాలా ఎంజాయ్ చేస్తూ యాక్టింగ్ చేసాను…

sagileti kadha movie song launch by RGV 2

నటీనటులు:

రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్, నరసింహా ప్రసాద్ పంతగాని
రచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: రాజశేఖర్ సుడ్మూన్
కో-రైటర్: శశికాంత్ బిల్లపాటి, మని ప్రసాద్ అరకుల
నిర్మాతలు: అశోక్ మిట్టపల్లి, దేవీప్రసాద్ బలివాడ
ఇన్ అసోసియేషన్ విత్: సి స్పెస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరేష్ మాదినేని
అసోసియేట్ ప్రొడ్యూసర్: పుష్పాభాస్కర్, సునీల్ కుమార్ ఆనందన్, లీలా కృష్ణ కొండేపాటి
లైన్ ప్రొడ్యూసర్: చందు కొత్తగుండ్ల
సంగీతం: జశ్వంత్ పసుపులేటి
నేపథ్యసంగీతం: సనల్ వాసుదేవ్
సింగర్స్: కీర్తన శేష్, కనకవ్వ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి, పవన్ కుందాని, రాజశేఖర్ సుడ్మూన్, శశికాంత్ బిల్లపాటి, జశ్వంత్ పసుపులేటి
పి.ఆర్.ఓ: తిరుమలశెట్టి వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్స్: హేమంత్ జి, ఐశ్వర్య కులకర్ణి
కాస్ట్యూమ్ డిజైనర్: హర్షాంజలి శేనికేషి
సౌండ్ డిజైనర్: యతి రాజు
సౌండ్ మిక్సింగ్: శ్యామల సిక్దర్
డి.ఐ: కొందూరు దీపక్ రాజు
పబ్లిసిటీ డిజైనర్: యమ్.కే.యస్ మనోజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *