మూవీ: రుద్రంకోట
విడుదల తేదీ :సెప్టెంబర్ 22, 2023
నటీనటులు: అనిల్ ఆర్కా కండవల్లి, విభీషా జాను, అలేఖ్యా, సీహెచ్ జయలలిత, భాస్కర్ రావు తదితరులు
దర్శకుడు : రాము కోన
నిర్మాత: అనిల్ ఆర్కా కండవల్లి
సంగీతం: కోటి
సినిమాటోగ్రఫీ: ఆదిమల్ల సంజీవ్
మూవీ రివ్యూ: రుద్రంకోట (Rudram Kota Movie)
బుల్లి తెర కోసం వేల ఎపిసోడ్స్ కి దర్శకత్వం వహించిన దర్శకుడు రాము మొదటి సారీ వెండితెర కోసం కధ రాసుకొని దర్శకత్వం వహించిన సినిమా ‘రుద్రంకోట’. ఈ రుద్రంకోట సినిమాతో అనిల్ ఆర్కా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రి కి హీరోగా పరిచయమయ్యారు. నటి సీహెచ్ జయలలిత సమర్పకురాలిగా వ్యవహరిస్తూ ముఖ్య పాత్రని పోసించారు .
ఈ రుద్రం కోట సినిమా ఈ శుక్ర వారం రోజున రిలీజ్ అయ్యింది. ఈ సిన్మా ఎట్లా ఉందో మా 18 f మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకొందామా !
కథ ని పరిశీలిస్తే (Story line):
గోదావరి వడ్డిన ఉండే రుద్రంకోట అనే ఊరిలో కోటమ్మ (సీనియర్ నటి సీహెచ్ జయలలిత) ఊరి మంచి కోర్ పెద్దగా ఉంటూ కొన్ని కట్టుబాట్లు తో ఉండాలి అని ఆ ఊరి ప్రజలను ఆదేశీస్తూంది. కోటమ్మా మాటకు తిరుగులేదు. కోటమ్మా పెట్టిన ఆచార కట్టుబాట్లను ఎవరు తప్పినా రుద్రడు (అనిల్ ఆర్కా ) వారిని నిర్దాక్షేణియంగా చంపి కాటిలో కాలచేస్తుంటాడు.
రుద్రంకోట ఊర్లో కోటమ్మ పెట్టిన ఆచార కట్టుబాట్లు ఏమిటి ?,
ప్రేమలో నిజాయితీ లేని జంటల పై కోటమ్మ – రుద్ర ఎందుకు శిక్షిస్తూంటారు ?,
ఆశలు రుద్రుడు ఎవరు ? ఎందుకు శ్మశానం లో ఉంటున్నాడు ?
రుద్రుడు ని శక్తి ఎందుకు ఇష్టపడుతుంది ?
కోటమ్మ మనవరాలు ధృతి (అలేఖ్య) రుద్రంకోటలోకి ఎందుకు అడుగుపెట్టింది ?
రుద్రను ప్రేమించిన శక్తి (విభీషా జాను) కథ ఏమిటి ?,
శక్తి శావుకు కారణం అయిన యువకులను రుద్ర ఎలా చంపాడు ?
అనే ప్రశ్నల కు జవాబులు కావాలి అంటే రుద్రంకోట సినిమా ని వెంటనే దియేటర్ లో చూసేయండి.
కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):
ఈ ‘రుద్రంకోట’ కధ గా మంచి సోషల్ మెస్సేజ్ నే అయిన కధనం నడిపిన విధానం మాత్రం అంతగా ఆకట్టుకొదు. సినిమా మొదటి అంకం ( ఫస్ట్ హాఫ్) చాలా స్లోగా సాగుతూ దియేటర్ లో ఉన్న ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. అలాగే సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో అనిల్ ఆర్కా క్యారెక్టర్ తాలూకు కేరక్ట్రేషన్ సరిగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.
స్లో కధనానికి తోడు జయలలిత పాత్ర కూడా బలంగా అనిపించదు. ఆమె చెప్పే డైలాగ్స్ కూడా అంత ఎఫెక్ట్ గా లేవు. ఆలాంటి ఆచార కట్టుబాట్లు ఇప్పటి సోషల్ మీడియా యువతకి నచ్చకపోవచ్చు. ఇదే కధను 70 s లేదా 8 0 s పీరియడ్ లో చేసిఉంటే కొంచెం కనెక్ట్ అయ్యేవారు. రుద్ర కోటమ్మా పాత్రలలనే శక్తి ( విభీషా జాను) క్యారెక్టర్ అయోమయం గా ఉంది.
శక్తి ఎందుకు రుద్ర ని అంత డీప్ గా లవ్ చేసిందో ఆమెకే తెలియాలి. మరో హీరోయిన్ దృత (ఆలేఖ్యా) కూడా హీరో వెంట పడుతూ ఉంటుంది. ఏ మాత్రం లాజిక్ లేని ఈ సీన్స్ వలన పాత్రల స్వభావం వలన సీన్స్ చాలా బోర్ అనిపించాయి.
ఓవరాల్ గా బుల్లి తెర సినీయర్ దర్శకుడి కథా కథనాల్లో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ – ప్లే కూడా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమా కి బాగా మైనస్ అయ్యాయి. దీనికితోడు అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. అప్పుడో ఎప్పుడో వచ్చిన శివ పుత్రుడు సినిమా లొని సూర్య చేసిన పాత్ర ను పోలిన పాత్రగా రుద్ర పాత్ర ని వ్రాసుకొన్నట్టు ఉంది.
దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:
రాము కోన వ్రాసుకొన్న కధ లొని పాయింట్ మంచిదే అయినా, దాన్ని సరైన పద్దతిలో ప్రెసెంట్ చేయలేకపోయాడు. ఊర్లో అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్లను, కోటమ్మ ఆజ్ఞతో రుద్ర శిక్షించే సన్నివేశాలు, రుద్ర – శక్తి మధ్య వచ్చే లవ్ సీన్స్, మరియు దృత తో సాగే బోల్డ్ సీన్స్ దర్శకుడి ప్రతిభతో బాగానే తీశాడు.
ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన రుద్ర కేరక్టర్ ని అనిల్ ఆర్కా కండవల్లి అద్భుతంగా నటించాడు. సినిమా చివరలో వచ్చే శివ తాండవం సాంగ్ లో పూనకం వచ్చినట్టు డాన్స్ చేసి మెప్పించాడు. సినిమా అంతా పల్లెలో శ్మశానం, రాళ్ళు పొలాలలో తీసినా హీరో 90% చెప్పులు లేకుండానే చేసినట్టు ఉన్నాడు. రుద్ర పాత్రకి సంబంధించిన ఎమోషనల్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన విభీషా జాను పాత్ర ఇలా మొత్తానికి ‘రుద్రంకోట’ సినిమాలో కొన్ని సీన్స్ బాగున్నాయి.
హీరోయిన్ విభీషా జాను కూడా ఈ సినిమాలో బాగానే నటించింది. చక్కని పల్లెటూరి అమ్మాయిల కనిపించింది.
అలాగే సెకండ్ హీరోయిన్ గా చేసిన అలేఖ్యా చాలా బోల్డ్ గా రెచ్చిపోయింది.
రుద్ర పాత్ర తర్వాత మరో ప్రధాన పాత్రలో సీహెచ్ జయలలిత బాగా నటించారు. భాస్కర్ రావుతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:
సినిమాలో చెప్పాలనుకున్న ఒకటి రెండు చోట్ల ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు కోటి నేపథ్య సంగీతం బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ ఆదిమల్ల సంజీవ్ వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఈ చిత్ర నిర్మాత అనిల్ ఆర్కా కండవల్లి పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
18F మూవీస్ టీం ఒపీనియన్:
రుద్రంకోట’ సినిమా అంతా ‘రా అండ్ రస్టిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ డ్రామాలో కొన్ని భావోద్వేగాలు పరవాలేదు కానీ కథ కథనాలు (స్క్రీన్ – ప్లే ) స్లోగా సాగడంవలన ,మొదటి అంకం ( ఫస్ట్ హాఫ్) లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం, టివి సీరియల్ లాగ అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నడపడం, దీనికితోడు పేలవమైన పాత్రల స్వభావం వంటి అంశాలు సినిమా చూసే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కి బదులు విసుగు చిరాకు కలిగిస్తాయి.
టాగ్ లైన్: రా అండ్ రాష్టీక్ బొల్డ్ పాత్రల కోట !
18FMovies రేటింగ్: 2 / 5
* కృష్ణ ప్రగడ.