Rules Ranjan Movie Review & Rating: లవ్ లో రూల్స్ లేవని కామిక్ గా చెప్పే ఫ్యామిలీ ఎంటర్టైనర్

rules ranjan review by 18F Movies e1696611944348

మూవీ: రూల్స్ రంజన్ (Rules Ranjan)

విడుదల తేదీ : అక్టోబరు 06, 2023

నటీనటులు: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్,వెన్నెల కిశోర్, సుబ్బరాజు, అజయ్, మకరంద్ దేశ్‌పాండే ,గోపరాజు రమణ తదితరులు.

దర్శకుడు : రథినం కృష్ణ

నిర్మాతలు: దివ్యాంగ్‌ లవానియా, మురళి కృష్ణ వేమూరి

సంగీతం: అమ్రిష్ గణేష్

సినిమాటోగ్రఫీ: దులీప్ కుమార్ ఎం.ఎస్

ఎడిటర్: ప్రసాద్ జి

rules ranjan review 4

మూవీ రివ్యూ: రూల్స్ రంజన్ రివ్యూ 

యంగ్ హీరో  కిరణ్ అబ్బవరం, గ్లామర్ డాళ్ నేహా శెట్టి హీరో  హీరోయిన్ గా దర్శకుడు రథినం కృష్ణ (ఎ యం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ) తెరకెక్కించిన చిత్రం “రూల్స్ రంజన్”. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ రూల్స్ రంజన్ సిన్మా తెలుగు ప్రేకశకులను ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందా మా !

కథ ని పరిశీలిస్తే (Story line):

rules ranjan review

మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) తిరుపతి నుండి ముంబై వెళ్ళి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో సిన్సియర్ గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. మనూ కి అక్కడి హిందీ భాష రాక తోటి ఎంప్లాయూస్ ఇబ్బందులను బారిస్తూ ఉంటాడు. ఎలాగైనా అక్కడి భాష మీద పట్టు సంపాదించి ఆఫీసు లొని ఎంప్లాయూస్ అందరితో తను సిన్సియర్ అని తెలియచేయడం కోసం అలెక్సా ని నమ్ముకొని మార్నింగ్ ఆఫీసు లో అందరు మాట్లాడే మాటలు రికార్డు చేసి ఇంటికి వచ్చి మాతృ భాషలో ఇంటూ హిందీ మీద తన వర్క్ మీద పట్టు సంపడినస్తాడు.

అందరి వీక్ నెస్ లను తనకు అనుకూలంగా మార్చుకొని  అందరినీ రూల్స్ ప్రకారం పనిచేయమని ఆదేశిస్తాడు. ఇలా స్ట్రిక్ట్ రూల్స్  ఫాలో అవుతున్నాడు అని  ఆ కంపెనీలో అందరూ అతన్ని రూల్స్ రంజన్ అని పిలుస్తూ ఉంటారు.ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సనా (నేహా శెట్టి) ఒంటరిగా ముంబై లో ఉన్న రంజన్ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది. గతంలో తిరుపతి కాలేజీ రోజుల్లో రంజన్  సన ను ప్రేమిస్తాడు కానీ తనకు చెప్పలేకపోతాడు.

ఇప్పుడు మరలా నాలుగేళ్ల తర్వాత సడెన్ గా సన  కనిపించే సరికి రంజన్ మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. తనకు ముంబై లో సహాయ పడుతూ ఇస్తాపడతాడు.

మరి సనా, రంజన్ ను తిరిగి ప్రేమిస్తోందా ?,

కాలేజీ లో సనకు రంజన్ ప్రేమ తెలుసా లేదా ? 

సన ముంబై ఎందుకు వచ్చింది ? 

మనో రంజన్ ఇంత స్ట్రిక్ట్ గా ఉండటానికి కారణం ఏమిటి ?

సన మనో రంజన్  ప్రేమ సక్సెస్ అవుతుందా? లేదా ? అనేది మిగిలిన కథ. 

కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):

rules ranjan review 3

దర్శకుడు రథినం కృష్ణ తీసుకున్న పాయింట్ కథ గా చిన్న పాయింట్ అయినా తన కధనం (స్క్రీన్ – ప్లే ) తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మలచిన తీరు బాగుంది. సినిమాలో వచ్చే ఫ్లాష్ బాక్ ఎపిసోడ్ లో  హీరో హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు మరింత డెప్త్ గా చూపిస్తే బాగుండేది అనిపిస్తుంది. అలాగే మొదటి అంకం ( ఫస్ట్ హాఫ్) లో ముంబై నేపథ్యంలో జరిగే సన్నివేశాలు కొంచెం బోర్ అనిపిస్తాయి. వెన్నెల కిశోర్ ట్రాక్ కొంచెం కృత్రిమంగా అనిపిస్తుంది. అడల్ట్ కామిడీ గా ఉండి ఫ్యామిలీ తో కలిసి చూసే వారికి కొంచం ఇబ్బంది గా ఉంటుంది.

కథనంలో ఇలాంటి సీన్స్ కొన్ని మార్చి రాశి ఉంటే ఇంకా చక్కటి ఎంటర్టైనర్ అయ్యి వుండేది.  కాలేజీ లైఫ్ లో జరిగిన లవ్ డ్రామా కూడా కొన్ని చోట్ల సిల్లీగా అనిపిస్తుంది. సినిమాలో ఇంట్రెస్టింగ్  పాయింట్ ని కరెక్ట్ గా ప్రెసెంట్ చేయలేకపోయారు.

కొన్ని చోట్ల హీరో ట్రాక్ కూడా బలహీనంగా సాగుతోంది. ఇక రెండవ అంకం (సెకండ్ ఆఫ్ ) లో హైపర్ అది, హర్ష మరియు సుధర్శన ట్రాక్ హిల్లరియాస్ గా సాగింది. చివరి 30 మినిట్స్ సీన్స్ అయితే అద్భుతంగా ప్రిడక్ట్ చేయలేని విధంగా సాగిపోతుంది. దియేటర్ అంతా నవ్వులే  నవ్వులు.

మొత్తమ్మీద స్టోరీగా తీసుకున్న  పాయింట్ చిన్నదే అయినప్పటికీ  కథనం తో ఎక్కువ పాత్రలతో  సీన్స్ బాగానే వచ్చియి.  అలానే ఎటువంటి ట్విస్టులు, థ్రిల్లింగ్ అంశాలు వంటివి ఆశించకుండా పూర్తిగా కామిడీ లో ఇన్వాల్వ్ అయితే  రూల్స్ రంజన్ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అలరిస్తుంది.

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

rules ranjan review 5

దర్శకుడు రథినం కృష్ణ చాలా రోజుల తర్వాత లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ గా చిన్న పాయింట్ తో కధ వ్రాసుకొని కధనం తో రూల్స్ రంజన్ గా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసాడు.  ఈ సినిమాలో చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ బాగానే హ్యాండిల్ చేశాడు.

ఈ చిత్ర హీరో కిరణ్ అబ్బవరం సినిమాలోని తన పాత్రకు తగ్గట్లు లుక్స్ పరంగా అలాగే నటన పరంగా కూడా తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. పల్లే టూరి లుక్, కార్పొరేట్ లుక్  రెండింటిని బాగా నే హ్యాండిల్ చేశాడు.

అదే విధంగా హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి కూడా తన నటనతో ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో నేహా శెట్టి బాగానే మెప్పించింది. సమ్మోహనుడా సాంగ్ లో తన గ్లామర్ తో మెప్పించింది.

హీరోకు స్నేహితులుగా నటించిన హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్ చాలా బాగా నటించారు. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన మెహర్ చాహల్ నటించడానికి బాగానే తాపత్రయ పడింది.

వెన్నెల కిశోర్, సుబ్బరాజు, అజయ్, మకరంద్ దేశ్‌పాండే, గోపరాజు రమణ లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

rules ranjan review 1

దులీప్ కుమార్ ఎం.ఎస్ అందించిన ఫోటోగ్రఫీ సినీ ప్రేక్షకులను  ఆకట్టుకొనెల ఉంది.  సినిమాలోని ప్రతి సీన్ ని విజువల్ గా ఎంతో అందంగా చూపించారు.

అమ్రిష్ గణేష్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రేమ సన్నివేశాల్లో వచ్చే బీజీఎమ్ కూడా ఆకట్టుకుంది. సమ్మోహనుడా పాత అయితే సోషల్ మీడియా లో యూత్ ని బాగా ఆకట్టుకోంది.

దివ్యాంగ్‌ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఎన్నో భారీ బడ్జెట్ మరియు  హిట్ సినిమాలు తీసిన ఏ యం రత్నం గారి పరివేక్షణలో చక్కటి క్వాలిటి తో ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా ఉంది ఈ రూల్స్ రంజన్.

18F మూవీస్ టీం ఒపీనియన్:

 

ఓవరాల్ గా ఈ ‘రూల్స్ రంజన్’ కొన్ని చోట్ల స్లో అయినా పెద్దగా యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చే నార్మల్ సినీ ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇంకా ఈ  సినిమాలో కిరణ్ అబ్బవరం- నేహా శెట్టి నటన గురించి చెప్పుకోవాలి.  సింపుల్ గా మంచి కెమిస్ట్రీ అందించారు. ఓవరాల్ గా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలబడవచ్చు.

టాగ్ లైన్: రంజింప చేసే రంజన్ లవ్ 

18FMovies రేటింగ్: 3 / 5 

* కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *