డిసెంబర్‌ 17న గ్రాండ్‌గా విడుదలవుతోన్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఐ లవ్‌ యు ఇడియట్‌’’

love you IDIAT movie release on Dec17th e1670685582695

 

అవిరుద్ర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై బెక్కెం వేణుగోపాల్, శ్రీమతి వసంత సమర్పణలో ఎపి అర్జున్‌ దర్శకత్వంలో విరాట్‌, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘‘ఐ లవ్‌ యు ఇడియట్‌’’.సాయి కిరణ్‌ బత్తుల, సుదర్శన్‌ గౌడ్‌ బత్తుల, ఎపి అర్జున్‌ నిర్మాతలు.

love you idiat trailer

ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్‌ 17న గ్రాండ్‌గా విడుదలవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ ‘‘ఐ లవ్‌ యు ఇడియట్‌’’.చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది.

love you Idiat stills 1

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్‌ సాయికిరణ్‌బత్తుల మాట్లాడుతూ…‘ బెక్కెం వేణుగోపాల్ గారి ప్రెజెన్స్ లో మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము విడుదల చేసిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.మంచి చిత్రాల్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.

love you idiat stills 2

ఒక మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రాలను ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమా నిర్మించాము. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పెద్ద చిత్రాల్లో నటిస్తున్న శ్రీలీల మా చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఆమె అందం, అభినయం మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

love you idiat రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఐ లవ్‌ యు ఇడియట్‌ 1 Copy
చిత్ర దర్శకుడు ఎపి అర్జున్‌ మాట్లాడుతూ…చిన్న సినిమాలకు సపోర్ట్ గా నిలిచే బెక్కెం వేణుగోపాల్ గారు మా సినిమా రిలీజ్ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మేము విడుదల చేసిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

love you idiat 4 Copy

‘ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ చిత్రం ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఈ నెల 17న వస్తోన్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

విరాట్‌, శ్రీ లీలా జంటగా నటించిన ఈ చిత్రానికి
సంగీతం: వి. హరికృష్ణ,
పాటలు: పూర్ణాచారి,
కెమెరా: అర్జున్‌ శెట్టి
ఎడిటర్‌: దీపు ఎస్‌ కుమార్‌
ఆర్ట్‌ : రవి ఎస్‌
ఫైట్స్‌: డా. కె రవి వర్మ
కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : సానియా సర్దారియా
Pro మధు విఆర్
నిర్మాతలు : సాయి కిరణ్‌ బత్తుల, సుదర్శన్‌ గౌడ్‌ బత్తుల
రచన – దర్శకత్వం : ఎపి అర్జున్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *