Sabari Movie Review & Rating: వరలక్ష్మి శరత్ కుమార్ శబరి గా మెప్పించిందా లేదా ?

sabari review by 18 fms 11 e1714790937671

చిత్రం: శబరి,

విడుదల తేదీ : మే 03, 2024,

నటీనటులు: వరలక్ష్మి శరత్ కుమార్, గణేష్ వెంకటరామన్, శశాంక్, మైమ్ గోపి, బేబీ వివేక్ష తదితరులు..,

దర్శకుడు: అనిల్ కాట్జ్,

నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల,

సంగీత దర్శకుడు: గోపి సుందర్,

సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ,

ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల,

మూవీ:  రివ్యూ  ( Movie Review) 

తెలుగు లో బాగా పాపులర్ అయిన టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన ఈ శబరి (Sabari) మూవీ, తెలుగు లో తన మొదటి ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రం కాబట్టి తెలుగు ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మరి ఈ శబరి చిత్రంతో వరలక్ష్మి శరత్ కుమార్ ఎలాంటి ఫలితాన్ని అందుకున్నారో మా 18F మూవీస్  సమీక్ష చదివి తెలుసుకొందామా !.

Sabari Movie Producer Special Interview7 1

కధ పరిశీలిస్తే (Story Line): 

శబరి కథ లోకి వెళ్తే..  సంజన (వరలక్ష్మి శరత్ కుమార్) అలాగే అరవింద్ (గణేష్ వెంకటరామన్) లు తమ కాలేజీ టైం లోనే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. భర్త ఉద్యోగం వలన వారు విజగ నుండి ముంబై కి షర్ట్ అవుతారు.  వారికి రియా(బేబీ వివేక్ష) అనే కూతురు కూడా ఉంటుంది. కానీ ఓరోజు తన భర్త చేసిన చీప్ పని వల్ల ఆమె అతని నుంచి తన కూతురితో కలిసి తిరిగి వైజాగ్ కు వచ్చేస్తుంది.

సిటీ లో తన స్కూల్ ఫ్రెండ్ సహాయం తో ఎన్నో జాబ్ ట్రాయిల్స్ చేసి మరో స్కూల్ ఫ్రెండ్ సహాయం తో చిన్న జాబ్ సంపాదించి సిటీ కి దూరంగా ప్రశాంత జీవితం గడపాలనుకొంటుంది.  అయితే సంజనకు చిన్న తనం లో జరిగిన కొన్ని సంఘటనల వలన మెంటల్ గా చాలా డిస్టర్బ్ అవుతుంది. గతం లో తన తల్లితో తనకు ఉన్న అనుబంధం తనకి తన కూతురుతో ఉన్న బంధం తో పోల్చుకోవడం వంటి విశయాలు ఆమెను బాగా డిస్టర్బ్ చేస్తాయి.

సంజన కథలోకి సూర్య(మైమ్ గోపి) ఎందుకు ఎంటర్ అవుతాడు?

సూర్య రియా కోసం ఎందుకు వెతుకుతూ ఉంటాడు?

సూర్య, సంజన, రియా మద్య ఉన్న కనెక్షన్ ఏంటి?

సంజన గతం ఎలాంటిది ? ఎందుకు మెంటల్ గా డిస్టర్బ్ అవుతుంది ? ,

సూర్య నుండి రియాని సంజన కాపాడుకుంటుందా లేదా? 

అనే ప్రశ్నలకు జవాబులు తెలియాలి అంటే ఈ సినిమాని వెంటనే దియేటర్ లో చూసి తెలుసుకోవాలి.

sabari review by 18 fms 8

కధనం పరిశీలిస్తే (Screen – Play):

శబరి సినిమా మొదలైన సీన్ నుంచే నెమ్మదిగా సాగే బోరింగ్ కథనంతో సాగదీతగా అనిపిస్తుంది. అంతే కాకుండా ప్రీ ఇంటర్వెల్ వరకు మినిమమ్ ఆసక్తి కూడా కలగదు. ఇంకా కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అందులోని ఎమోషన్స్ కూడా ఏమాత్రం వర్కౌట్ అవ్వవు. ఇక వీటితో ఆ రెండవ అంకం (సెకండాఫ్) మరింత నిరుత్సాహ పరుస్తుంది.

ఊహాజనితంగా సాగే కథనం (స్క్రీన్ – ప్లే), నాసిరకం డైలాగులు సినిమాని మరింత పేలవంగా మార్చివేస్తాయి. ఇక వీటితో పాటుగా చాలా సీన్స్ లో లాజిక్స్ మిస్ అయ్యాయి. అసలు సినిమాలో చాలా సీన్స్ లో కధ విశాఖ సిటీ లో జరుగుతుంది అని చెప్పి హైదరాబాద్ మాల్స్, కొడాయికేనాల్ ఫారెస్ట్  ఏరియాలు చూపించడం అనేది పెద్ద బ్లండర్ గా చెప్పాలి.

సిటీ లో ఏదో చిన్న జాబ్ చేసుకొంటున్న సింగల్ మదర్ సిటీ కి దూరంగా పెద్ద బంగ్లా అద్దెకి తీసుకోవడం ఎంటో అర్దం కాదు. ఇంకా ఓ సీన్ అయితే వరలక్ష్మి శరత్ కుమార్ పై వర్షం పడుతున్నా కూడా తడవకుండా కనిపించడం గమనార్హం.

ఇక వీటితో పాటుగా మరికొన్ని సీన్స్ ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తాయి ఇంకా కొన్ని రిపీటెడ్ గా అనిపిస్తాయి. దీనితో సినిమాపై ఆసక్తి ఉండగా ఉండగా మరింత సన్నగిల్లుతుంది.

sabari review by 18 fms 6 e1714790418458

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

దర్శకుడు అనీల్ కాట్జ్  కొంతమేర థ్రిల్ చేసే కధ ను వ్రాసుకొన్నా, దాన్ని పూర్తి స్థాయిలో మెప్పించే విధంగా స్క్రీన్ మీద ఆవిష్కరించలేకపోయారు. చాలా బోరింగ్ అండ్ విసుగు తెప్పించే నరేషన్ తో కథనాన్ని (స్క్రీన్ – ప్లే) తాను నడిపించారు. ఒక్క ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ తప్ప అసలు సినిమాలో చెప్పుకోడానికి సరైన సన్నివేశం కానీ ఎమోషన్స్ కానీ కనిపించవు.

తల్లిగా వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి ఆమెలోని వెర్సటాలిటీ నటనతో మెప్పించారు. పలు ఎమోషనల్ సీన్స్ కానీ యాక్షన్ తరహా సీన్స్ లో కానీ సెటెల్డ్ పెర్ఫామెన్స్ ని కనబరిచారు. ఇక ఆమెతో పాటుగా తన కూతురుగా నటించిన బేబీ వివేక్ష కూడా బాగా నటించింది.

విలన్ పాత్రలో మైమ్ గోపి అద్భుతంగా నటించాడు. ఆయన కనిపిస్తే ఆడియెన్స్ భయపడేలా ఉంది పెర్ఫార్మెన్స్.

ఇంకా శశాంక్, గణేష్ వెంకటరామన్, సునయిన తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు.

sabari review by 18 fms

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

గోపి సుందర్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఓకే కానీ సెకండాఫ్ లో అయితే కొట్టిందే కొట్టి బోర్ తెప్పిస్తాడు. అలాగే  కొన్ని సీన్స్ లో మాత్రం గోపి సుందర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎఫెక్టివ్ గా ఉంది.

రాహుల్ శ్రీవాత్సవ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఉన్న బడ్జెట్ లో విసువల్స్ బాగానే క్యప్చర్ చేయగలిగాడు,

ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ పర్వాలేదు. డైలాగ్స్ మాత్రం చాలా యావరేజ్ గా ఉన్నాయి.

నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల పాటించిన నిర్మాణ విలువలు పరవాలేదు అనెల ఉన్నాయి. వీక్ స్క్రీన్ ప్లే వలన స్లో నరేశం తో ఉంది.

sabari review by 18 fms 3

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

ఈ “శబరి” చిత్రంలో నటీనటులు వారికి ఇచ్చిన పాత్రల మేరకు ఓకే అనిపించినా ఎందుకో మదర్ సెంటిమెంట్ వర్క్ అవుట్ కాలేదు. సినిమా స్టార్ట్ నుండి మంచి సైకాలాజికల్ థ్రిల్లర్ లా నడిపినా  ఇంటర్వెల్ బ్లాక్ వరకు పర్వాలేదు ప్రేక్షకులకు ఏదో ఉంది అనిపిస్తుంది.

దర్శకుడు రాసుకొన్న పూర్ స్క్రీన్ ప్లే వలన రెండవ అంకం (సెకండాఫ్)బోర్ కొడుతూ సాగినట్టు అనిపించింది. పైగా వర్కౌట్ అవ్వని ఎమోషన్స్, సాగదీతగా ఊహాజనితంగా సాగే స్క్రీన్ ప్లే లు బాగా నిరుత్సాహ పరుస్తాయి.

వరలక్ష్మి శరత్ కుమార్ ఎంత బాగా నటించినా పేలవమైన సీన్స్ తో, ఎందుకు పాత్రలు అలా ప్రవర్తిస్తున్నాయో తెలియని అయోమయం లో ప్లే ఉండటం వలన ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

చివరి మాట: ఆకట్టుకోని శబరి  !

18F RATING: 2.5  / 5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *