sagileti kadha firstlook release: సగిలేటి కథ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

సగిలేటి సినిమా

 

సగిలేటి సినిమా

అశోక్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై రవితేజ మహాదాస్యం, విషిక హీరో హీరోయిన్ గా కేన్స్ లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ఫిలిం ఫెస్టివల్ లో తన ప్రతిభను చాటుకూన రాజశేఖర్ సుడ్మూన్ దర్శకత్వంలో అశోక్ మిట్టపల్లి నిర్మిస్తున్న చిత్రం “సగిలేటి కథ”.

ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో చిత్రీకరించబడిన “ఒక అందమైన మట్టి కథ అక్కడి మనుషుల కథ” . ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను యూనిట్ సభ్యులు సోషల్ మీడియా లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ “తెలుగు చిత్రసీమలో ఇప్పటివరకు ఇటువంటి నేటివిటీని ఎప్పుడు చూసి ఉండరు. ఈ చిత్రంలోని  భావోద్వేగాలు మిమ్మల్ని కదిలిస్తాయి,

ఇంకా చెప్పాలి అంటే ఇందులో పాత్రలతో మీరు మాట్లాడబోతున్నారు అనడంలో అతిశయోక్తి  ఏమాత్రం లేదు. ఇందులో కనిపించే ప్రతి పాత్ర మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి పాత్ర ఒక కల్ట్ పాత్ర. ఒక అద్భుతమైన రాయలసీమ కథను త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నాము” అని తెలిపారు.

బ్యానర్ : అశోక్ ఆర్ట్స్
చిత్రం పేరు : సగిలేటి కథ

నటి నటులు : రవితేజ మహాదాస్యం, విషిక కోట, నరసింహ ప్రసాద్ పంటగాని, రాజశేఖర్ ఆంగిని

సంగీత దర్శకుడు : జస్వంత్ పసుపులేటి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సనల్ వాసుదేవ్
లిరిక్స్ : వారికుప్పల్లా యాదగిరి, రాజశేఖర్ సుడ్మూన్, శేషికాంత్ బిలపతి
ఆర్ట్ డైరెక్టర్ : హేమంత్ జి , ఐశ్వర్య కులకర్ణి
సౌండ్ డిజైన్ : జె ఆర్ ఎతిరాజ్
సౌండ్ మిక్సింగ్ : శ్యామల్ సికిందర్
పబ్లిసిటీ డిజైన్ : మాయాబజార్
పి ఆర్ ఓ : పాల్ పవన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *