‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి ! రిలీజ్ ఎప్పుడంటే ! 

IMG 20250315 WA0059 scaled e1742017057990

శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్స్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న చిత్రం ‘రైస్ మిల్’. యూత్ ఫుల్‌ డ్రామాగా రూపుదిద్దుకోబోతోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది.

లౌక్య, మేఘన, హరీష్, కార్తిక్, వరుణ్, కేశవ, దిల్ రమేష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కనున్న ఈ చిత్రంతో సి.ఎం.మహేష్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా..ఎమ్.వంశీధర్ రెడ్డి, శ్రీనివాస్ సాయిని నిర్మిస్తున్నారు. బి.ఆర్.రాజేష్ సహా నిర్మాతగా, సుధాకర్ విశ్వనాధుని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

IMG 20250315 WA0057

 యువత గ్రామాలకు, గ్రామాలు దేశానికి వెన్నెముక అనే కాన్సెప్ట్ తో రైస్ మిల్ చిత్ర కథాంశం ఉంటుంది. కేవలం 21 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకొని ఈ వేసవిలో విడుదలకు సిద్దంగా ఉంది. హైదరాబాద్ మరియు చుట్టు పక్కల గ్రామాల్లో ఈ చిత్ర షూటింగ్ జరుపుకుంది.

ఉగాది సందర్భంగా ఈ చిత్ర సాంగ్స్ ను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో 5 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి.

లౌక్య, మేఘన, హరీష్, కార్తిక్, వరుణ్, కేశవ మరియు దిల్ రమేష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి నిర్మాతలు ఎమ్.వంశీధర్ రెడ్డి, శ్రీనివాస్ శైని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం సతీష్ సాధన్, సినిమాటోగ్రఫీ ఈదర ప్రసాద్, ఎడిటర్ అనుగోజు రేణుకా బాబు, ఫైట్స్ శంకర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *