రిచా చద్దా ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్. నిజంగా పెళ్లి చేసుకొంటుందా లేక సోషల్ మీడియా కోసం ఫ్రీ వెడ్డింగ్ ఫోటో ఘాట్ చేసిందా ?.
బాలీవుడ్ హీరోయిన్లలో అందం, అభినయంతో రాణిస్తున్న వారిలో రిచా చద్దా ఒకరు. ఎలాంటి విషయాన్నైనా కుండల బద్దలు కొట్టినట్టు చెప్పడం రిచాకు అలవాటు.
షకీలా సినిమాతో హిందీతోపాటు తెలుగులోనూ రచ్చ చేసింది ఈ బ్యూటి. అలాగే ఇటీవల విడుదలైన ఇన్ సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ తోఓ టి టి ప్రియులకు చాలా బాగా పాపులర్ అయింది.
వెబ్ సిరీస్లు సినిమాలతో బిజీగా ఉండే రిచా చద్ధాకు అలనాటి బాలీవుడ్ తారలు స్మితా పాటిల్, షబానా ఆజ్మీ, దీప్తి నావల్ లాంటి వాళ్లు నాకు సినీ పరిశ్రమలో ఆదర్శం.
ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే అందాల విందు మాములుగా కుర్రకారుకి జాతారే. మరీ ఘాటుగా పోజులిస్తూ.. మత్తెక్కించేలా చూస్తూ యువకులను రెచ్చగొడుతోంది ఈ హాట్ బ్యూటి. త్వరలో ఈ హాట్ హీరోయిన్ బాలీవుడ్ యాక్టర్ అలీ ఫజల్ ను వివాహం చేసుకోనుంది.
దాదాపు తొమిదేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అన్నది బాలీవుడ్ బాతాకాని.
వచ్చే నెల అంటే అక్టోబర్ 4న ఢిల్లీలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ ను మొదలెట్టేశారు.
తాజాగా ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది రిచ్ అందాల సుందరి రిచా చద్దా. ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సెలబ్రిటీల నుంచి నెటిజన్ల వరకు శుభాకాంక్షలు చెబుతూ ఈ జంటను ఆశీర్వదిస్తున్నారు.
అయితే ఈ ప్రీ వెడ్డింగ్ ఫొటోలే కాకుండా ఇంతకుముందు రిచా చద్ధా చేసిన బోల్డ్ ఫొటోషూట్స్ కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి.