RGV Vyuham Movie censored with clean U: ఆర్జీవీ “వ్యూహం” క్లీన్ U సర్టిఫికెట్ తో విడుదల ఎప్పుడంటే?

20231215 170054 e1702639940295

 

అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేనట్లే తన “వ్యూహం” సినిమా రిలీజ్ ను కూడా ఎవరూ అడ్డుకోలేరని గతంలోనే చెప్పానని గుర్తుచేశారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ ఆర్జీవీ “వ్యూహం” సినిమాను రూపొందించారు.

20231215 170100

ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. సెన్సార్ అడ్డంకులు దాటుకున్న వ్యూహం సినిమా క్లీన్ యూ సర్టిఫికెట్ తో ఈ నెల 29న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఇవాళ వ్యూహం సినిమా ట్రైలర్ 2 ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..

IMG 20231215 WA0100

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ : సెన్సార్ అడ్డంకులతో మా వ్యూహం సినిమా ఆగిపోయినప్పుడే చెప్పాను. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేనట్లే..మా సినిమా థియేటర్స్ లోకి రావడాన్నీ అడ్డుకోలేరని. ఇవాళ అదే జరిగింది. అందుకే ఫస్ట్ టైమ్ సెన్సార్ సర్టిఫికెట్ తో పోస్టర్ డిజైన్ చేయించాం. ఈ నెల 29న గ్రాండ్ గా వ్యూహం సినిమాను రిలీజ్ చేస్తున్నాం.

20231215 170130

ఇందులో రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పాత్రలను పోలిన క్యారెక్టర్స్ ఉంటాయి. అయితే వాటికి చంద్రబాబు, పవన్ రియల్ లైఫ్ కు సంబంధం లేదు. ఈ వ్యూహం కథలో వైఎస్ రాజ శేఖర రెడ్డి మరణం నుండి మొదలై జగన్ అరెస్ట్, ఆయన పార్టీ పెట్టి సీఎం అవడం, వైఎస్ వివేక హత్య వంటి అనేక ముఖ్య సంఘటనలు ఉంటాయి. సినిమా అంటే డ్రామా కాబట్టి ఆ ఘటనలన్నీ డ్రమటిక్ గా సినిమా చూసే ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాను.

సలార్ తో మా సినిమాకు పోటీ ఉండదు. రెండు వేర్వేరు జానర్ మూవీస్. ఏ సినిమా చూసే ఆడియెన్స్ ఆ సినిమాకు సెపరేట్ గా ఉంటారు. ఈ కథలోని అంశాలు ప్రజలందరికీ తెలిసిన విషయాలు కావు. ఇన్ సైడ్ జరిగిన విషయాలు. అలాంటి అంశాలు ఈ సినిమాలో చూపిస్తున్నాం.

పవన్ కల్యాణ్ జనసేన పెట్టినప్పుడు ప్రసంగం విన్నాను. ఆ తర్వాత పవన్ స్టెప్స్ చూస్తే…ఆయన రాజకీయ ప్రయాణంలో స్థిరత్వం లేదనిపించింది. ఏ విషయాన్నైనా ఎవరికి వారు వారి కోణంలో అర్థం చేసుకుంటారు. వ్యూహం నాకు అర్థమైన కోణంలో రూపొందించిన సినిమా.

20231215 170044

వ్యూహంలో మీకున్న డౌట్స్ నా రాబోయో మూవీ శపథం చూస్తే క్లియర్ అవుతాయి. నేను రాజకీయాల్లో లేకున్నా ఆ పొజిషన్స్ లో ఉన్న వారు ఎలా ప్రవర్తిస్తారు అనే ఐడియా ఉంది. తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి డైనమిక్ గా వ్యవహరించారు. ఆయన ఒక స్ట్రాంగ్ అపోజిషన్ గా నిలబడటం వల్లే ఇవాళ కాంగ్రెస్ గెలిచింది. ఏపీలో తెలంగాణలో ఉన్నంత స్ట్రాంగ్ అపోజిషన్ పాత్రను చంద్రబాబు

పోషించలేకపోతున్నారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా నేను చేసినన్ని వెరైటీ మూవీస్ మరొకరు చేసి ఉండరు. వాటిలో బయోపిక్స్ ఐదారు వరకు ఉంటాయి. పాపులర్ పర్సన్ మీద సినిమా చేసినప్పుడు మీడియా అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగతంగా నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు. అన్నారు.

IMG 20231215 WA0098

నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ – దేవుడు కొందరి చేత కొన్ని పనులను లోక కల్యాణం కోసం చేయిస్తుంటాడు. అలా నాతో ఈ సినిమా చేయించాడు అని భావిస్తున్నా. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తిని ఎవరూ డబ్బుతో కొనలేరు అనేది నా అభిప్రాయం. ఆర్జీవీకి వెలకట్టలేని వ్యక్తిత్వం ఉంది. ప్యాకేజీలకు అతీతమైన వ్యక్తి ఆయన.

20231215 170136

వంగవీటి తర్వాత నేను వర్మ గారితో చేస్తున్న సినిమా ఇది. మా మధ్య కోఆర్డినేషన్ బాగుండేది. కలిసి సినిమా చేయాలని అనుకున్నాం. అలా వ్యూహం, శపథం ప్రాజెక్ట్స్ మొదలయ్యాయి. ప్రతివారం థియేటర్స్ లోకి మూడు నాలుగు సినిమాలు రావడం సహజమే. మా వ్యూహం సినిమాకు కూడా ఎక్కువ సంఖ్యలోనే థియేటర్స్ లో రిలీజ్ చేస్తాం. అన్నారు.

నటీనటులు :

 

అజ్మల్, మానస తదితరులు

 

టెక్నికల్ టీమ్ :

డీవోపీ – సుజీష్ రాజేంద్రన్, ఎడిటర్– మనీష్ ఠాకూర్, పిఆర్వో– శివమల్లాల, నిర్మాత – దాసరి కిరణ్ కుమార్, దర్శకత్వం – రామ్ గోపాల్ వర్మ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *