రిషబ్ శెట్టి ‘కాంతారా’ సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు సొంతం చేసుకున్న కన్నడ నటుడు. ఈ సినిమాకి దర్శకుడు కూడా అతనే అన్న విషయం అందరికీ తెలిసిందే.
కన్నడ సహా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై నెల రోజులు అవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తునే ఉంది. ఈ హీరో ‘కాంతారా’ కంటే ముందు కొన్ని డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. బెల్‌బాటమ్, హీరో చిత్రాలు అలా వచ్చినవే.

అయితే రిషబ్ నేరుగా ఒక తెలుగు సినిమాలో కనిపించాడు. ఆ పాత్రకి తాను ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండ.చేశాడు. ఆ సినిమానే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస.ఆత్రేయ’ ఫేం స్వరూప్ ఆర్ ఎస్ జే డైరెక్ట్ చేసిన ‘మిషన్ ఇంపాజిబుల్’.

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ముంబై మాఫియా డాన్ కి సన్నిహితుడుగా నమ్మించే సన్నివేశంలో కనిపిస్తాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఈ సినిమా లో కూడా తాను నాటకాలు వేస్తూ ఉన్న రోల్ చేయడమే అవ్వడం విశేషం.

అలా ఈ సినిమాలో అతిథి పాత్రలో మెరిశాడు రిషబ్ శెట్టి. సినిమాలో దావూద్ ను పట్టుకునేందుకు ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు తమ పేర్లను రఘుపతి రాఘవ రాజారాం ఆర్ఆర్ఆర్ అని చెప్తే దానికి బదులుగా ఖలిఫ్ జాఫర్ ఫరూక్ కేజీఎఫ్ అని బదులు ఇచ్చే సన్నివేశంలో కనిపిస్తాడు రిషబ్.
ఈ సీన్ ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా ట్రైలర్ లో కూడా చూడవచ్చు.