ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాణ దర్శకత్వంలో బిఎస్ రెడ్డి సమర్పణలో ఢీ జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్ గా, కిరణ్ హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం RK దీక్ష. తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీతం అందించగా మేఘన శ్రీను ఎడిటర్ గా పనిచేశారు.
RK దీక్ష చిత్ర విడుదల దగ్గర పడుతున్న సందర్భంగా చిత్ర ప్రముఖుల చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్, సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, తెలుగు చిత్ర ప్రొడ్యూస్ కౌన్సిల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
చిత్ర దర్శక నిర్మాత పితాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… “నేడు సాంగ్ & ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారికి, ఇతర అతిథులకు, మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. RK దీక్ష చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని అనుకుంటున్నాను. ఎన్టీఆర్ గారి అభిమానిగా ఆయన సినిమా పేరు మీద మరొక సినిమా చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ గారిని గుర్తు చేసుకుంటూ ఒక పాట ఉంటుంది.

హీరోగా కిరణ్, హీరోయిన్ గా ఢీ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన అక్స ఖాన్ చేస్తున్నారు. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్ అక్స ఖాన్ హీరోయిన్… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. మా చిత్రానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ చిత్ర ట్రైలర్, సాంగ్స్ నచ్చాయని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా కష్టపడి పనిచేశారు. ఈ సినిమాలో నేను కూడా కోరియోగ్రఫీ చేశాను. డాన్సర్ గా, నటిగా నన్ను మరింత ప్రోత్సహిస్తారని ప్రేక్షకులను ప్రార్థిస్తున్నాను” అన్నారు.
నిర్మాత తుమ్మల రామ సత్యనారాయణ మాట్లాడుతూ… “RK దీక్ష చిత్ర బృందం అందరికీ ప్రేక్షకులు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను” అన్నారు.

ప్రొడ్యూస్ కౌన్సిల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ… “రామకృష్ణ గారి RK దీక్ష చిత్రం మంచి విజయం సాధించాలని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ… “RK దీక్ష చిత్ర ట్రైలర్, సాంగ్ చాలా బావున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
పల్లి కేశవరావు మాట్లాడుతూ… “RK దీక్ష చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న రామకృష్ణ గౌడ్ గారికి మంచి శుభం జరగాలని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
పద్మిని మాట్లాడుతూ… “RK దీక్ష చిత్రంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ గారికి ఒక పాట అంకితం చేయడం గర్వించదగిన విషయం. హీరోయిన్ అక్స ఖాన్ కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
అజయ్ మాట్లాడుతూ… “RK దీక్ష చిత్ర టైటిల్ చాలా బావుంది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుని నిర్మాతకు మంచి సంపద లభించాలని కోరుకుంటున్నాను. పాటలోని లిరిక్స్ నాకు చాలా నచ్చింది, సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

చిత్ర సమర్పకులు డిఎస్ రెడ్డి మాట్లాడుతూ… “RK దీక్ష చిత్ర కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాలో ఒక జవాన్ కు సంబంధించి చూపించాము. జవాన్లు బోర్డర్ లో చలికి వణుకుతూ, ఆకలితో దీక్షగా ఉంటారు. అటువంటి చిత్రం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ… “RK దీక్ష చిత్ర ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరుపేరునా నమస్కారాలు. ఇటువంటి చిన్న సినిమాల వల్ల ఎంతో మంది ఉన్నత స్థాయికి వెళ్ళారు. అటువంటి చిన్న సినిమాలకు అందరూ సపోర్ట్ చేసి ఈ సినిమాకు విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ఈ సందర్భంగా మన ప్యానెల్ సభ్యులు మాట్లాడుతూ… “చిన్న సినిమా తీస్తే ఎంతో మంది ప్రతిభావంతులు కొత్త వారు పైకొస్తారు. చిన్న సినిమా పరిశ్రమకు అవసరం, ప్రోత్సహిద్దాము. మన ప్యానెల్ వైపు బరిలో మూడు సెక్టార్స్ లో నిల్చున్నాము. నిర్మాతలు స్టూడియో సెక్టార్ లో గెలిచాము. అవతల ప్యానెల్ లో చిన్న నిర్మాతల సపోర్ట్ మీకు లభించింది, అది గుర్తు పెట్టుకొండి.
గతంలో రామా నాయుడు, కె.ఎస్ రామారావు, అశ్వనీదత్ ఇలా గొప్ప నిర్మాతలు సినిమాలు తీశారు, కొత్త వారిని ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఓ వ్యక్తి చేతిలో ఉంది. దిల్ రాజు కూడా సినిమాలు తీయలేని పరిస్దితి. రిలీజ్ కు ముందు కూడా సినిమాలు ఎందుకు అగుతున్నాయి.
చిన్న నిర్నాత సినిమాకు రిలీజ్ కు ముందు, పెద్ద నిర్మాత రిలీజ్ కు తరువాత ఫాల్స్ ప్రెస్టేజ్ కు పోయి ఏడుస్తున్నాడు. నా వద్దకు వచ్చి బాధలు చెప్పుకున్న వారు ఎందరో ఉన్నారు. నిర్మాతలు బాగుండాలి, మంచి వాతావరణం ఉండాలి. హీరోలు కూడా గాలిలో నడిచే నిర్మాతలకు డేట్స్ ఇస్తున్నారు.
ఒకప్పుడు కె.ఎస్ రామారావు , ఎం.ఎస్ రాజు లాంటి వారు హీరోలను సృష్టిస్తే , వారు స్టార్స్ గా ఇండస్ట్రీ లో ఎదిగారు. కానీ అలాంటి వారు ఇప్పుడు సినిమాలు తీయలేకున్నారు. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ బాగుండేలా చూద్దాం. ఒక్కడినే దోచుకుందాం అనుకుంటే, మిమల్ని ఆ దేవుడే చూసుకుంటాడు” అంటూ ముగించారు.
నటీనటులు :
కిరణ్, అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు.
సాంకేతిక బృందం :
దర్శక నిర్మాత : డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ , సమర్పకులు : డిఎస్ రెడ్డి , బ్యానర్స్ : ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ ,సంగీతం : రాజు కిరణ్ , ఎడిటర్ : మేఘన శ్రీను , ఫైట్స్ : రవి , డాన్స్ : ఆనంద్ , పిఆర్ఓ : మధు విఆర్.